ఫోటోలు: మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన యువీ, కీచ్

Posted By:
Subscribe to Oneindia Telugu

మొహాలి: టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి, మోడల్ హాజెల్ కీచ్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం చండీగఢ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఫతేగఢ్ సాహిబ్ గ్రామం వద్ద ఉన్న ధార్మిక కేంద్రం 'బాబా రాందేవ్ సింగ్ డేరా'లో అంగరంగ వైభవంగా జరిగింది.

యువీ-కీచ్‌ల పెళ్లి ఫోటోల గ్యాలరీ

‘ఆనంద్ కరాజ్’ పద్ధతిలో యువరాజ్, కీచ్‌ల వివాహం

‘ఆనంద్ కరాజ్’ పద్ధతిలో యువరాజ్, కీచ్‌ల వివాహం

పంజాబీ సంప్రదాయం ‘ఆనంద్ కరాజ్' పద్ధతిలో యువరాజ్, కీచ్‌ల వివాహం జరిగింది. వివాహం అనంతరం నూతన దంపతులు బాబా రామ్‌సింగ్‌ ఆశీర్వాదాలు తీసుకున్నారు.

తల్లి షబ్నం సింగ్‌ దగ్గరుండి మరీ

తల్లి షబ్నం సింగ్‌ దగ్గరుండి మరీ

యువరాజ్‌ తల్లి షబ్నం సింగ్‌ అత్యంత ఇష్టపడే, ఎంపికచేసిన వేదికలో యువీ.. హజెల్‌కీచ్‌ మెడలో తాళి కట్టాడు. నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్లి వేడుక ఏర్పాట్లను తల్లి షబ్నమ్ సింగ్ దగ్గరుండి మరీ పర్యవేక్షించారు.

కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే

కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే

ఈ పెళ్లికి రెండు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి సందర్భంగా బాబా రాందేవ్ సింగ్ డేరా వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

 పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయిన వధూవరులు

పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయిన వధూవరులు

నూతన వధూవరులు పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయారు. మెరూన్‌, బంగారు వర్ణంలోని షేర్వాణీలో యువరాజ్ కత్తి చేతబట్టి రాజసం ఉట్టిపడింది.

అందంగా నగలు అలంకరించుకున్న హాజెల్ కీచ్

అందంగా నగలు అలంకరించుకున్న హాజెల్ కీచ్

ఇక వధువు హజెల్‌కీచ్‌ రిచ్‌ డిజైనరీ లెహంగాతో అందంగా నగలు అలంకరించుకొని ఉంది. ఈ వివాహానికి యువీ తండ్రి యెగ్‌రాజ్‌ సింగ్‌ హాజరుకాలేదు.

యువీ తండ్రి గైర్హాజరు

యువీ తండ్రి గైర్హాజరు

అయితే పెళ్లికి ముందు రోజు మంగళవారం రాత్రి జరిగిన మెహందీ, సంగీత్ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టీమిండియా హాజరైన సంగతి తెలిసిందే.

సిక్కు సంప్రదాయం ప్రకారం పెళ్లి

సిక్కు సంప్రదాయం ప్రకారం పెళ్లి

బుధవారం చండీగఢ్‌లో సిక్కు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగ్గా డిసెంబర్ 2న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం జరిపించనున్నారు.

డిసెంబర్ 7న ఢిల్లీలో రిసెస్షన్

డిసెంబర్ 7న ఢిల్లీలో రిసెస్షన్

ఈ కార్యక్రమానికి వధూవరుల కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారు. డిసెంబర్ 7న ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The big fat Indian cricket wedding of the year is under way, and fans have been bombarded with gorgeous photos of ace cricketer Yuvraj Singh and his partner Hazel Keech, starting with the mehendi ceremony on November 29.
Please Wait while comments are loading...