300వ వన్డే: అరుదైన మైలురాయికి అడుగు దూరంలో యువీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 17 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు. టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలనందించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన మైలురాయిని అందుకోబోతున్నాడు. కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమైన 300 వన్డేల మార్కును చేరేందుకు యువరాజ్ సింగ్ కేవలం అడుగు దూరంలో నిలిచాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే యువీకి 300వ వన్డే కావడం విశేషం. భారత తరపున కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే మూడొందల వన్డేల మైలురాయిని అందుకున్నారు. తాజాగా యువీ వారి సరసన చేరనున్నాడు. అంతకుముందు టీమిండియా మాజీ క్రికెటర్లు అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌లు మాత్రమే 300 వన్డేలు ఆడిన వారి జాబితాలో ఉన్నారు.

క్రికెటర్‌గా పరిచయం అక్కర్లేని పేరు

క్రికెటర్‌గా పరిచయం అక్కర్లేని పేరు

టీమిండియా తరుపున 40 టెస్టు మ్యాచ్‌లాడిన యువీని క్రికెటర్‌గా పరిచయం చేయనక్కర్లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా దిగ్గజ ఆటగాళ్ల జాబితా రూపొందిస్తే అందులో యువరాజ్ సింగ్‌కి ఓ పేజీ తప్పకుండా ఉంటుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనిల తర్వాత ఠక్కున గుర్తుకు వచ్చే పేరు యువరాజ్ సింగ్.

2000లో అరంగేట్రం చేసిన యువరాజ్

2000లో అరంగేట్రం చేసిన యువరాజ్

2000వ సంవత్సరంలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కెన్యాతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తన 17 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో తనదైన మార్కును చూపెడుతూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2007లో టీమిండియాకు మినీ వరల్డ్ కప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ 2011 వన్డే వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నాడు.

2002 నాట్ వెస్ట్ ఫైనల్లో విజృంభణ

2002 నాట్ వెస్ట్ ఫైనల్లో విజృంభణ

ఇక 2002లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాట్ వెస్ట్ ఫైనల్లో టీమిండియా విజయం సాధించడంలో యువరాజ్ కీలకపాత్ర పోషించాడు. 320కి పైగా పరుగుల చేధనను టీమిండియా అలవోకగా చేధించడంలో ముఖ్యభూమిక పోషించాడు. 2007లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు సిక్సులు బాదిన ఓవర్ అభిమానులకి ఇప్పటికీ గుర్తే.

 క్లబ్‌ బ్యాట్స్‌మన్‌లా చిన్నబోయా

క్లబ్‌ బ్యాట్స్‌మన్‌లా చిన్నబోయా

ఇక ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై యువరాజ్ సింగ్ చెలరేగిన ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్‌పై కెప్టెన్ కోహ్లీ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు. యువీ చెలరేగి ఆడుతుంటే.. అతని ముందు తానొక క్లబ్‌ బ్యాట్స్‌మన్‌లా చిన్నబోయానని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ అంగీకరించాడు.

యువీ ముమ్మూటికి గేమ్‌చేంజర్‌

యువీ ముమ్మూటికి గేమ్‌చేంజర్‌

యువరాజ్‌ అద్భుతంగా ఆడాడు. నేను సరిగ్గా ఆడలేకపోయిన సమయంలో నాపై ఉన్న ఒత్తిడినంతా అతను దూరం చేశాడు. అతని ముందు నేనొక క్లబ్‌ బ్యాట్స్‌మన్నేమో అనిపంచింది. అతను ముమ్మూటికి గేమ్‌చేంజర్‌. అందుకే జట్టులోకి తీసుకున్నాం' అని కోహ్లీ అన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
He was a storehouse of talent at the onset, a rare blend of grace and power, but for the better part of his 17-year-career, Yuvraj Singh has been an enigma as well as a paradox in Indian cricket.
Please Wait while comments are loading...