న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ర్యాంకులు: కోహ్లీనెంబర్ వన్, టీమిండియాకు 2

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నెంబర్ వన్ స్ధానంలో నిలిచాడు. టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకుకి చేరుకున్నాడు. 
 

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకుకి చేరుకున్నాడు. బెంగుళూరు వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో 6 వికెట్లు తీసుకుని భారత విజయంలో కీలకపాత్ర పోషించిన చాహల్ ఏకంగా 92 స్థానాలు ఎగ‌బాకి 86వ ర్యాంకుకు చేరాడు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నెంబర్ వన్ స్ధానంలో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో టీమిండియా ఒక‌స్థానం మెరుగుప‌ర‌చుకొని రెండో ర్యాంకుకు చేరింది.

Yuzvendra Chahal makes impressive gain in T20I rankings after six-wicket haul

బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో రెండోస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ ఆరోన్ ఫించ్ కంటే 28 పాయింట్ల లీడ్‌లో కోహ్లి ఉన్నాడు. టెస్టుల్లో రెండోస్థానం, వ‌న్డేల్లో మూడోస్థానంలో ఉన్న విరాట్ కోహ్లి.. అన్ని ఫార్మాట్ల‌లో టాప్ 5లో ఉన్న ఏకైక భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు.

ఇక భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా రెండోస్థానంలో నిలిచాడు. వెటరన్ ఆటగాడు ఆశిష్ నెహ్రా రెండు స్ధానాలు ఎగబాకి 24వ స్ధానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 8వ స్ధానంలో నిలిచాడు. టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో టాప్ స్కోర‌ర్‌గా నిలిచిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్‌ రెండు స్థానాలు మెరుగుప‌ర‌చుకొని ఐదో స్థానంలో నిలిచాడు.

ICC T20I Rankings (as of February 2 2017 including India Vs England series)

(Read as Rank, Player, Team, Points)

Top 5 T20I Batsmen:

1. Virat Kohli (India) 799

2. Aaron Finch (Australia) 771

3. Glenn Maxwell (Australia) 763

4. Kane Williamson (New Zealand) 758

5. Joe Root (England) 743


Top 5 T20I Bowlers:

1. Imran Tahir (South Africa) 768

2. Jasprit Bumrah (India) 764

3. Samuel Badree (West Indies) 723

4. Imad Wasim (Pakistan) 718

5. Rashid Khan (Afghanistan) 701


Top 5 T20I Teams:

(Read as Rank, Team, Points)

1. New Zealand 129

2. India 124 (+1)

3. West Indies 116

4. South Africa 115 (-4)

5. Australia 115

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X