న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్: మంచి నిర్ణయమంటూ ప్రశంసలు

అనిల్ కుంబ్లే రాజీనామా అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ ఎవరవుతారని క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం తదుపరి కోచ్ ఎవరన్న సస్పెన్స్‌కు తెరపడింది. టీమిండియా ప్రధాన

By Nageshwara Rao

హైదరాబాద్: అనిల్ కుంబ్లే రాజీనామా అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ ఎవరవుతారని క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం తదుపరి కోచ్ ఎవరన్న సస్పెన్స్‌కు తెరపడింది. టీమిండియా ప్రధాన కోచ్‌ పదవి అందరూ ఊహించినట్లే రవిశాస్త్రిని వరించింది.

అయితే బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ ఎంపికవ్వడం ఎవరూ ఊహించలేదు. అంతేకాదు గతంలో ఏ జట్టుకూ లేని విధంగా ఈ సారి కొత్తగా 'విదేశీ పర్యటనల్లో బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌' అనే పదవిని బోర్డు సృష్టించింది. టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ టెస్టు ఫార్మాట్‌లో ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారని బీసీసీఐ ప్రకటించింది.

ఇప్పటికే ఇండియా ఏ, అండర్‌ 19 జట్లకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహారిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే రాహుల్ ద్రవిడ్‌తో బీసీసీఐ రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ ఈ కొత్త బాధ్యతలను అదనంగా అప్పగించింది.

క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) తీసుకున్న ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం ప్రశంసిస్తున్నారు. జహీర్ ఖాన్... భారత అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. జహీర్ ఆడే రోజుల్లో తన పదునైన బౌలింగ్‌తో జట్టుకు ఎన్నో అపురూప విజయాలు అందించాడు. ధోని కెప్టెన్సీలో టీమిండియా టెస్టుల్లో నెంబర్ వన్ అవడంలో కీలకపాత్ర పోషించాడు.

గాయాల కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 38 ఏళ్ల జహీర్‌ భారత్‌ తరఫున 82 టెస్టుల్లో 311 వికెట్లు, 200 వన్డేల్లో 282 వికెట్లు తీశాడు. వీడ్కోలు అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లతో కూడా జహీర్ ఖాన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి.

జహీర్ ఖాన్ అనుభవం

జహీర్ ఖాన్ అనుభవం

దీంతో జహీర్ ఖాన్ అనుభవం, బౌలింగ్‌లో అతడి పరిజ్ఞానం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. రాబోయే రోజుల్లో టీమిండియా విదేశీ పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. ఇలాంటి సమయంలో టీమిండియా బౌలింగ్ మరింతగా మెరుగవడంలో జహీర్ ఖాన్ మరింత కీలకం కానున్నాడు. నిజానికి అధికారికంగా బౌలింగ్ కోచ్ పదవికి జహీర్ ఖాన్ కొత్త కావచ్చు. కానీ టీమిండియాకు జహీర్ ఆడిన రోజుల్లో జూనియర్ బౌలర్లకు మార్గనిర్దేశం చేయడాన్ని చాలా మ్యాచ్‌ల్లో మనం చూశాం.

ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కెప్టెన్‌గా

ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కెప్టెన్‌గా

ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో కూడా కెప్టెన్‌గా బౌలింగ్ కోచ్‌గా యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేశాడు. మంగళవారం రాత్రి అత్యంత నాటకీయ పరిణామాల మధ్య రవిశాస్ర్తిని భారత జట్టుకు కోచ్‌గా నియమిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ను బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది.

జహీర్ సలహాలు ఎంతో మేలు చేస్తాయి

జహీర్ సలహాలు ఎంతో మేలు చేస్తాయి

ఈ మేరకు బోర్డు ప్రకటన చేసింది. ‘‘జహీర్‌ అద్భుతమైన క్రికెటర్‌. భారత్‌కు ఆడే రోజుల్లో కూడా యువ ఫాస్ట్‌ బౌలర్లకు మార్గనిర్దేశం చేసేవాడు. గత కొన్నేళ్లుగా విశేషంగా రాణిస్తున్న యువ పేసర్లకు అతడిచ్చే సలహాలు ఎంతో మేలు చేస్తాయి'' అని బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి చెప్పాడు.

2019 వన్డే వరల్డ్‌కప్‌ వరకూ

2019 వన్డే వరల్డ్‌కప్‌ వరకూ

ఈ ఇద్దరూ రెండేళ్లపాటు అంటే 2019 వన్డే వరల్డ్‌కప్‌ వరకూ సేవలు అందించనున్నారు. శ్రీలంక పర్యటన నుంచే వీరు బాధ్యతలు తీసుకోనున్నారు. బ్యాటింగ్‌ కోచ్‌గా సంజయ్‌ బంగర్‌ను కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించించింది. అయితే విదేశాల్లో బ్యాటింగ్‌ వైఫల్యాన్ని దృష్టిలోపెట్టుకొని విదేశీ పర్యటనల్లో ద్రవిడ్‌ను బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా నియమించింది. ఈ మేరకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా వెల్లడించారు. క్రికెట్‌ సలహా కమిటీ సూచన మేరకు టీమిండియాకు రెండేళ్లపాటు రవిశాస్త్రిని ప్రధాన కోచ్‌గా, జహీర్‌ ఖాన్‌ను బౌలింగ్‌ కోచ్‌గా నియమించాలని భావించామని ఆయన అన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X