బౌలింగ్ కోచ్‌పై స్పష్టత: జహీర్‌.. ఏడాదిలో 150 రోజులు మాత్రమే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జహీర్ ఖాన్ టీమిండియాకు పూర్తి స్థాయి బౌలింగ్ కోచ్ కాదనే విషయంలో మరింత స్పష్టత వచ్చింది. టీమిండియా బౌలింగ్ కన్సల్టెంట్‌గా జహీర్‌ ఖాన్‌కు 150 రోజుల కాంట్రాక్ట్‌ను ప్రతిపాదించినట్టు బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరవ్‌ గంగూలీ చెప్పాడు.

'ఏడాదిలో 150 రోజులు పని చేసేలా జహీర్‌తో ఒప్పందం కుదిరింది' అని శుక్రవారం ఈడెన్ గార్డెన్స్‌లో గంగూలీ వెల్లడించాడు. అంటే ఏడాదిలో కేవలం 5 నెలలు మాత్రమే జహీర్ ఖాన్ సేవలు అందుబాటులో ఉంటాయి. జహీర్‌ వంద రోజులకు మించి తాను సమయం కేటాయించలేనని తెలపగా.. సీఏసీ సభ్యులు అతడిని 150 రోజులకు ఒప్పించినట్లు తెలుస్తోంది.

Zaheer will be contracted for 150 days a year: Ganguly

మరోవైపు బీసీసీఐ కూడా విదేశీ పర్యటనలకు మాత్రమే జహీర్‌ బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా ఉంటాడని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ జట్టు ఏదైనా పర్యటనకు వెళ్లేటపుడు మాత్రమే అతను జట్టుతో కలుస్తాడు. ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని నియమించిన తర్వాత సహాయక కోచ్‌లుగా సీఏసీ జహీర్, రాహుల్‌ ద్రవిడ్‌లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Zaheer Khan 'Consultant' Not Bowling Coach : BCCI New twist | Oneindia Telugu

ఈ నేపథ్యంలో జహీర్‌ ఖాన్ స్థానంలో పూర్తి స్థాయి కోచ్‌గా భరత్‌ అరుణ్‌ను తీసుకోవాలని రవిశాస్త్రి గట్టిగా పట్టుబడుతుండటంతో బౌలింగ్ కోచ్ వివాదం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India's new bowling consultant Zaheer Khan will be offered a contract of 150 days per season, informed Cricket Advisory Committee (CAC) member Sourav Ganguly."Zaheer was contacted for 150 days per year," Ganguly told reporters at Eden Gardens.
Please Wait while comments are loading...