డేవిస్ కప్: భారత్-ఉజ్భెకిస్థాన్‌ పోరుకు బెంగళూరు ఆతిథ్యం

Posted By:
Subscribe to Oneindia Telugu
హైదరాబాద్: భారత్ తన తదుపరి డేవిస్ కప్ పోరును ఏప్రిల్‌లో ఉజ్భెకిస్థాన్‌తో ఆడనుంది. ఏప్రిల్‌లో జరగనున్న ఈ డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్‌-1 రెండో రౌండ్‌ మ్యాచ్ బెంగుళూరులోని కర్ణాటక లాన్ టెన్నిస్ అసోసియేషన్ (కేఎసఎల్టీఏ) ఆతిథ్యం ఇవ్వనుంది.

ఆసియా ఓసియానియా గ్రూప్‌-1 పోరులో భాగంగా ఇటీవలే జరిగిన తొలి రౌండ్లో న్యూజిలాండ్‌ను 4-1తో ఓడించి భారత్ రౌండ్-2కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ఫిబ్రవరి మొదటివారంలో కోరియాతో జరిగిన పోరులో 3-1తో ఉజ్భెకిస్థాన్‌ విజయం సాధించింది.

Davis Cup: Bengaluru to host India-Uzbekistan tie

చివరిగా 2014 సెప్టెంబర్‌లో బెంగళూరులో సెర్బియాతో భారత్‌ డేవిస్‌కప్‌ ప్రపంచ గ్రూప్‌ ప్లేఆఫ్‌ పోరులో తలపడింది. ఈ పోరులో భారత్ 2-3తో భారత్ ఓటమి పాలైంది. ఇక భారత్, ఉజ్భెకిస్థాన్‌ జట్ల ముఖాముఖి పోరులో 2-2తో సమంగా ఉన్నాయి. ఈ పోరులో విజయం సాధించిన జట్టు సెప్టెంబర్‌లో జరిగే వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్స్‌లో ఆడనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India will host Uzbekistan on the hard courts of Karnataka State Lawn Tennis Association (KSLTA) in Bangalore when the two sides clash in an Asia Oceania Zone group I Davis Cup tie in April, the AITA announced today (February 16).
Please Wait while comments are loading...