స్విమ్ సూట్‌తో: ఫ్యాన్‌తో డేటింగ్ వాగ్దానాన్ని నిలబెట్టుకున్న టెన్నిస్ భామ

Posted By:
Subscribe to Oneindia Telugu
హైదరాబాద్: ఇటీవల ట్విట్టర్ వేదికగా ఓ సూప‌ర్ బౌల్ మ్యాచ్‌పై బెట్ క‌ట్టి ఓడిపోయిన కెనడా టెన్నిస్ స్టార్ యుజిని బౌచర్డ్‌ తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. బెట్టింగ్ ప్రకారం 20 ఏళ్ల విద్యార్థి జాన్ గోహ్రెక్ తో కలిసి డేటింగ్ వెళ్లినట్లు బౌచర్డ్ తాజాగా స్పష్టం చేసింది.

'ఇచ్చిన మాట ప్రకారం అతనితో డేటింగ్‌కు వెళ్లా. ముందుగా అతనితో కలిసి మిల్ వాకీ-ఎన్‌బీఏ జట్ల మధ్య జరిగిన బాస్కెట్ బాల్ మ్యాచ్‌కు హాజరయ్యా. ఆ తరువాత డేటింగ్ కోసం కొన్ని స్విమ్ సూట్లు పరిశీలించా' అని బౌచర్డ్ తెలిపింది. అంతేకాదు జాన్ గోహ్రెక్‌తో కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

 

ఈ నెల మొదటి వారంలో ఓ సూపర్‌ బౌల్‌ సిరీస్‌లోని అట్లాంటా ఫాల్కన్స్‌-న్యూఇంగ్లాండ్‌ పేట్రియాట్స్‌ జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో అట్లాంటాయే గెలుస్తుంద‌ని ఆమె ట్వీట్ చేసింది. ఆమె ఈ ట్వీట్ చేసిన సమయానికి అట్లాంటా జట్టు 21-0తో ముందంజలో ఉంది. ఆ ధీమాతోనే అట్లాంటా గెలుపు ఇక లాంచ‌న‌మే అన్న‌ట్లు బౌచ‌ర్డ్ ట్వీట్ చేసింది.

అట్లాంటా గెలుస్తుంద‌ని నాకు తెలుసు.. భ‌విష్య‌త్తును ముందే అంచ‌నా వేశా! అని ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. దీనిపై ఓ అభిమాని స్పందించాడు. ఒక‌వేళ పేట్రియాట్స్‌ జట్టు గెలిస్తే నాతో డేట్‌కు వస్తావా అని అత‌ను ట్వీట్ చేశాడు. క‌చ్చితంగా అంటూ బౌచ‌ర్డ్ అని సమాధానమిచ్చింది.

 

ఆటలో భాగంగా సెకండాఫ్‌లో అనూహ్యంగా పుంజుకున్న ప్యాట్రియాట్స్ 34-28 తేడాతో గెలిచింది. దీంతో ఆ అభిమాని 'ఆందోళన పడుతున్నారా?' అంటూ ట్వీట్‌ చేశాడు. 'అవును.. కొంచెం..' అని సమాధానమిచ్చి 'నువ్వు ఎక్కడ ఉంటావ్‌?' అని బౌచర్డ్‌ అడిగింది. అలాగే టామ్‌ బ్రాడీకి వ్యతిరేకంగా ఎప్పుడూ బెట్‌ వేయొద్దని గొప్ప గుణపాఠం కూడా నేర్చుకున్నానంటూ బౌచర్డ్‌ మరో ట్వీట్‌ ద్వారా తెలిపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Canadian tennis star Eugenie Bouchard paid off her lost Super Bowl bet on Wednesday by joining blind date John Goehrke at a Brooklyn Nets NBA home game against Milwaukee, and even posted a video of the “date” on twitter.
Please Wait while comments are loading...