న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డివిల్లియర్స్‌లా ఊహించుకోలేం, మా సపోర్ట్ ముంబై జట్టుకి: ద్రావిడ్

By Srinivas

ముంబై: రాజస్థాన్ రాయల్స్ జట్టు మెంటర్ రాహుల్ ద్రావిడ్ గురువారం మాట్లాడుతూ... తమ జట్టు బాగానే ఆడుతుందని చెప్పాడు. ఏపీఎల్ 8లో తమ జట్టు ఏమాత్రం చెత్తగా ఆడటం లేదన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రం ఓ మ్యాచులో తమను 130 పరుగులకు కట్టడి చేసిందన్నారు.

తాము వరుసగా ఐదు మ్యాచులు గెలిచామని, బాగానే ప్రారంభించామన్నారు. ఆ తర్వాత రెండు మ్యాచులు వర్షార్పణమయ్యాయన్నారు. మరో రెండు మ్యాచుల్లో ఓడామని (చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో) చెప్పారు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో బాగానే ఆడామని, కానీ టై కావడంతో సూపర్ ఓవర్లో ప్రత్యర్థి జట్టు గెలిచిందన్నారు.

ఐపీఎల్ లీగ్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్(ఆర్ఆర్) ఒక మంచి ఉద్దేశంతో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. టీం మెంటర్ రాహుల్ ద్రావిడ్ తోపాటు జట్టు సభ్యులందరూ బాలికల కోసం బ్యాట్ పట్టారు. బాలికల విద్యా, సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమానికి 'బ్యాట్ ఫర్ గర్ల్ చైల్డ్' అనే పేరును ఖరారు చేసింది. ఈ సందర్భంగా ద్రావిడ్ మాట్లాడారు.

Even in best of form, I could not imagine to play like AB de Villiers: Rahul Dravid

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇది 14 పాయింట్లతో ఉంది. 13 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ మరో ఒక్క మ్యాచ్ మాత్రం ఆడవలసి ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మే 16న మ్యాచ్ జరగనుంది. ఇందులో రాజస్థాన్‌కు గెలుపు తప్పనిసరి.

ఈ రోజు ముంబై ఇండియన్స్, ‌కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. దీనిపై ద్రావిడ్ మాట్లాడుతూ.. తాను, తన జట్టు మద్దతు ఈ రోజుకు ముంబై ఇండియన్స్‌కు ఉంటుందని చెప్పారు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడితే, తదుపరి అదే కోల్‌కతా రాజస్థాన్‌తో తలపడనుంది.

ద్రావిడ్ ఏబీ డివిల్లియర్స్ పైన ప్రశంసల వర్షం కురిపించారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిల్లియర్స్ 59 బంతుల్లో 133 పరుగులు చేశాడు. దీనిపై ద్రావిడ్ మాట్లాడారు. మంచి ఫాంలో ఉన్న సమయంలో కూడా అలా ఆడగలనని తాను ఊహించలేనని చెప్పారు.

బ్రెండన్ మెకల్లమ్, డివిల్లియర్స్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారన్నారు. వన్డేల్లో తొలి పదిహేను ఓవర్లలో ఎలా అటాక్ చేయాలో (బౌలర్‌పైన విరుచుకు పడి పరుగులు) తొలుత వివ్ రిచర్డ్స్, ఆ తర్వాత జయసూర్య, కలువితరణ చూపించారన్నారు. వీరుకు కూడా ద్రావిడ్ కితాబిచ్చారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X