'ఓం నమః శివాయ' టాటూతో సాక‌ర్ స్టార్‌: ట్విట్టర్లో వైరల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇంగ్లీష్ ప్రీమియ‌ర్ లీగ్ ఫుట్ బాల్ టోర్నీ ఇంకా ప్రారంభం కాలేదు. టోర్నీ ప్రారంభం కాకుండానే అర్సెన‌ల్ క్ల‌బ్ ప్లేయ‌ర్ థియో వాల్కాట్ భారతీయ ఫుట్ బాల్ అభిమానులను అలరిస్తున్నాడు. భారత్‌లో శివుడిని అభిమానించే భక్తులు ఉండరంటే అతిశయోక్తి ఉండదు.

అలాంటింది అర్సెనల్ జట్టుకు చెందిన థియో వాల్కాట్ తన వీపుపై ఓం నమః శివాయ అనే టాటూను వేయించుకున్నాడు. ఈ టాటూ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన థియో వాల్కాట్ 'మీ మనసును తెరవండి, భయాన్ని వదలండి, ద్వేషించినా, ఈర్ష్య పడినా...మీరు మాత్రం సంబరాన్ని సంతోషంగా ఆస్వాదించండి' అంటూ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌ని థియో వాల్కాట్ తన వీపు వెనుక భాగాన వేసుకోవడం విశేషం. ఇది భారత పుట్‌బాల్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Arsenal star Theo Walcott sent Twitter into meltdown after he unveiled a brand new tattoo, paying homage to one of the highest gods in the Hindu mythology, Lord Shiva.
Please Wait while comments are loading...