న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఐఎస్ఎల్: కోల్‌కతాదే రెండోసారి కిరీటం (ఫోటోలు)

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ప్రారంభించిన మూడేళ్లలోనే రెండోసారి అట్లెటికో డి కోల్‌కతా (ఎటికె) జట్టు చాంపియన్ కిరీటాన్ని చేజిక్కించుకున్నది.

By Nageshwara Rao

కోచి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ప్రారంభించిన మూడేళ్లలోనే రెండోసారి అట్లెటికో డి కోల్‌కతా (ఎటికె) జట్టు చాంపియన్ కిరీటాన్ని చేజిక్కించుకున్నది. తొలి ఏడాది మాదిరిగానే తన ప్రత్యర్థి కేరళ బ్లాక్ బస్టర్స్‌తో జరిగిన టైటిల్ కైవసానికి జరిగిన మ్యాచ్‌లో హోరాహోరీ పోరు సాగింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇరుజట్లు చెరో గోల్ చేసి డ్రాగా ముగించడంతో షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయించారు.

మరో 30 నిమిషాల పాటు సాగిన షూటౌట్‌లో కేరళ బ్లాక్ బస్టర్స్‌పై ఎటికె జట్టు 4 - 3 స్కోర్ తేడాతో టైటిల్ సొంతంచేసుకున్నది. సచిన్ టెండూల్కర్ సహ యజమానిగా గల కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుపై సంజీవ్ గోయెంకా సహా కోల్ కతా సహ యజమానిగా గల సౌరవ్ గంగూలీ సారథ్యంలోని అట్లెటికో డి కోల్‌కతా కుర్రాళ్లు ఎటువంటి అద్భుతాలు చేయకుండానే ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు.

ఎటికె ప్లేయర్ కం ఇండియన్ ఇంటర్నేషనల్ జువెల్ రాజా విజయవంతంగా ఐదో పెనాల్టీని గోల్ పోస్ట్‌కు మళ్లించాడు. తద్వారా మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చిన 55 వేల మంది అభిమానులను ఒక్కసారిగా నివ్వెరపోయేలా చేశాడు. 2014లో ముంబైలో జరిగిన ఫైనల్స్‌లో కేరళ బ్లాక్ బస్టర్స్‌పై ఎటికె 1 - 0 స్కోర్ తేడాతో చాంపియన్‌గా నిలిచింది. గత మూడు ఎడిషన్లలో షూటౌట్ల ద్వారా ఐఎస్ఎల్ చాంపియన్‌ను ఖరారుచేయడం ఇదే ప్రథమం.

ఇయాన్ హుమ్ షూటౌట్ బ్లాక్

ఇయాన్ హుమ్ షూటౌట్ బ్లాక్

అట్లెటికో డి కోల్‌కతా అటాకింగ్ ప్లేయర్ ఇయాన్ హుమ్ పంపిన షూటౌట్ ను కేరళ గోల్ కీపర్ గ్రహం స్టాక్ దిగ్విజయంగా అడ్డుకోగలిగాడు. కానీ జువెల్ రాజా, సమీగ్ దౌటీ, బొర్జా పెర్నాండెజ్, జావియర్ లారా తెలివిగా వ్యవహరించి తమ షూటౌట్లను గోల్ పోస్ట్‌కు పంపడంలో సక్సెస్ అయ్యారు. ఇంతకుముందు ఇదే స్టేడియంలో ప్రస్తుత సీజన్‌లో అభిమానుల దన్ను మధ్య ఏడింట ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన కేరళ బ్లాక్ బస్టర్స్ కుర్రాళ్లు అంటోనియో జర్మన్, కెర్వెన్స్, బెల్ఫోర్ట్, మహ్మద్ రఫీఖ్ షూటౌట్‌లో పాయింట్లు రాబట్టినా ఎల్హాద్జీ డోయే, సెడ్రిక్ హెంగ్బార్ట్ మాత్రం విఫలమయ్యారు. యావత్ మ్యాచ్ అసాంతం గందరగోళంగానీ, అసాధారణ ఘటనలు, ట్విస్టులు, మలుపులు లేకుండా హాయిగా సాగింది.

పెర్పార్మెన్స్‌లో కేరళ కుర్రాళ్లు ఫెయిల్

పెర్పార్మెన్స్‌లో కేరళ కుర్రాళ్లు ఫెయిల్

ప్రస్తుత టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన వారిలో రెండో ప్లేయర్ ఇయాన్ హుమ్ మ్యాచ్ లో చెలరేగిపోయాడు. తనదైన శైలిలో అటాకింగ్ ద్వారా మ్యాచ్ అసాంతం కేరళ బ్లాక్ బస్టర్స్‌కు పిచ్ పై చోటు లేకుండా చేశాడు. మరోవైపు ఎటికె సారధి హెల్డర్ పొస్టిగ స్థానే జావీ లారాను కోచ్ మొలీనా 68వ నిమిషంలో సబ్ స్ట్యూట్ చేశాడు. లీగ్ దశ, సెమీ ఫైనల్స్ మ్యాచ్‌ల వరకు టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించిన కేరళ ఫార్వర్డ్ ప్లేయర్లు సికె వినీత్, డకెన్స్ నాజోన్ కూడా అభిమానుల కేరింతల మధ్య కూడా టైటిల్ కోసం జరిగిన పోరులో విజయాన్ని అందుకోవడంలో విఫలమయ్యారు. ఇరు జట్లు ఎటువంటి సర్‌ప్రైజ్‌లు తమ జట్లను రంగంలోకి దించాయి. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమైన సారధి పొస్టిగ, ఇయాన్ హుమ్, సమీగ్ దౌటీ సాధారణంగానే బరిలోకి దిగగా, కేరళ బ్లాక్ బస్టర్స్‌లో షూటౌట్‌లో సందీప్ నందీ స్థానే గ్రహం స్టాక్‌ను ఎంచుకున్నా నిష్ర్పయోజనమైంది.

సాదాసీదాగా కేరళ షాట్లు

సాదాసీదాగా కేరళ షాట్లు

రెండోసారి టైటిల్ కోసం బరిలోకి దిగిన కేరళ కుర్రాళ్లు పలుసార్లు అటాకింగ్‌కు దిగినా గోల్ పోస్ట్ వద్ద అట్లెటికో డి కోల్‌కతా జట్టుకు ఎటువంటి ముప్పుగా పరిగణించే పరిస్థితి రాకపోవడం గమనార్హం. కేరళ బ్లాస్టర్స్ ఇండియన్ స్ట్రయికర్ సికె వినీత్ రెండో నిమిషంలోనే పంపిన అద్భుతమైన పాస్‌ను గోల్ పోస్ట్ దారి పట్టించే పరిస్థితిలో ఆయన సహచరులు లేరు. 10వ నిమిషంలో ఇన్‌సైడ్ బాక్స్ ద్వారా మహ్మద్ రఫీకి కెర్వెన్స్ బెల్ఫోర్ట్ పంపిన పవర్ ఫుల్ షాట్‌ను ఎటికె గోల్ కీపర్ జోస్ అరోయో బ్లాక్ చేశాడు. ఫస్టాఫ్‌ను ముగించేసరికి ఎటికె సారధి పొస్టిగకు రెండుసార్లు బ్యాక్ టు బ్యాక్ చాన్స్‌లు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 14వ నిమిషంలో కేరళ ఇన్ సైడ్ బాక్స్‌లో ఇయాన్ హుమ్ పంపిన పాస్‌ని కిక్ కొడితే వైడ్‌గా మారి వెళ్లిపోయింది. 21వ నిమిషంలోనూ పొస్టిగ ఔట్ సైడ్ బాక్స్ వద్ద నుంచి పంపిన బంతి సైతం లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

అద్యంతం ఎటికె ఆధిపత్యం

అద్యంతం ఎటికె ఆధిపత్యం

మ్యాచ్ అసాంతం కూడా ఎటికె కుర్రాళ్లు ఆధిపత్యం ప్రదర్శించారు. మరోవైపు కేరళ సారధి, డిఫెండర్ అరోన్ హుగెస్ గాయం కారణంగా వైదొలగడంతో 35వ నిమిషంలో ఆయన స్థానంతో ఎల్హాద్జీ డోయే బరిలోకి దిగాడు. అయితే హుగెస్ వైదొలిగినా 36వ నిమిషంలో మెహ్తాబ్ హుస్సేన్ పంపిన బంతిని హెడ్డర్ ద్వారా మహ్మద్ రఫీ పంపిన బంతి గోల్ పోస్ట్ దారి పట్టడంతో కేరళ శిబిరంలో పండుగ వాతావరణం నెలకొన్నది. కానీ ఈ సంబరం ఎంతోసేపు నిలువలేదు. ఫస్టాఫ్ ముగియడానికి ఒక నిమిషం ముందు ఎటికె ప్లేయర్ హెన్రిక్యు సెరెనో గోల్‌తో స్కోర్ సమంచేశాడు. సందేశ్ జిగ్నాస్ పంపిన బంతిని డౌటీ కార్నర్ ద్వారా అందుకున్న హెన్రిక్యు నేరుగా గోల్ పోస్ట్ బాట పట్టించాడు. సెకండాఫ్‌లో ఇరు జట్లూ బంతిని గోల్ పోస్ట్ బాట పట్టించలేకపోయాయి. కేరళ కోచ్ స్టీవ్ కొప్పెల్ 77వ నిమిషంలో డకెన్స్ నాజోన్, రఫీ స్థానే అంటోనియో జెర్మన్, మహ్మద్ రఫీఖ్‌లను సబ్ స్ట్యూట్లుగా పంపినా ప్రయోజనం లేకపోయింది. 82వ నిమిషంలో ఎటికె మిడ్ ఫీల్డర్ లాల్రిండికా రాల్టే పంపిన బంతిని కేరళ గోల్ కీపర్ గ్రాహం స్టాక్ నిలువరించాడు. చివరి నిమిషంలో రాల్టే లో క్రాస్ ద్వారా పంపిన బంతిని సెడ్రిక్ హెంగ్బార్ట్ డిఫెన్స్ వద్ద అడ్డుకోవడంతో పక్కకు వెళ్లిపోయింది

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X