ప్లేఆఫ్‌కు కోల్‌కతా క్వాలిఫై: కేరళతో మ్యాచ్ డ్రా

Posted By:
Subscribe to Oneindia Telugu

కోల్‌కతా: మాజీ చాంపియన్లు అట్లెటికో డీ కోల్‌కతా ముచ్చటగా మూడోసారి సెమీ ఫైనల్స్ బెర్త్‌కు అర్హత సాధించింది. కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుతో మంగళవారం రాత్రి కోల్‌కతాలో జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. కేరళ కుర్రాడు సికె వినీత్, కోల్‌కతా ప్లేయర్ స్టీఫెన్ పియర్సన్ చెరో గోల్ చేయడంతో రెండు జట్ల మధ్య మ్యాచ్ 1-1 స్కోర్‌తో డ్రాగా ముగిసింది.

స్టీవ్ కొప్పెల్ 4 -1 - 4 - 1 వ్యూహంతో బరిలోకి దిగినా ఎనిమిదో నిమిషంలో సికె వినీత్ అనూహ్యరీతిలో హెడ్డర్ ద్వారా పంపిన బంతిని కోల్ కతా గోల్ కీపర్ దేబ్జిత్ మజుందార్ అడ్డుకునేలోగా గోల్ పోస్ట్ లో స్థిరపడి పోయింది. ఆ తర్వాత 10 నిమిషాలకు సొంత గడ్డపై తమ ప్రతిభను మరింత మెరుగుపర్చుకునేందుకు కోల్ కతా ప్లేయర్లు కాస్త చెలరేగిపోయారు.

సారధి హెల్డర్ పొస్టిగ, అటాకర్ ఇయాన్ హుమ్ అద్భుతంగా లింక్ చేసి పంపిన బంతిని స్టీఫెన్ పియర్సన్ నేరుగా గోల్ పోస్ట్ దారి పట్టించడంతో స్కోర్ సమమై మ్యాచ్ డ్రా గా ముగిసింది. అట్లెటికో డీ కోల్‌కతా త్రయం పొస్టిగ, ఇయాన్ హుమ్ ప్లస్ పియర్సన్ కలివిడిగా లవ్లీ టచ్‌తో ఆడటంతో బంతి గోల్ పోస్ట్ దారి పట్టడంతోపాటు 19 పాయింట్లు సాధించడంతోపాటు సెమీ ఫైనల్స్‌కు అర్హత పొందింది.

 కేరళకు 19 పాయింట్లు, గోల్స్‌లో తేడా

కేరళకు 19 పాయింట్లు, గోల్స్‌లో తేడా


కేరళ బ్లాక్ బస్టర్స్ సైతం 19 పాయింట్లు సాధించినా.. గోల్స్‌లో తేడా కారణంగా ఇంకా అర్హత సాధించలేదు. వచ్చేనెల నాలుగో తేదీన నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టుతో కోచిలో జరిగే మ్యాచ్‌ను కనీసం డ్రా గా ముగిస్తే కేరళ బ్లాక్ బస్టర్స్ టాప్ 4లో చోటు దక్కించుకోగలుగుతుంది. అట్లెటికో డీ కోల్ కతా - కేరళ బ్లాక్ బస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం కారణంగా బుధవారం గౌహతిలో జరిగే మ్యాచ్ లో గెలుపొందితే ఢిల్లీ డైనమోస్ జట్టు ప్లే ఆఫ్ దశలో చోటు దక్కించుకోవడం ఖాయం. ఇప్పటికే ఢిల్లీ 20 పాయింట్లతో టేబుల్‌పై రెండో స్థానంలో నిలిచింది.

 13 మ్యాచ్‌ల్లో ముంబైకి 23 పాయింట్లు

13 మ్యాచ్‌ల్లో ముంబైకి 23 పాయింట్లు


ఇప్పటికే టేబుల్ టాపర్లుగా నిలిచిన ముంబై సిటీ ఎఫ్ సి జట్టు 13 మ్యాచ్‌ల్లో 23 పాయింట్లు పొందిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుత సీజన్‌లో రవీంద్ర సరోవర్ స్టేడియం అట్లెటికో డీ కోల్‌కతా జట్టుకు కలిసి రాలేదు. పేలవ ప్రదర్శనతోనే సౌరవ్ సేన ముందుకు సాగింది. ఈ సీజన్‌లో కోల్ కతా కుర్రాళ్లు సొంత గడ్డపై కేవలం ఢిల్లీ డైనమోస్ జట్టుపై మాత్రమే విజయం సాధించారు. సొంత గడ్డపై మొత్తం ఏడు పాయింట్లు సాధించిన కోల్ కతా కంటే ఎఫ్ సి గోవా నాలుగు పాయింట్లతో వెనుకబడి ఉంది.

 కోల్ కతా కేవలం ఆరు గోల్స్ మాత్రమే

కోల్ కతా కేవలం ఆరు గోల్స్ మాత్రమే


సొంతగడ్డపై కోల్ కతా కేవలం ఆరు గోల్స్ మాత్రమే చేసింది. గోవా, నార్త్ఈస్ట్ జట్లు కూడా సొంత గడ్డపై తక్కువ గోల్స్ మాత్రమే చేశాయి. అంతేకాదు కోల్ కతా ఒక క్లీన్‌షీట్ కూడా సాధించగలిగింది. ప్రత్యర్థి డిఫెన్స్ వ్యూహంలోకి చొచ్చుకెళ్లలేకపోవడం కోల్ కతా కుర్రాళ్లకు సమస్యగా మారడంతో పలు అవకాశాలు నెలకొల్పినా ఫినిషింగ్ చాన్స్‌లు సాధించలేక వెనుకబడింది. రెండు జట్లు చెరో గోల్ సాధించిన తర్వాత 45 నిమిషాల పాటు మ్యాచ్‌లో చేంజోవర్ కోసం శతవిధాల ప్రయత్నించాయి.

 గోల్స్ చేయడంలో కోల్‌కతా విఫలం

గోల్స్ చేయడంలో కోల్‌కతా విఫలం


అట్లెటికో డీ కోల్ కతాకు అవకాశాలు వచ్చినా గోల్ పాయింట్లుగా మార్చుకోలేక వెనుకబడింది. సెకండాఫ్‌లో అర్రోయో.. డిఫెన్స్ వింగ్‌లో లాంగ్‌బాల్‌ను రుడియాస్ మీదుగా పంపాడు. బంతి సానుకూలంగానే ముందుకెళ్లినా కేరళ డిఫెన్స్ అడ్డుకున్నది. వారు బంతిని కార్నర్ పాయింట్ ద్వారా నేరుగా గోల్ పోస్ట్ దారి పట్టించినా సందేశ్ జిగ్నాస్ తెలివిగా అడ్డుకుని వెనుకకు పంపాడు. సొంతగడ్డపై తనకు గల సానుకూల అంశాలతో కోల్‌కతా మ్యాచ్‌పై ఆధిపత్యం ప్రదర్శించినా గోల్ కీపర్ దేబ్జిత్ మజుందార్ పొరపాటు అవగాహన వల్లే ప్రారంభంలో కేరళ బ్లాక్ బస్టర్స్ గోల్ సాధించగలిగింది.

 కోల్‌కతా భారీ మూల్యం

కోల్‌కతా భారీ మూల్యం

లెఫ్ట్ వింగ్ వైపు నుంచి మెహతాబ్ హుస్సేన్ ముందుకు రావడంతో కీపర్ మజుందార్ తన స్థానం నుంచి ముందుకొచ్చి బంతిని నిలువరించేందుకు విఫలయత్నం చేశాడు. దాని ఫలితంగానే కోల్ కతా మూల్యం చెల్లించుకున్నది. సెడ్రిక్ హెంగ్బార్ట్ పంపిన బంతిని వినీత్ గోల్ పోస్ట్ దారి పట్టించాడు. వినీత్ గోల్ సాధించగానే ఒక నిమిషంపాటు స్టేడియం అంతా మౌనం వహించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former champions Atletico de Kolkata secured a place in the play-offs for the third successive season following their 1-1 draw against Kerala Blasters in an Indian Super League football match here yesterday.
Please Wait while comments are loading...