బెంగుళూరు: ఇంగ్లీషు ప్రీమియర్ లీగ్ (ఇపీఎల్)లో భాగంగా జరుగుతున్న పుట్‌బాల్ మ్యాచ్‌ల్లో 11వ వారంలో చెల్సియా ఎఫ్‌సి, మాంచెస్టర్ సిటీ జట్లు దూసుకుపోతున్నాయి. చెల్సియా ఎఫ్‌సి జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉంది. ఎవర్టెన్ జట్టుతో జరిగిన ఆటలో చెల్సియా 5 గోల్స్‌తో రాణించి పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్ధానంలోకి దూసుకెళ్లింది.
ప్రత్యర్ధి జట్టుపై చెల్సియా ఆటగాళ్లు దూకుడుని ప్రదర్శించారు. చెల్సియా జట్టు ఆటగాళ్లైన ఈడెన్ హాజార్డ్, డియాగో కోస్టా, మార్కస్ అలెన్సో, పీడ్రో తలో గోల్ చేశారు. దీంతో ఈ సీజన్లో చెల్సియా తొలిసారి పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్ధానంలో నిలిచింది. ఇక మాంచెస్టర్ జట్టు విషయానికి వస్తే ఆట ప్రధమార్దంలో సెర్గియో ఉగ్వేరో తొలి గోల్ చేశాడు.
అయితే ద్వితియార్ధంలో రెండో గోల్ చేయడంతో జట్టు ప్రయత్నాలు ఫలించలేదు. ఇక చివరి నిమిషంలో మిడిల్స్ బ్రా జట్టు మాంచెస్టర్ ఆటగాళ్లపై పైచేయి సాధించి 92వ నిమిషంలో గోల్ చేయడంతో మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది.
11వ వారం మ్యాచ్ ఫలితాలు:
* మాంచెస్టర్ సిటీ 1-1 మిడిల్స్ బ్రా
* వెస్ట్ హామ్ యునైటెడ్ 1-1 స్టోక్ సిటీ
* బర్న్లీ ఎఫ్‌సి 3-2 క్రిస్టల్ ప్యాలెస్
* బౌర్నీమౌత్ 1-2 సండర్ ల్యాండ్
* చెల్సియా 5-0 ఎవర్టెన్
* ఆర్సెనల్ 1-1 టోటెన్హామ్ హాట్స్పుర్
* హల్ సిటీ 2-1 సౌతాంప్టన్
* లివర్‌పూల్ 6-1 వాట్ ఫోర్డ్
* స్వాన్సీ సిటీ 1-3 మాంచెస్టర్ యునైటెడ్
* లీసెస్టర్ సిటీ 1-2 వెస్ట్ బ్రోమ్విచ్ అల్బియాన్