న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

హోరా హోరీగా: ఇపీఎల్ 25వ వారం రౌండప్, ఫలితాలు

ఇంగ్లీషు ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) 25వ వారానికి చేరుకుంది. ఈ వారంలో ఆర్సెనల్ జట్టు హుల్ సిటీతో తలపడనుంది. ఇదే ప్రధానమైన మ్యాచ్. ఈ సీజన్‌లో హుల్ సిటీ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. 

By Nageshwara Rao

హైదరాబాద్: ఇంగ్లీషు ప్రీమియర్ లీగ్ (ఇపీఎల్) 25వ వారానికి చేరుకుంది. ఈ వారంలో ఆర్సెనల్ జట్టు హుల్ సిటీతో తలపడనుంది. ఇదే ప్రధానమైన మ్యాచ్. ఈ సీజన్‌లో హుల్ సిటీ అద్భుతమైన ఫామ్‌లో ఉంది.

ఇంగ్లీషు ప్రీమియర్ లీగ్ పాయింట్స్ టేబుల్

గత రెండు గేముల్లో మాంచెస్టర్ యునైటెడ్, లివర్ పూల్‌ జట్లపై ఒకటి డ్రా, మరొక విజయం సాధించడంతో 4 పాయింట్లను సొంతం చేసుకుంది. గత రెండు వారాలుగా తప్పక గెలవాల్సిన గేముల్లో హుల్ సిటీ విజయాలను సాధించి టైటిల్‌ బరిలో నిలిచింది.

EPL 2016-17: Schedule for game week 25

అద్భుతమైన ఫామ్‌తో పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో ఉన్న టోటెన్హామ్ హట్సుపుర్‌తో లివర్ పూల్ తలపడనుంది. టైటిల్ బరిలో నిల్చోవాలంటే లివర్ పూల్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు ఈ వారంలో లీగ్‌లో అగ్రస్ధానంలో ఉన్న చెల్సియా జట్టు బర్నేలే ఎఫ్‌సితో తలపడనుంది. మాంచెస్టర్ యునైటెడ్ జట్టు వాట్ ఫోర్డ్ జట్టుతో తలపడుతుండగా, మాంచెస్టర్ సిటీ జట్టు ఎఎఫ్‌సి బోర్నీమౌత్ జట్టుతో తలపడనుంది.

ఈపీఎల్‌లో 25వ వారం జరిగే మ్యాచ్‌లు:

శనివారం, ఫిబ్రవరి 11
ఆర్సెనల్ 2-0 హుల్ సిటీ
స్టాక్ సిటీ 1-0 క్రిస్టెల్ ప్యాలెస్
మాంచెస్టర్ యునైటెడ్ 2-0 వాట్ ఫోర్డ్
మిడిల్స్ బ్రోగ్ 0-0 ఎవర్టెన్
వెస్ట్ హామ్ యునైటెడ్ 2-2 వెస్ట్ బ్రోమిచ్ ఆల్బిన్
సండర్లాండ్ 0-4 సౌతాప్టన్
లివర్ పూల్ 2-0 టోటెన్హామ్ హట్సుపుర్‌

ఆదివారం, ఫిబ్రవరి 12
బర్నేలే ఎఫ్‌సి 1-1 చెల్సియా
స్వాన్ సి సిటీ 2-0 లీసెస్టర్ సిటీ

సోమవారం, ఫిబ్రవరి 13
ఎఎఫ్‌సి బోర్నీమౌత్ Vs మాంచెస్టర్ సిటీ - 1:30 AM (IST)

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X