మెస్సీ, రొనాల్డేలే బెస్ట్: జనవరి 9న ఫిఫా అవార్డుల ప్రదానం

Posted By:
Subscribe to Oneindia Telugu

మాడ్రిడ్: స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ 'లా లీగ' టోర్నీ జెయింట్స్ రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, ఎఫ్ బార్సిలోనా కీలక ఆటగాడు లియానెల్ మెస్సీలే ఈ ఏడాది ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డుకు అర్హులని స్పెయిన్ మాజీ కోచ్ విసెంటే డెల్ బాస్ క్యూ వ్యాఖ్యానించాడు. ప్రతియేటా 'ఫిఫా' ఫుట్‌బాల్ లీగ్‌లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాడికి 'ఈ అవార్డు' అందజేస్తారు.

వచ్చే ఏడాది జనవరి తొమ్మిదో తేదీన అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. కొన్నేళ్లుగా స్ఫూర్తిదాయక రీతిలో శిక్షణనిస్తున్న అట్లెటికో మాడ్రిడ్ కోచ్ డియాగో సిమ్మొన్స్‌కు ది బెస్ట్ ఫిఫా మెన్స్ కోచ్ అవార్డు ఇస్తే బావుంటుందన్నాడు. కొన్నేళ్లుగా డియాగో సిమ్మొన్స్ ట్రాక్ రికార్డు నిజమైన స్ఫూర్తిని నింపుతున్నదన్నాడు.

సిమ్మొన్స్ రాకతో అట్లెటికో మాడ్రిడ్ జట్టుకు ఒక గుర్తింపు తీసుకొచ్చాడని, వారు చాలా బాగా మెరుగయ్యారని విసెంటే బాస్ క్యూ.. ఫిఫా వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. బార్సిలోనా మేనేజర్ లూయిస్ ఎన్రిక్యు, రియల్ మాడ్రిడ్ కోచ్ జినెడిన్ జిడానే కూడా గొప్ప మేనేజర్లని అభివర్ణించాడు.

Ex-Spain coach Del Bosque picks Messi, Ronaldo for top FIFA Award

ఇటీవలి కాలంలో టాప్ ప్లేస్‌ల్లో క్రిస్టియానో రొనాల్డో, లియానెల్ మెస్సీ ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారని గుర్తుచేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ ప్రేమికులంతా వారిద్దరినే ఇష్టపడుతున్నారని తెలిపాడు. 2008 నుంచి ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డును వారిద్దరే గెలుచుకుంటూ వస్తున్నారు. లియానెల్ మెస్సీ ఐదుసార్లు బెస్ట్ ఫిఫా ప్లేయర్ అవార్డు కైవసంచేసుకుంటే రొనాల్డో మూడుసార్లు గెలుచుకున్నాడు.

2016లో 23 మంది నామినీ ప్లేయర్ల జాబితాలో ఇద్దరు స్పానియార్డ్స్ కుర్రాళ్లు మాత్రమే చోటు దక్కించుకున్నారన్నారు. రియల్ మాడ్రిడ్ జట్టుకు చెందిన సెర్జియో రామోస్, ఎఫ్ సి బార్సిలోనాకు చెందిన ఆండ్రెస్ ఇనెస్టాలు ఆ జాబితాలో ఉండే అవకాశముందన్నాడు. ఇంకా సెర్జియో బస్‌క్వెట్స్, గెర్రార్డ్ పిఖ్యుల్లో ఒకరి పేరు మాత్రం ఈ జాబితాలో చేరొచ్చని తెలిపాడు. స్పానిష్ ఫుట్ బాల్ కు ఇది గొప్ప పీరియడ్ అని వ్యాఖ్యానించాడు.

సరోవర్ స్టేడియం ఒక శ్యాడ్ అట్మాస్పియర్: మొలీనా
కోల్‌కతా: అట్లెటికో డీ కోల్ కతా హెడ్ కోచ్ జోస్ మొలీనా తమకు ఈ సంవత్సరం కేటాయించిన రవీంద్ర సరోవర్ స్టేడియంతో తమ జట్టుకు అచ్చి రాలేదని వ్యాఖ్యానించాడు. స్టాల్ లేక్ జిగాంటిక్ స్టేడియంతో పోలిస్తే రవీంద్ర సరోవర్ స్టేడియంలో పార్టీ అనుకూల వాతావరణం లేదన్నాడు.

రవీంద్ర సరోవర్ స్టేడియంలో గోల్స్ సాధించడంలో తమ కుర్రాళ్లు విఫలమయ్యారన్నాడు. కోచి స్టేడియం దీనికి చాలా భిన్నంగా ఉందన్నాడు. ఓపెన్ ప్లేస్ లో ఉన్న స్టేడియంకు షేడ్ లేకపోవడమే ప్రధాన ఇబ్బందన్నాడు. ఏదో కోల్పోయామన్న భావన తమ కుర్రాళ్లలో గూడు కట్టుకుని పోయిందన్నాడు.

స్టాల్ లేక్ లోని యువ భారతి క్రురంగాన్ స్టేడియంతో పోలిస్తే కేవలం 12 వేల మంది అభిమానులు మాత్రమే మ్యాచ్ వీక్షించేందుకు అవకాశం ఉందన్నాడు. కానీ యువ భారతి స్టేడియంలో సుమారు 30 వేల మంది ఫ్యాన్స్ కూర్చుని మ్యాచ్ వీక్షించేందుకు చాన్స్ ఉందని మొలీనా తెలిపాడు.

యువ భారతి స్టేడియంను వచ్చే ఏడాది యు - 17 వరల్డ్ కప్ టోర్నీకి సన్నద్ధంచేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండటంతో అట్లెటికో డీ కోల్ కతా జట్టుకు రవీంద్ర సరోవర్ స్టేడియం కేటాయించారు. కొంతమంది మాజీ ఆటగాళ్లు, కోచింగ్ స్టాప్ మాట్లాడుతూ స్టాల్ లేక్ స్టేడియంలో చాలా సానుకూలమైన గొప్ప వాతావరణం నెలకొని ఉన్నదని తనతో అన్నారన్నాడు.

గతంలో ఈ స్టేడియంలో సుమారు లక్ష మంది అభిమానులు వీక్షించే సామర్థ్యం కలిగి ఉండేదన్నాడు. మంగళవారం జరిగిన మ్యాచ్ వీక్షించేందుకు 12,575 మంది ప్యాన్స్ వచ్చారన్నారు. కోచి, గౌహతి, గోవాలలో స్టేడియంలు చాలా బాగున్నాయన్నాడు. గత ఆరు మ్యాచ్ లలో అట్లెటికో డీ కోల్ కతా ఒక మ్యాచ్ మాత్రమే గెలుచుకున్నా.. కేరళ బ్లాక్ బస్టర్స్ పై ఆధిపత్యం సాధించడంలో విఫలమయ్యిందని, కానీ జట్టు మ్యాచ్ ఫలితాన్ని డ్రాగా ముగించామన్నారు. 13 మ్యాచ్ లలో కేవలం రెండింటిలో మాత్రమే ఓటమి పాలయ్యామన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Spain coach Vicente del Bosque has picked superstars Lionel Messi and Cristiano Ronaldo as favourites to be named footballers of the year. The award given by global governing body FIFA, is named "The Best" men's player this year.
Please Wait while comments are loading...