కోల్‌కతాలో ఫైనల్: రూ.48కే వరల్డ్ కప్ టికెట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పుట్ బాల్ ఫ్యాన్స్‌కు శుభవార్త. భారత్‌లో జరిగే అండర్‌ 17 ఫిఫా వరల్డ్ కప్ ఫుట్‌బాల్‌ పోటీల టికెట్‌ ధరలను ప్రకటించారు. భారత్‌లో పుట్‌బాల్ పట్ల ఆదరణ పెంచేందుకు గాను మ్యాచ్‌ టికెట్‌లను కనిష్టంగా కేవలం రూ.48కే అందించనున్నారు.

ఫైనల్‌ మ్యాచ్‌ ధర కూడా రూ. 48గా నిర్ణయించారు. అయితే పది టికెట్లను ఒకేసారి కొనాల్సి ఉంటుంది. 60 శాతం తక్కువ ధరతో సీజన్‌ టికెట్ల (10 మ్యాచ్‌లు)ను నిర్వాహకులు విక్రయిస్తున్నారు. ఇతర స్టాండ్స్‌ టికెట్‌ ధరలు రూ.96, రూ.192గా ఉన్నాయి.

FIFA U-17 World Cup: Tickets to cost Rs 48

మంగళవారం రాత్రి 7.11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్‌లు అందుబాటులో ఉంటాయని టోర్నీ డైరెక్టర్‌ జేవియర్‌ కెప్పి తెలిపారు. అన్ని వేదికల వద్ద ఈ టికెట్లను కొనుగోలు చేయొచ్చని ఆయన చెప్పారు. ఆరు వేదికల్లో జరిగే వరల్డ్ కప్ అక్టోబరు 6న ఆరంభమవుతుంది.

కోల్‌కతాలో జరిగే పది మ్యాచ్‌లకు కలిపి రూ.480తో ప్యాకేజీగా అందిస్తామని... ఇందులో ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్‌ కూడా ఉంటుందని కెప్పి అన్నారు. అండర్‌ 17 ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్ కోల్‌కతా వేదికగా జరగనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The ticket pricing for the upcoming FIFA Under-17 World Cup has been set at Rs 48 during the first phase of ticket sales. The first phase will kick start tomorrow, May 16, and will be flagged off by World Cup winner Carles Puyol.
Please Wait while comments are loading...