స్టేడియంలో విషాదం: అభిమానులు పరస్పరం దాడి, ఒకరు మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పుట్ బాల్ మ్యాచ్‌లో విషాదం చోటు చేసుకుంది. అర్జెంటీనాలో ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా స్టేడియంలో ఇరు జట్ల అభిమానుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఓ అభిమాని తీవ్రంగా గాయపడి మరణించాడు.

శనివారం బెల్‌గ్రానో, టాలెరెస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో స్టేడియంలో మ్యాచ్‌ తిలకిస్తున్న ఇరు జట్ల అభిమానులు పరస్పరం దాడికి దిగారు. ఈ దాడిలో టాలెరెస్‌ అభిమానుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో బెల్‌గ్రానో అభిమాని ఎమాన్యుల్‌ బాల్బో తీవ్రంగా గాయపడ్డాడు.

Football fan dies after brutal attack by hooligan supporters of same team during Argentine first-division match

టాలెరెస్‌ అభిమానుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో అతని తల స్టేడియంలోని కాంక్రీట్ గోడను తాకింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని స్టేడియంలోని టీవీ కెమెరాలు బంధించాయి. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా, కోమాలో ఉన్నట్టు వైద్యులు చెప్పారు.

ఆ తర్వాత అతని బ్రెయిన్‌ డెడ్‌గా ప్రకటించారు. ఎమాన్యుల్‌ బాల్బో మృతిపై ఫుట్‌బాల్‌ సంఘాల అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని, అభిమానులు ఇలా దాడులకు దిగడం సరికాదని పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A football fan in Argentina has died after being brutally attacked by a group of men during a first-division match over the weekend, according to local media.
Please Wait while comments are loading...