వార్మప్: బ్రెజిల్, రష్యాలకు U-17 వరల్ట్ కప్ టీం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత్ U-17 వరల్డ్ కప్ టీం వార్మప్ మ్యాచ్‌ల కోసం బ్రెజిల్, రష్యాలలో పర్యటనలకు బయలుదేరి వెళ్లింది. అటువంటి అవకాశం రావడం తప్పనిసరిగా తాము మెరుగుపడేందుకు దోహదపడుతుందని ఇండియన్ యు - 17 టీం హెడ్ కోచ్ నికోలయి ఆడం తెలిపాడు. వచ్చే ఏడాది అక్టోబర్ ఆరో తేదీ నుంచి ఫిఫా యు - 17 వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.

వార్మప్, ఫ్రెండ్‌షిప్ మ్యాచ్‌ల కోసం బ్రెజిల్, రష్యాలలో పర్యటనకు భారత టీం బయలుదేరి వెళ్లింది. తొలుత తమ జట్టు బ్రెజిల్‌లో పర్యటిస్తుందని నికోలయ్ ఆడం చెప్పాడు. ఒర్లాండో సిటీలోని (అమెరికా) 'మేం అట్లెటికో పరానైన్సెస్', ఉరుగ్వే జట్లతోపాటు నాలుగు టీంలతో జరిగే టోర్నమెంట్ మ్యాచ్‌ల్లో పాల్గొంటామని నికోలయ్ ఆడం అన్నాడు.

రష్యాలో గ్రానట్కిన్ కప్ టోర్నీలో పాల్గొంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈయూ సభ్యదేశాల్లోని యు - 19 జట్లన్నీఈ కప్ కోసం పోటీ పడుతుంటాయి. ఈ టోర్నీలో పాల్గొనడంతో తమ కుర్రాళ్లకు కావల్సినంత అనుభవం వస్తుందన్నాడు. అగ్రశ్రేణి అంతర్జాతీయ టీంలతో ఎల్లవేళలా ఆడటం వల్ల పోటీతత్వంతో మరింత మెరుగుపడే అవకాశం ఉన్నదని చెప్పాడు.

ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలతోపాటు అమెరికాలో U-17 జట్టు పర్యటన

ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలతోపాటు అమెరికాలో U-17 జట్టు పర్యటన

తమ జట్టు ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలతోపాటు అమెరికాలలో పర్యటిస్తుందన్నాడు. ‘ఈ ఎక్స్ పోజర్ ట్రిప్స్ పూర్తిస్థాయిలో ప్లేయర్లు తమ ఆటతీరును స్థిర పరుచుకునేందుకు ఉపకరిస్తాయి. కుర్రాళ్లలో పోటీ తత్వాన్ని మెరుగుపర్చడంతోపాటు జట్టు కెమిస్ట్రీ నిర్మాణానికి, కుర్రాళ్లు తమ బలహీనతలు తెలుసుకుని శక్తి సామర్థ్యాలు పెంపొందించుకునేందుకు సహకరిస్తాయి' అని నికోలయ్ ఆడం చెప్పాడు.

రవీంద్ర సరోవర్, బరాసత్ స్టేడియంలు తనిఖీచేసిన ఐ - లీగ్

రవీంద్ర సరోవర్, బరాసత్ స్టేడియంలు తనిఖీచేసిన ఐ - లీగ్

కోల్‌కతాలోని రవీంద్ర సారోవర్, బరాసత్ స్టేడియంలలో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని ఐ - లీగ్ సిఇఓ సునందో ధార్ తెలిపారు. రెండు స్టేడియంల వద్ద పరిస్థితిని తనిఖీచేసిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే టోర్నీలో సిటీ జెయింట్ టీంలు ఈస్ట్ బెంగాల్ జట్టు రవీంద్ర సరోవర్, మొహున్ బగన్ జట్టు బరాసత్ స్టేడియంలను తమ సొంత స్టేడియంలుగా పరిగణిస్తున్నాయి. సిలిగిరిలోని కాంచెంజుంగా స్టేడియంలోనూ మ్యాచ్ లు జరిపేందుకు అంగీకారం కుదిరిందన్నాడు.

వసతులు మెరుగు పడితేనే ఉపయోగించుకుంటాం

వసతులు మెరుగు పడితేనే ఉపయోగించుకుంటాం

‘రవీంద్ర సరోవర్ స్టేడియంలో వసతులు మెరుగు పడితే మేం కూడా మెరుగ్గా ఉపయోగించుకుంటాం' అని సునందోధర్ అన్నాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫ్రాంచైసీ అట్లెటికో డీ కోల్ కతాతో కలిసి ఈస్ట్ బెంగాల్, మొహున్ బగన్ క్లబ్ యాజమాన్యాలు స్టేడియంలలో ఫ్లడ్ లైట్ల నిర్మాణం, తదితర తాత్కాలిక వసతులు అందుబాటులోకి తీసుకొస్తాయన్నాడు. వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీ నుంచి ఐ - లీగ్ టోర్నీ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే.

ఇండియన్ పుట్ బాల్ అసోసియేషన్‌కు లేఖ

ఇండియన్ పుట్ బాల్ అసోసియేషన్‌కు లేఖ

ఐ - లీగ్ టోర్నీలో పాలుపంచుకోవాల్సిందిగా అట్లెటికో డీ కోల్‌కతా జట్టు ఫ్రాంచైసీ యాజమాన్యంతో ఈస్ట్ బెంగాల్, మొహున్ బగన్ క్లబ్ యాజమాన్యాలు సంప్రదిస్తున్నాయన్నాడు. వచ్చే ఏడాది యు - 17 వరల్డ్ కప్ టోర్నీ కోసం ఆధునీకరిస్తున్నందున స్టాల్ లేక్ స్టేడియం, బరాసత్ స్టేడియం తమకు అందుబాటులో ఉండవని సునందోధర్ తెలిపాడు. అయితే ప్రస్తుతం ఆయా స్టేడియంలలో వసతుల కల్పన ప్రక్రియ కొనసాగుతున్నాయని, తాము ఇండియన్ పుట్ బాల్ అసోసియేషన్ కు లేఖ రాస్తామన్నాడు. ఐ - లీగ్ టోర్నీ ప్రారంభానికి ముందు రెండు క్లబ్ ల యాజమాన్యాలతో సమావేశమవుతామని వివరించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian colts left for exposure tours to Brazil and Russia on Tuesday in preparation for the U-17 football World Cup, to be hosted by the country next year.
Please Wait while comments are loading...