విఫలం: ఐఎస్ఎల్‌పై కేరళ బ్లాస్టర్స్ కోచ్ సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీ అసలు లక్ష్యాలను అర్థంచేసుకోవడంలో విఫలం అయ్యానని కేరళ బ్లాక్ బస్టర్స్ చీఫ్ కోచ్ స్టీవ్ కొప్పెల్ వ్యాఖ్యానించాడు. సమయానుకూలంగా జట్టుకు శిక్షణనిస్తూ ముందుకు సాగుతున్న ప్రస్తుతం సీజన్ దాదాపు పూర్తి కావొచ్చిందన్నాడు.

'నేను లీగ్ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి కష్టపడాల్సి వస్తున్నది.' అని స్టీవ్ కొప్పెల్ తెలిపాడు. అట్లెటికో డీ కోల్ కతా, కేరళ బ్లాక్ బస్టర్లు జట్లు చెరో 18 పాయింట్లు కలిగి ఉండటంతోపాటు మరో రెండు మ్యాచ్‌లు అందుబాటులో ఉండగా రెండు జట్లు మంగళవారం కోల్‌కతాలో పరస్పరం తలపడనున్న నేపథ్యంలో కొప్పెల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాడు.

'ఇంకా వాస్తవంగా 10 - 12 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. కానీ ప్రస్తుత సమయానికి లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్లేయర్లను అభివ్రుద్ధి చేయాలన్న ద్రుక్పథం ప్రకారం లీగ్ ముందుకు వెళుతుందా? ఒక వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతుందా? నాకైతే తెలియదు' అని చెప్పాడు. 'యువ కుర్రాళ్లకు వసతులు తక్కువ. చాలా కనీస స్థాయిలో సౌకర్యాలు ఉన్నాయి' అని అన్నాడు.

 Kerala Blasters coach Steve Coppell questions ISL's objectives

భారతదేశంలో యువ ఫుట్ బాల్ క్రీడాకారులను అభివ్రుద్ధి చేయాల్సిన బాధ్యత ఐఎస్ఎల్ పై ఉందని గుర్తుచేశాడు. భవిష్యత్ లో వారు గర్వపడే పరిస్థితి వస్తుందని ఆయన తెలిపాడు. తాము సీజన్ ముగింపు దశకు చేరుకున్నామని తెలిపారు. అయితే అట్లెటికో డి కోల్‌కతాను సొంతగడ్డపై పేలవ ప్రదర్శన గల జట్టుగా పరిగణించలేమన్నాడు. కోల్ కతాలో మంచి స్ట్రయికర్లు ఉన్నారని అన్నాడు.

ఐఎస్ఎల్ లీగ్‌ను సుదీర్ఘ కాలం పొడిగించాల్సిన అవసరం ఉన్నదని తెలిపాడు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీ క్విచ్ పంచ్ వంటిదని వ్యాఖ్యానించాడు. ఆరేళ్ల బాలురకు శిక్షణనిచ్చేందుకు మంచి కోచ్‌లను ఏర్పాటుచేయాల్సి ఉన్నదన్నాడు. వచ్చే నాలుగైదేళ్లలో విదేశీ ఆటగాళ్లను క్రమంగా తగ్గించాల్సిన ఉందన్న స్టీవ్ కొప్పెల్.. వారి నుంచి భారత ప్లేయర్లు నేర్చుకునే అవకాశాలు కల్పించాలని సూచించాడు.

ప్రస్తుతం ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నదన్నాడు. ప్రతి మూడు, నాలుగేళ్లకోసారి ఒక అంతర్జాతీయ ప్లేయర్ ను వదిలేస్తున్నారని చెప్పాడు. కానీ భారతీయ ప్లేయర్లు విదేశీ ఆటగాళ్ల నుంచి నేర్చుకోవాల్సి ఉందన్నాడు. ప్రస్తుత సీజన్ సెకండాఫ్‌లో గత నాలుగు మ్యాచ్ లలో మూడింటిలో విజయం సాధించిన కేరళ బ్లాక్ బస్టర్స్ కుర్రాళ్ల గురించి అంచనా వేయడం కష్టంగా ఉన్నదన్నాడు.

అయితే మ్యాచ్ ఫలితాల ఆధారంగా తమ కుర్రాళ్ల పెర్పార్మెన్స్ అంచనా వేయడం కష్ట సాధ్యమని పేర్కొన్నాడు. ప్రతి జట్టు దూసుకెళ్లడానికి ఒక వ్యూహం, విధానం ఉంటుందన్నాడు. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) లో 38 గేమ్స్ ఆడతారని, కానీ ఐఎస్ఎల్ టోర్నీలో 10 - 12 మ్యాచ్ లు పూర్తయ్యే సరికి టోర్నీ ముగింపు దశకు చేరుకుంటున్నదన్నారు.

కానీ ఇటువంటి పరిస్థితుల్లో జట్లను, వాటిల్లోని ప్లేయర్లను ఒక స్టయిల్ లోకి తీసుకొచ్చేలోగానే టోర్నీ పూర్తవుతుందన్నాడు. సెమీ ఫైనల్స్‌లో ప్రవేశించేందుకు కోల్ కతా డీసెంట్ పొజిషన్ లో ఉందన్నాడు. వారితో మంగళవారం జరిగే మ్యాచ్ చాలా కీలకమని తెలిపాడు. అయితే కోల్ కతా మాత్రం సొంతగడ్డపై ఒకే ఒక మ్యాచ్ గెలుచుకున్నదని గుర్తుచేశాడు.

తమతో జరిగే మ్యాచ్ లో రెండు జట్లకూ గెలుపు కీలక పాత్ర పోషించనున్నదని చెప్పాడు. టోర్నీలో ప్లేయర్లు గాయాల బారీన పడటం, పౌల్స్ వల్ల వారిపై సస్పెన్షన్ వేటు పడటం అన్ని జట్లకు ఇబ్బందికరమేనన్నాడు. ఎవరైనా నూటికి నూరుపాళ్లు సరిగ్గా ఆడలేరని, కానీ తమ కుర్రాళ్లపై సస్పెన్షన్లు లేవని తెలిపాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kerala Blasters coach Steve Coppell on Monday said he fails to understand the real purpose of the Indian Super League (ISL) pointing out that by the time a team is in shape, the season is almost over.
Please Wait while comments are loading...