ప్లేఆఫ్‌కు అర్హత: ఢిల్లీతో నార్త్ఈస్ట్‌కు చావోరేవో

Posted By:
Subscribe to Oneindia Telugu

గౌహతి: ఐఎస్ఎల్ 3 ఎడిషన్ ప్రారంభంలో చెలరేగిపోయిన నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్ సి జట్టు గ్రూప్ దశలో ప్లేఆఫ్‌లో అడుగు పెట్టేందుకు ఆపసోపాలు పడుతున్నది. బుధవారం ఢిల్లీ డైనమోస్ జట్టుకు ఆతిథ్యం ఇవ్వడంతోపాటు మరో మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తేనే జాన్ అబ్రహం సేన తొలిసారి ప్లే ఆఫ్ దశలో అడుగు పెట్టే అవకాశం పొందగలుగుతుంది. ముందు ఈ సీజన్ అంతా చెలరేగిపోయి ఆడుతున్న ఢిల్లీ డైనమోస్ జట్టుపై జరిగే మ్యాచ్‌లో గెలుపొందితే నార్త్ఈస్ట్ జట్టు.. సెమీస్ దిశగా సగం ప్రయాణం పూర్తిచేసినట్లే.

కానీ ఆలోచించిన తేలికగా డిఫెన్సివ్, అటాకింగ్ విభాగాల్లో చెలరేగిపోతున్నఢిల్లీ కుర్రాళ్లతో ఆడి గెలుపొందిన దాఖలాలు ఐఎస్ఎల్ టోర్నీలోనే నార్త్ఈస్ట్ జట్టుకు లేవు. గత మూడు మ్యాచ్ ల్లో ఓటమి ఎరుగని నెలో వింగాడ జట్టు మరో ఐదు పాయింట్లు పొందగలిగితేనే సెమీ ఫైనల్స్‌కు చేరుకోగలుగుతుంది. కీలక దశలో హైలాండర్స్.. డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నైయిన్ ఎఫ్ సి జట్టుతో జరిగిన మ్యాచ్ లో గొప్ప ఆటతీరు ప్రదర్శించారు. ఢిల్లీతోనూ జరిగే మ్యాచ్ లో విజయం సాధించడంతోపాటు మరో మూడు కీలక పాయింట్లు పొందే అవకాశం నార్త్ఈస్ట్ జట్టుకు దక్కుతుంది.

ఇంతకుముందు ప్రారంభ ఎడిషన్ లో ఒక మ్యాచ్ డ్రాగా ముగిస్తే, మరో మ్యాచ్ ఢిల్లీ డైనమోస్, గతేడాది ఒక మ్యాచ్ డ్రా, మరో మ్యాచ్ ఢిల్లీ గెలుచుకున్నాయి. ఢిల్లీలో ఈ ఏడాది జరిగిన తొలి మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. ఇప్పటికే ప్లేఆఫ్ కు అర్హత సాధించిన ఢిల్లీ డైనమోస్ పై నార్త్ఈస్ట్ గెలిస్తే తప్ప ముందుకెళ్లలేదు. ప్రస్తుతం 12 మ్యాచ్ ల్లో 15 పాయింట్లతో నార్త్ఈస్ట్ ఐదో స్థానంలో నిలిచింది. బుధవారం జరిగే మ్యాచ్ టాప్ 4 జట్లలో చివరి జట్టు అవకాశాలను నిర్దేశిస్తుంది. మరోవైపు ఢిల్లీ 12 మ్యాచ్ ల్లో 20 పాయింట్లతో టాప్ 4లో రెండో స్థానంలో నిలిచింది.

NorthEast take on Delhi in crucial ISL clash

అయితే ముంబై సిటీతో డిసెంబర్ మూడో తేదీన జరిగే మ్యాచ్ మిగతా ఐదు జట్లలో ఏ టీం ప్లేఆఫ్ దశకు చేరుకుంటుందో తేలిపోతుంది. ఇంతకుముందుకు కేరళ బ్లాక్ బస్టర్స్ తో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియడం జాన్ అబ్రహం సేన ప్లేఆఫ్ ఆశలు సజీవంగా నిలిపింది. నార్త్ఈస్ట్ కోచ్ నెలో వింగాడ మాత్రం బుధవారం జరిగే మ్యాచ్ లో సమతుల్యమైన ఫలితాన్ని సాధించగలనని విశ్వాసంతో ఉన్నాడు. అయితే కొఫ్ఫి డ్రి, నెకోలస్ వెలెజ్ తోపాటు రౌలిన్ బొర్జెస్ కూడా సస్పెన్షన్ వేటును ఎదుర్కోవడం వింగాడకు ఇబ్బందికరంగా మారింది. ఢిల్లీ కోచ్ జంబ్రొట్టా సైతం నార్త్ఈస్ట్ జట్టుతో జరిగే మ్యాచ్ చాలా క్లిష్టమైందేనన్నాడు.

దురద్రుష్టవశాత్తు తాము సెమీ ఫైనల్స్ దశకు ఇంకా వెళ్లలేదని, తాము అత్యంత క్లిష్టమైన జట్టుపై తదుపరి మ్యాచ్ ఆడబోతున్నామని జంబ్రొట్టా వ్యాఖ్యానించాడు. అత్యధికంగా కష్టపడిన కుర్రాళ్లకు ఈ మ్యాచ్ లో విశ్రాంతినివ్వాలని తలపోస్తున్నట్లు చెప్పాడు. తమకు తమ కుర్రాళ్ల ఆరోగ్య, భౌతిక పరిస్థితే ప్రధానమని, నార్త్ఈస్ట్ జట్టుపై గెలుపొందేందుకు ఎటువంటి ప్రణాళిక, వ్యూహం రూపొందించలేదన్నాడు.

మైల్సన్, మార్సిలిన్హో సమ ఉజ్జీలే
కీలకమైన వ్యూహాల అమలులో, ప్రత్యర్థి జట్టులో జోక్యం చేసుకోవడంలోనూ, అటాకింగ్ చేయడంలోనూ నార్త్ఈస్ట్ జట్టుకు మైల్సన్ అల్వెస్ కీలకమైతే ఢిల్లీ కుర్రాడు మార్సిలిన్హో ప్రస్తుత సీజన్‌లో సంచలనాలకు తక్కువేమీ తీసిపోలేదు. గాలిలోనూ, గ్రౌండ్ లోనూ ప్రత్యర్థిలను ఢీకొట్టడంతోపాటు బుధవారం జరిగే మ్యాచ్ లో ఢిల్లీ ఫార్వర్డ్ లైన్ ముందుకు వెళ్లకుండా నిలువరించగల డేంజరస్ ప్లేయర్ మైల్సన్. ఇప్పటికే ఎనిమిది గోల్స్ తో టాప్ లో నిలిచిన మార్సిలిన్హో బంతిపై పట్టు సాధించడంలో ఆయనకు ఆయనే సాటి.

అటాకింగ్‌లో యుసా, ఫ్లోరెంట్ పోటాపోటీ
కస్తుమి యుసా అనే జపనీస్ ప్లేయర్ నార్త్ఈస్ట్ మిడ్ ఫీల్డర్లో అత్యంత కష్టపడే ప్లేయర్. చురుగ్గా అటాకింగ్, క్లినికల్ పాసింగ్, బంతిని వెనుకకు రప్పించుకోవడంలో నేర్పు గల ప్లేయర్ గా కస్తుమి అంటే ప్రత్యర్థులకు హడలే. గోల్స్ సాధనతోపాటు సహచరులకు అసిస్టెన్స్ లోనూ ముందుంటాడు. నార్త్ఈస్ట్ ఆటాకింగ్ లోనూ ముందుంటాడు. ఢిల్లీ సారధి ఫ్లోరెంట్ మాలౌదా మిడ్ ఫీల్డ్ లో కీలకం. ఇప్పటికే ముడూ గోల్స్, ఐదు అసిస్టెన్స్ లతో జట్టుకు తానెంత కీలకమో తేల్చి చెప్పాడు. కౌంటర్ అటాకింగ్ తో హైలాండర్లపై విరుచుకుపడతాడనడంలో సందేహం లేదు.

వెలెజ్, ఎడాథోడికా డిఫెన్స్‌లో హోరాహోరీ
చెన్నైయిన్ ఎఫ్ సి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ ప్లేయర్ నికోలస్ వెలెజ్ మంచి మ్యాచ్ ఆడాడు. పలు అవకాశాలు కల్పించాడు. నార్త్ఈస్ట్‌లో ప్రభావిత ప్లేయర్ కావడంతోపాటు ప్రత్యర్థుల డిఫెన్స్‌ను తిప్పికొట్టగల సామర్థ్యం గలవాడు. బుధవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డైనమోస్ జట్టుపై చెలరేగిపోయే అవకాశాలు లేకపోలేదు. ఢిల్లీ డైనమోస్‌లో సెంటర్ బ్యాక్ అనాన్ ఎడాథోడికా కీలకప్లేయర్‌గా అవతరించాడు. కీలక దశలో వ్యూహాలను ముందుకు తీసుకెళ్లడంతోపాటు ప్రత్యర్థి జట్లు అటాకింగ్ ను అధిగమించగల నేర్పరి. హైలాండర్స్ పై ఎడాథోడికా తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించగలడనడంలో సందేహం లేదు.

జట్ల వివరాలు:
నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి : టిపి రెహెనేశ్, విల్లింగ్టన్ గోమ్స్, మైల్సన్ అల్వెస్, నిర్మల్ ఛెత్రి, రీగన్ సింగ్, రాబిన్ గురుంగ్, సలాం రంజన్ సింగ్, షౌవిక్ ఘోష్, డిడియర్ జొకొరా, ఫనాయి లాల్రెంపుయా, హోలీచరణ్ నార్జారీ, జెర్రీ మావ్హింగ్తాంగా, కస్తుమియుసా, కొఫి క్రిస్టియన్ ఎన్'డ్రీ, లాల్లియాంజువాలా ఛాంగ్టే, రౌల్లిన్ బొర్జెస్, సైత్యాసేన్ సింగ్, విల్లింగ్టన్ ప్రిరోరీ, ఎమిలియానో అల్ఫారో, నికోలస్ వెలెజ్, రాబర్ట్ కుల్లెన్, షాషా అనీఫ్, సుమిత్ పస్సీ.

ఢిల్లీ డైనమోస్ ఎఫ్ సి: అంటోనియో దొబ్లాస్ సంతానా, సంజీబన్ ఘోష్, సోరం పౌరెయి, రుబెన్ గొంజాలెజ్ రోచా, డేవిడ్ అడ్డీ, ఇబ్రహీమా నస్సీ, అనాస్ ఎడాథోడికా, చింగ్లెన్సానా కొంషాం సింగ్, లాల్చావాంకిమా, రూపర్ట్ నూగ్రుమ్, సౌవిక్ చక్రవర్తి, ఫ్లోరెంట్ మాలౌదా, బ్రూనో అగస్టో, పెలిస్సారి డీ లిమా, మార్కోస్ టేబర్, ఎమర్సన్ గోమ్స్ డి మౌరా, డెన్సన్ దేవదాస్, మల్సావంజులా, రిచర్డ్ గడ్జె, బాదరా బాద్జీ, అర్జున్ తుడు, మార్సెలో లైటీ పెరీరా, కియాన్ లూయిస్, అమోస్ డూ, అల్విన్ జార్జి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Fifth-placed NorthEast United FC host high-flying Delhi Dynamos FC in Match 52 of Hero Indian Super League 2016 at the Indira Gandhi Athletic stadium in Guwahati on Wednesday.
Please Wait while comments are loading...