ఫోటోలు: ప్రపంచంలో అతిపెద్ద క్రీడా విషాదాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మైదానంలో తమ ఆటతో ఎంతో మంది అభిమానులను అలరించారు. నిజ జీవితంలో మాత్రం విధి ముందు ఓడిపోయారు. తమ నైపుణ్యంతో చరిత్రలో అతి పెద్ద విజయాలను సాధించినప్పటికీ, అనుకోని సంఘటనల్లో ఎంతో మంది క్రీడాకారులు తమ ప్రాణాలు కోల్పోయారు.

మంగళవారం ఉదయం ఇదే జరిగింది. బొలివియా నుంచి కొలంబియాలోని మెడిలిన్స్‌ విమానాశ్రయానికి వెళ్తున్న ఓ విమానం కుప్పకూలి 81 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో బ్రెజిల్‌కు చెందిన ఫుట్‌బాల్‌ క్రీడాకారులు కూడా మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం పుట్‌బాల్ క్రీడాభిమానుల్ని కలవరానికి గురి చేసింది.

ఎక్కువ మంది క్రీడాకారులు విమాన ప్రమాదాల్లోనే అసువులు బాస్తున్నారు. కొలంబియా విమాన ప్రమాదాన్ని ప్రపంచ పుట్‌బాల్ చరిత్రలోనే ఘోరమైన ప్రమాదంగా అభివర్ణిస్తున్నారు. కొలంబియా దుర్ఘటన నేపథ్యంలో క్రీడా చరిత్రలో అతిపెద్ద ప్రమాదాలను ఒక్కసారి చూద్దాం.

 మునిచ్‌ ప్రమాదం (1958)

మునిచ్‌ ప్రమాదం (1958)


టేకాఫ్‌లో సమస్య వల్ల బ్రిటిష్ యూరోపియన్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం క్రాష్ అయ్యింది. వెస్ట్ జర్మనీలోని మ్యునిచ్ విమానాశ్రయంలో 1958, ఫిబ్రవరి 6న ఈ సంఘటన చోటు చేసుకుంది. మూడో ప్రయత్నంలో టేకాఫ్ తీసుకున్నా విమానం సరైన దిశలో పైకి లేవకపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. విమానంలో మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ జట్టుతో పాటు అభిమానులు, జర్నలిస్ట్‌లు ఉన్నారు. 44 మంది ప్రయాణికుల్లో 23 మంది మరణించారు.

 ది హిల్స్ బరో దుర్ఘటన (1996)

ది హిల్స్ బరో దుర్ఘటన (1996)

ప్రపంచ పుట్ బాల్ చరిత్రలోనే ది హిల్స్ బరో దుర్ఘటనను ఓ చీకటి అధ్యయనంగా భావిస్తారు. ఇంగ్లాండ్ పుట్ బాల్ చరిత్రలో ఇది దురదృష్టకర సంఘటన. ఎఫ్ఏ కప్ మ్యాచ్‌లో భాగంగా నాటింగ్ హామ్, లివర్ పూల్ జట్ల మధ్య గేమ్ ఆడుతున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 776 మంది అభిమానులు గాయలు పాలవ్వగా, 96 మంది చనిపోయారు.

 పైలట్ తప్పిదం వల్ల (1977)

పైలట్ తప్పిదం వల్ల (1977)


ఇవాన్స్‌విల్లీ బాస్కెట్‌బాల్ జట్టును తీసుకెళ్తున్న చార్టెడ్ ఫ్లయిట్ పొగమంచు, వర్షం కారణంగా ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో కుప్పకూలింది. క్రాస్‌ల్యాండింగ్ కావడంతో జట్టు, కోచింగ్ సిబ్బందిలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు. పైలట్ తప్పిదం వల్లే ఘటన జరిగిందని విచారణలో తేలింది. టేకాఫ్ తర్వాత కీలకమైన రుడెర్, కంట్రోల్‌లాక్స్‌ను తీసేయడం మర్చిపోయాడని విచారణలో తేల్చారు.

 పోలిష్ ఎయిర్‌లైన్స్ విమానం (1980)

పోలిష్ ఎయిర్‌లైన్స్ విమానం (1980)


అమెరికా బాక్సింగ్ జట్టుతో ప్రయాణిస్తున్న పోలిష్ ఎయిర్‌లైన్స్ విమానం మెకానికల్ వైఫల్యంతో 1980లో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 87 మంది ప్రయాణికులు మృతిచెందారు. అమెరికా తరఫున ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన చాలా మంది బాక్సర్లు ఈ ప్రమాదంలో మరణించడంతో ఆ దేశం మాస్కో (1980) ఒలింపిక్స్‌ను రద్దు చేసుకుంది.

 బ్రాడ్ ఫోర్డ్ సిటీ స్టేడియం (1985)

బ్రాడ్ ఫోర్డ్ సిటీ స్టేడియం (1985)


ఇంగ్లాండ్ పుట్ బాల్ చరిత్రలో బ్రాడ్ ఫోర్డ్ సిటీ స్టేడియం దుర్ఘటన కూడా అతి పెద్దది. గ్యాలరీలో ఓ అభిమాని సిగరెట్ పీకును వేయడంతో నిప్పంటుకుని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 450 మంది గాయాలు పాలవ్వగా, 56 మంది ప్రాణాలు కోల్పోయారు.

మిలిటరీ విమానం (1993)

మిలిటరీ విమానం (1993)

సెనెగల్‌లో మ్యాచ్ కోసం జింబాబ్వే జాతీయ ఫుట్‌బాల్ జట్టును తీసుకెళ్తున్న మిలిటరీ విమానం ఇంజన్ సమస్యతో 27 ఏప్రిల్ 1993లో ప్రమాదానికి గురైంది. 1994 వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడేందుకు 30 మంది ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది మొత్తం సంఘటన స్థలంలోనే మరణించారు. ఇందులో 18 మంది ఫుట్‌బాల్ క్రీడాకారులు, జట్టు కోచ్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు.

 పోర్టో సెడ్ స్టేడియం దుర్ఘటన (2012)

పోర్టో సెడ్ స్టేడియం దుర్ఘటన (2012)


2012లో జరిగిన ఈజిప్టులో జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో ఇదొకటి. ఆల్-మస్రీ, ఆల్-ఆల్కీ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆల్ మస్రీ 3-0తో విజయం సాధించింది. ఈ ఓటమిని తట్టుకోలేని ఆల్-ఆల్కీ జట్టు అభిమానులు ప్రత్యర్ధి జట్టు అభిమానులపై కత్తులు, బాటిళ్లు, చెక్కలతో దాడి చేశారు. ఈ ప్రమాదంలో 79 మంది చనిపోగా, 1000కి పైగా అభిమానులు గాయపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Football world experienced a devastating tragedy today as Brazilian football club Chapecoense footballers were killed in an air crash in Colombia.
Please Wait while comments are loading...