సెమీస్ బెర్తే లక్ష్యంగా ముందు: కోల్‌కతా సారధి

Posted By:
Subscribe to Oneindia Telugu

కోల్‌కతా: సెమీ ఫైనల్స్‌లో బెర్త్ సాధించడంపైనే ద్రుష్టి సారించామని అట్లెటికో డీ కోల్‌కతా సారధి హెల్డర్ పోస్టిగ పేర్కొన్నాడు. మంగళవారం కోల్‌కతాలో కేరళ బ్లాక్ బస్టర్స్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి కొప్పెల్ సేనను అణగ్గొట్టడమే లక్ష్యమని తెలిపాడు. 'మా పరిస్థితి మాకు కంఫర్ట్‌బుల్‌గా ఉంది. ప్లేఆఫ్ దిశగా అర్హత సాధించేందుకు మెరుగ్గా ఆడుతున్నాం' అని పొస్టిగ అన్నాడు.

మంగళవారం జరిగే మ్యాచ్‌ ఫలితం ఇరువైపులా సానుకూలంగా ఉంటుందని తెలిపాడు. 12 మ్యాచ్‌లలో 18 పాయింట్లతో టేబుల్‌పై మూడో స్థానంలో నిలిచిన కోల్‌కతా తన ప్రత్యర్థుల కంటే ఒక్క గోల్ పాయింట్ మాత్రమే ముందంజలో ఉన్నాడు. కోల్‌కతా జట్టు ఒక మ్యాచ్‌లో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేస్‌కు చేరుకోగలుగుతుంది. టాప్ 4లో చోటు దక్కించుకుని సేఫ్ జోన్‌లో ఉంటుంది.

కేరళ బ్లాక్ బస్టర్స్‌తో మ్యాచ్

కేరళ బ్లాక్ బస్టర్స్‌తో మ్యాచ్

‘కేరళ బ్లాక్ బస్టర్స్‌తో జరిగే మ్యాచ్ చాలా కష్టమైంది. మా లక్ష్యం గెలుపే. ఎల్లవేళలా అట్లెటికో డి కోల్ కతా విజయ లక్ష్యంతోనే ముందుకెళుతుంది. ఇది మా లక్ష్యం. అన్నివేళలా ఒక మంచి జట్టుతో ఆడగలగడం అంత తేలిక్కాదు. కానీ మేం మెరుగ్గా ఆడగలం' అని తెలిపాడు. అట్లెటికో డి కోల్ కతా కోచ్ జోస్ మొలీనా ప్రతి మ్యాచ్‌లోనూ అటాకింగ్ ప్లేయర్లను రొటేట్ చేస్తూ ముందుకుసాగుతున్నాడు.
పొస్టిగకు తోడు ఒకసారి ఇయాన్ హుం, మరోసారి జువాన్ బెలెంసోకోలతో అటాకింగ్ కు ప్రాధాన్యం ఇస్తున్నాడు.

టీం ముఖ్యం, ప్లేయర్లు కాదు

టీం ముఖ్యం, ప్లేయర్లు కాదు

దీనిపై పొస్టిగ స్పందిస్తూ ‘మీరు ఇద్దరు అద్భుతమైన ప్లేయర్ల గురించి మాట్లాడుతున్నారు. నేనెలా ఆడాలో కోచ్ నిర్దారిస్తాడు. నా వరకు టీం చాలా ముఖ్యం. ప్లేయర్లు ముఖ్యం కాదు. మీరు చాలా తెలివైన, ఇంటిలిజెంట్ ప్లేయర్ల గురించి మాట్లాడుతున్నారు. వారితో కలిసి ఆడటం ఇబ్బందికరమేమీ కాదు' అని పొస్టిగ మీడియాతో అన్నాడు.

బంతిపై ఆధిక్యం సాధించాలి

బంతిపై ఆధిక్యం సాధించాలి

కేరళ జట్టును పరిగణనలోకి తీసుకుంటే కొప్పెల్ టీం లాంగ్ బాల్స్ ఆడగల సామర్థ్యం కలిగి ఉంది. లాంగ్ బాల్స్ అటాకింగ్ చేయడంలో ముందు ఉంటుందని కోల్‌కతా కోచ్ జోస్ మొలీనా వ్యాఖ్యానించాడు. బంతిపై ఆధిక్యం సాధించడానికి ప్రాధాన్యం ఇస్తుందన్నాడు. తొలి రెండు మ్యాచ్ లలో ఓటమి పాలైనా.. తర్వాతర్వాత పుంజుకుని టాప్ 4 బాక్స్ లో చేరిపోయిందన్నాడు. కనుక కేరళ బ్లాక్ బస్టర్స్ తో జరిగే మ్యాచ్ చాలా టప్ మ్యాచ్ అని పేర్కొన్నాడు. కానీ తాము కూడా మెరుగయ్యామని, టాప్ 4లో చోటు దక్కించుకోవడమే తమ లక్ష్యమని మొలీనా తెలిపాడు.

మిడ్ ఫీల్డర్ సమీగ్ దౌటీ

మిడ్ ఫీల్డర్ సమీగ్ దౌటీ

అట్లెటికో డి కోల్ కతా జట్టులో నిరంతరం ప్రతిభావంతమైన మిడ్ ఫీల్డర్ సమీగ్ దౌటీ మ్యాచ్‌లో అందుబాటులో ఉంటాడా? లేదా? తెలియదు. హెన్రిక్యూ సెరెనో, బైద్యనందా సింగ్ ల బాగస్వామ్యంపై కొన్ని అనుమానాలు ఉన్నాయన్నాడు. ‘కొందరు ప్లేయర్లు ఆడటం సందేహస్పదమే. దౌటీ వారిలో ఒకడు. బైద్యనందాసింగ్, హెన్రిక్యూ సెరెనో కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారు' అని మొలీనా చెప్పాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Atletico de Kolkata's (ATK) marquee footballer Helder Postiga believes they are on track for a semi-final berth and focussed to win against Kerala Blasters in a crunch Indian Super League (ISL) match on Tuesday.
Please Wait while comments are loading...