పట్టుకోసం పాట్లు: కేరళ, కోల్‌కతాలకు సవాలే

Posted By:
Subscribe to Oneindia Telugu

కోల్‌కతా: పాయింట్ల పట్టికలో 'టాప్ 4'లో చోటు దక్కించుకున్న అట్లెటికో డి కోల్ కతా, కేరళ బ్లాక్ బస్టర్స్ మధ్య మంగళవారం రాత్రి కోల్‌కతాలోని రవీంద్ర సారోబార్ స్టేడియంలో కీలక మ్యాచ్ జరుగనున్నది. నాలుగో స్థానంలో ఉన్న కేరళ బ్లాక్ బస్టర్స్‌కు మూడోస్థానంలో ఉన్న అట్లెటికో డీ కోల్‌కతా ఆతిథ్యం ఇస్తున్నది. ఇరు జట్లు ఇంతకుముందు జరిగిన కీలక మ్యాచ్‌లలో విజయం సాధించి జోరు మీదున్నాయి. ఇంతకుముందు ఎఫ్ సి గోవా జట్టుపై 2 - 1 స్కోర్ తేడాతో పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో ఆధిపత్యం సాధించిన కోల్‌కతా జట్టు, ఎఫ్ సి పుణె సిటీ జట్టుపై కేరళ విజయంతో ఉత్సాహంగా ఉన్నాయి.

12 మ్యాచ్‌లు ఆడిన రెండు జట్లు మంగళవారం జరిగే మ్యాచ్‌లో చావో రేవో అన్నట్లు ముఖాముఖీ తలపడుతున్నాయి. మ్యాచ్‌లో గెలుపొందినా, డ్రాగా ముగించినా మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్నఅట్లెటికో డీ కోల్‌కతా.. సెమీ ఫైనల్స్‌లో బెర్త్ ఖరారైంది. ఆత్మ నూన్యతా భావంతో కొట్టుమిట్టాడుతున్న కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడం కీలకమే. దీనికి తోడు సొంతగడ్డపై ఆడటం కోల్‌కతా జట్టుకు సానుకూలాంశం కానున్నది. ఢిల్లీ డైనమోస్ జట్టుతోపాటు అట్లెటికో డీ కోల్ కతా సైతం సొంత గడ్డపై అడ్వాంటేజ్ పొందడం పరిగణనలోకి తీసుకోవాల్సిందే.

Preview: Kolkata look to book semis berth against Kerala

2014 చాంపియన్లు కోల్‌కతాతో గత నాలుగు మ్యాచ్ లలో మూడింటిలో ప్రత్యేకించి పుణెతో జరిగిన కీలక మ్యాచ్‌లో గెలుపొందిన కేరళ బ్లాక్ బస్టర్స్ తలపడనున్నాయి. రెండేండ్ల క్రితం కోల్ కతాలో రెండు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ 1 - 1 స్కోర్ తేడాతో డ్రాగా ముగిస్తే, కోచిలో కేరళ బ్లాక్ బస్టర్స్‌పై 2 - 1 విజయం కోల్ కతా విజయం సాధించింది. రెండు జట్లు ఫైనల్స్ పోటీ పడినప్పుడు కోల్ కతా 1 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. గతేడాది కోల్‌కతా 2 - 1, 3 - 2 స్కోర్ తేడాతో రెండు మ్యాచ్‌లను కూడా గెలుచుకున్నది. ప్రస్తుత సీజన్ ప్రారంభంలో జావీ లారా గోల్ సాధించడంతో అట్లెటికో డీ కోల్‌కతా పై చేయి సాధించింది.

డిఫెన్స్‌లో రాబర్ట్ కీలకం.. ఫార్వర్డ్లో డకెన్స్
నెమ్మదిగా ఎదిగినా అట్లెటికో డీ కోల్‌కతా డిఫెన్స్ రాబర్ట్ లాల్థలామౌనా డిఫెన్స్ వింగ్‌లో కీలక ప్లేయర్. స్ట్రాంగ్ అండ్ పేసీ ప్లేయర్‌గా నిలిచిన రాబర్ట్ ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశమివ్వడు. ఔట్ బాక్స్ బయట కీలక సమయాల్లో టాక్లింగ్, క్లియరెన్స్ చేయడం ఆయనకు గల సామర్థ్యాల్లో ఒకటి. కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుపై దూకుడుగా అటాకింగ్ చేయగలడని భావిస్తున్నారు. హైతీయన్ ఫార్వర్డ్ ప్లేయర్ డంకెన్ నాజోన్.. కేరళలో కీలక ఫార్వర్డ్ ఆటగాడు. పుణెపై విజయంలో ప్రధానపాత్ర పోషించాడీ డకెన్స్ నాజోన్. స్కోర్ ఓపెనర్‌గా నిరంతరం పుణెను డిఫెన్స్ లోకి నెట్టేశాడు. నిశ్శబ్దంగా మ్యాచ్ పినిష్ చేయడంతోపాటు బాక్స్ బయట డేంజరస్ జోన్ నుంచి మ్యాచ్ ను హ్యాండిల్ చేయగల డకెన్స్.. కోల్ కతాతో చెలరేగిపోతాడని అంచనావేస్తున్నారు.

మిడ్‌ఫీల్డ్‌లో లారా, అజ్రక్ సమ ఉజ్జీలే
అట్లెటికో డీ కోల్ కతా జట్టు బెస్ట్ ప్లేయర్లలో జావీ లారా ఒకడనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. కీలక పాస్‌లు అందజేయడంతోపాటు మిడ్ ఫీల్డ్ లో చెలరేగిపోతాడు. ఫార్వర్డ్ ప్లేయర్ గా ప్రత్యర్థిపై అటాకింగ్ చేయగల సామర్థ్యం ఉంది. మొత్తంగా కోల్‌కతా సెంట్రల్ అటాకింగ్‌లో కీలకం. 25 షాట్లలో 18 లక్ష్య సాధన దిశగా చేసివనవైతే మూడు గోల్స్ సాధించిన తిరుగులేని ఆటగాడు. ఒకవేళ ఈ మ్యాచ్ అందుబాటులో ఉంటే కోల్ కతాకు పెద్ద అసెట్. కానీ అనారోగ్యంతో బాధపడుతుండటంతో మొలీనా సేన ఆందోళనకు గురవుతున్నది. కేరళ బ్లాక్ బస్టర్స్ మిడిల్ లో సమర్థమైన ప్లేయర్ అజ్రక్ మహ్మత్. ప్రత్యర్థి అటాకింగ్‌ను తిప్పికొట్టడంతోపాటు ఫార్వర్డ్ ప్లేయర్ గా కూడా అప్పోనెంట్స్ కు ముప్పు వంటివాడు.

మ్యాచ్ ఫలితం నిర్దేశంలో జువాన్, సెడ్రిక్ కీలకమే
గోవాతో జరిగిన తొలి మ్యాచ్‌లో తనకు గల శక్తి సామర్థ్యాలను రుజువుచేసుకుని గోల్ సాధించాడు. రెండు గోల్స్, ఒక అసిస్టెన్స్ అందించిన బెలెంసోకో మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించగలడు. గాలిలోనూ, గ్రౌండ్ పైనా చెలరేగిపోయి లక్ష్యాలు నిర్దేశించగల సామర్థ్యం ఆయన సొంతం. ఈ స్పానిష్ ప్లేయర్ ప్రత్యర్థి జట్టు కేరళ బ్లాక్ బస్టర్స్ కు పెద్ద తలనొప్పే. కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుకు కీలక స్థంభాల్లో సెడ్రిక్ హెంగ్బార్ట్ ఒకడు. కీలక లక్ష్యాలను చేధించడంలోనూ గాలిలో దూసుకెళ్లడంలోనూ ఎక్స్‌ఫర్ట్. ఒక గోల్, ఒక అసిస్టెన్స్ అందించిన హెంగ్బార్ట్.. కోల్‌కతా విజయావకాశాలను దెబ్బతీయగలడు.

జట్ల వివరాలు:
అట్లెటికో డి కోల్ కతా: దేబ్జిత్ మజుందార్, డాని మల్లో, షిల్టాన్ పాల్, అర్నాబ్ మొండాల్, హెన్రిక్యూ ఫొనెస్కా సెరెనో, జోస్ ఆర్రోయో, కీగన్ పెరీరా, కింషుక్ దేవ్ నాథ్, ప్రబీర్ దాస్, ప్రీతం కొట్టల్, రాబర్ట్ లాల్తామౌనా, అభినాష్ రుడియాస్, బైద్యనాథ్ సింగ్, బికాశ్ జైరు, బిక్రంజిత్ సింగ్, బోర్జా ఫెర్నాండెజ్, జావీలారా, జువెల్ రాజా, లాల్రిండికా రాల్టే, ఆఫెంట్సే నాటో, సమీగ్ దౌటీ, స్టీఫెన్ పియర్సన్, హెల్డర్ పొస్టిగ, ఇయాన్ హుమ్, జువాన్ బెలెంసోకో.

కేరళ బ్లాక్ బస్టర్స్: గ్రాహం స్టాక్, సందీప్ నాండే, కునాల్ సావత్, అరోన్ హుగెస్, సెడ్రిక్ హెంగ్బార్ట్, సందేశ్ జిగ్నాస్, గుర్విందర్ సింగ్, ప్రతీక్ చౌదరి, ఎల్హాద్జీ డోయే, జోస్ కురియస్, డిడియార్ బోరిస్ కాడియో, అజ్రక్ మహమత్, మెహతాబ్ హు్స్సేన్, మహ్మద్ రఫీఖ్, ఇస్పాఖ్ అహ్మద్, వినిత్ రాయ్, మిఖైల్ చోప్రా, అంటోనియో జెర్మన్, కెర్వెన్స్ బెల్ఫోర్ట్, డంకెన్స్ నాజోన్, మహ్మద్ రఫీ, థోంగ్ఖోసిం హావోకిప్, ఫరూక్ చౌదరి, సికె వినీత్, రినో అంటో.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Third-placed Atlético de Kolkata play host to fourth-placed Kerala Blasters in match 51 of Hero Indian Super League 2016 at the Rabindra Sarobar Stadium in Kolkata on Tuesday.
Please Wait while comments are loading...