వరల్డ్ 11లో రొనాల్డో, గ్రైజ్మన్: చోటు దక్కని రూనీ

Posted By:
Subscribe to Oneindia Telugu

పారిస్: ఈ ఏడాది ఫిఫా అధికారికంగా ప్రకటించిన టాప్ 11 ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లండ్ జట్టు సారధి వాయ్నే రూనీ పేరు తొలిసారి మిస్సయ్యింది. యధావిధిగా స్పానిష్ లీగ్ 'లా లీగ' టోర్నీ జెయింట్స్ రియల్ మాడ్రిడ్, బార్సిలోనా స్టార్ ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో, లియానెల్ మెస్సీ, ఆంటోనియో గ్రైజ్మన్ పేర్లు చోటుచేసుకున్నాయి.

ఫిఫా వెల్లడించిన ఫిఫ్‌ప్రో టాప్ ప్లేయర్ల ఎంపికకు 75 దేశాల్లోని 25 వేల మంది అసాధారణ ప్రతిభ కనబరిచిన నిపుణులైన ఆటగాళ్ల ప్రతిభను ఆయా దేశాల గవర్నింగ్ బాడీల ఓటింగ్‌ ఆధారం. ఒక గోల్ కీపర్, నలుగురు డిఫెండర్లు, ముగ్గురేసి మిడ్ ఫీల్డర్లు, ఫార్వర్డ్ ప్లేయర్లతో 4-3-3 ఫార్మాట్‌తో జాబితాను రూపొందించారు.

క్రిస్టియానో రొనాల్డో, లియానెల్ మెస్సీ, అంటోనియో గ్రైజ్మన్, నేయ్మార్, లూయిస్ సౌరెజ్, గారెథ్ బాలే పేర్లు టాపర్ల జాబితాలో వచ్చాయి. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో లైసెస్టర్ సిటీ తరఫున కీలక పాత్ర పోషిస్తున్న జామై వార్డి, ఎన్ గోలో కాంటే పేర్లు తప్పించారు. యూరో - 2016 కప్ విజేతగా పోర్చుగల్ జట్టు సారధి క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ 1 1 జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

అల్జెరియన్ ఇంటర్నేషనల్ రియాడ్ మాహ్రెజ్ పేరు కూడా మిస్సయింది. ఎనిమిది మంది కొత్త ప్లేయర్లకు చోటు లభించగా, రియల్ మాడ్రిడ్ కంటే ఎఫ్ సి బార్సిలోనా టీం నుంచి ఇద్దరు ప్లేయర్లు అధికంగా 12 మందికి ప్లేస్ లభించింది. మాంఛెస్టర్ సిటీ జంట విన్సెంట్ కొంపనీ, యాయా టౌరె, చెల్సియా ప్లేయర్ జాన్ టెర్రి, బేయర్న్ మునిచ్ ఆటగాడు అర్జెన్ రొబ్బెన్, పొర్టో నుంచి ఐకెర్ కాసిల్లాస్, రియల్ మాడ్రిడ్ జట్టుకు చెందిన జేమ్స్ రోడ్రిగెజ్ పేర్లు కూడా పరిగణనలోకి తీసుకోలేదు.

ఎంపికైన టాప్ 55 ప్లేయర్లు వీరే:

ఎంపికైన టాప్ 55 ప్లేయర్లు వీరే:

గోల్ కీపర్: క్లాడియో బ్రేవో, జియాంలుంగి బఫ్ఫోన్, డేవిడ్ డి జియా, కెయ్లొర్ నావస్, మాన్యుయల్ నేయుర్.
డిఫెండర్లు: డేవిడ్ అలాబా, జోర్డి అల్బా, సెర్జ్ ఔరియర్, హెక్టర్ బెల్లెరిన్, జెరోమ్ బోటెంగ్, లియోనార్డో బొనుస్సీ, డానియల్ కార్వాజల్, గైర్జియో చైల్లిని, డాని అల్వెస్, డేవిడ్ లూయిజ్, డియాగో గోడిన్, మాట్స్ హుమ్మెల్స్, ఫిలిఫ్ లాహ్మ్, మార్సెలో, జావియర్ మాచెరానో, పేప్, గెర్రార్డ్ పిఖ్యూ, సెర్జియో రామోస్, థియాగో సిల్వా, రాఫెల్ వారానె.

మిడ్ ఫీల్డర్లు:

మిడ్ ఫీల్డర్లు:

జాబి అలొంసో, సెర్జియో బస్ క్వెట్స్, కెవిన్ డి బ్రూయ్నె, ఎడెన్ హజార్డ్, అండ్రెస్ ఇనైస్టా, ఎన్' గోలో కాంటే, టోనీ క్రూస్, లుకా మొడ్రిక్, మెసుట్ ఒజిల్, డిమిట్రి పయెట్, పాల్ పొగ్బా, ఇవాన్ రాకిటిక్, డేవిడ్ సిల్వా, మార్కో వెర్రాట్టి, అర్టూరో విడల్.

స్ట్రయికర్లు:

స్ట్రయికర్లు:

సెర్జియో అగౌరో, గారెథ్ బాలె, కరీం బెంజెమా, క్రిస్టియానో రొనాల్డో, పాలౌ డైబాలా, అంటోనియో గ్రైజ్మన్. గొంజాలో హైగుయైన్, జ్లాటన్ ఇబ్రహిమోవిక్, రాబర్డ్ లెవాన్డోవిస్కీ, లియానెల్ మెస్సీ, థామస్ ముల్లర్, నేయ్మార్, అలెక్సిస్ సాంచెట్, లూయిస్ సౌరెజ్, జామి వార్డి.

ఎఎఫ్‌సి డెవలపింగ్ అవార్డుకు ఎఐఎఫ్ఎఫ్‌ నామినేషన్

ఎఎఫ్‌సి డెవలపింగ్ అవార్డుకు ఎఐఎఫ్ఎఫ్‌ నామినేషన్

ఎఎఫ్‌సి డెవలపింగ్ అవార్డు-2016కు వియత్నాం, మలేషియాలతోపాటు అఖిల భారత్ ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) నామినేట్ అయ్యింది. అబుదాబిలో గురువారం ఎఎఫ్‌సి అవార్డులను ప్రకటించారు. ‘మా ప్రయత్నాలకు ఎఎఫ్‌సి గుర్తింపునిచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా.భారత్ ఫుట్ బాల్ సరైన దిశలో పయనం సాగిస్తున్నది' అని ఎఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించాడు. ఎఎఫ్ సి ఉపాధ్యక్షుడు అలీ కఫాషియన్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నాడు. ఆయా సంస్థల కార్యక్రమాలు, నిర్వహిస్తున్న టోర్నీలు తదితర కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులకు ఎంపికచేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
FIFA have officially announced a shortlist of 55 football players across the globe from all the leagues for the FIFA FIFPro World 11 2016.
Please Wait while comments are loading...