లాంగ్ లీగ్ కోసం ఫోర్లాన్, ఛెత్రి బ్యాటింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: భారత్‌లో సమిష్టి ఫుట్ బాల్ లీగ్ నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని ముంబై సిటీ ఎఫ్ సి సారధి డియాగో ఫోర్లాన్, ఇండియన్ స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి అభిప్రాయపడ్డారు. ఆ సమిష్టి లీగ్ ను సుదీర్ఘ కాలం నిడివితో నిర్వహిస్తే దేశీయ ఫుట్ బాల్ ఆట తీరు ప్రగతిపథంలో దూసుకెళ్లేందుకు అవకాశం లభిస్తుందన్నారు.

'నేను భారత్ లో కొన్ని నెలలుగా ఉంటున్నాను. సునీల్ ఛెత్రి, మరి కొందరు ప్రతిభా వంతులైన ప్లేయర్లు భారత్ కు అందుబాటులో ఉన్నారు. గోల్స్ చేయగల సామర్థ్యం కల వారు ఉన్నారు. డిఫెండర్లు కూడా ఉన్నారు. ఇండియన్ సూపర్ లీగ్, ఇతర లీగ్‌ల నిర్వాహకులు సంయుక్తంగా సమావేశమై సమస్యలు, సాధక బాధకాలు, ఇబ్బందులు పరిష్కరించుకోగలిగితే సమిష్టి లీగ్ నిర్వహణ దిశగా ముందుకు వెళ్లొచ్చు' అని ఉరుగ్వే మాజీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించాడు.

'నేను 37 ఏళ్ల వయస్సులో కేవలం మూడు నెలల పాటు టోర్నీ ఆడేందుకు వచ్చా. కానీ మీరు ఆటగాళ్ల భవిష్యత్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి ఫుట్ బాల్ లీగ్ కనీసం తొమ్మిది నెలల నుంచి పది నెలల వరకు కొనసాగించాల్సి ఉంది. యూరప్‌లో టాప్ ప్లేయర్లంతా పలు గేమ్స్‌లో ఆడుతుంటారు. సుమారు 60 గేమ్స్ లో పాల్గొంటారు. ఇతరుల మధ్య 40 - 50 మ్యాచ్‌ల తేడా ఉంటుంది' అని ఫోర్లాన్ చెప్పాడు.

భారతీయ ప్లేయర్లు బాగా ఆడుతున్నారు

భారతీయ ప్లేయర్లు బాగా ఆడుతున్నారు

ఏడాది పొడవునా ఆడుతూనే ఉన్నా మంచిదేనన్నాడు. అప్పుడు ప్రతి ఒక్కరూ ఒక లీగ్‌లో పాల్గొనేందుకు వీలు చిక్కుతుందని చెప్పాడు. ఇది అందరికీ ఐడియల్ గా ఉంటుందని పేర్కొన్నాడు. ఐఎస్ఎల్‌లో యువ ప్లేయర్లకు అవకాశాలు కల్పించడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయన్నాడు. భారతీయ ప్లేయర్లు మంచిగా ఆడుతున్నారని, కానీ యువ క్రీడాకారులకు చోటు కల్పించాల్సి ఉన్నదని, తద్వారా మాత్రమే భారత ఫుట్ బాల్ పురోభివ్రుద్ధికి మేలు జరుగుతుందన్నాడు. అలాగే ఆ కుర్రాళ్లకు మంచి కోచ్‌లనూ ఏర్పాటుచేయాల్సి ఉన్నదన్నాడు.

భిన్నమైన శిక్షణ పొందుతున్నారు

భిన్నమైన శిక్షణ పొందుతున్నారు

‘కొందరు భారతీయ ప్లేయర్లు ఐఎస్ఎల్ లో ఆడగలరు గానీ ప్రతి ఒక్కరికి అవకాశం లభించదు. వారంతా ఆట నుంచి భిన్నమైన శిక్షణ పొందుతున్నారు. సునీల్ ఛెత్రి ప్రస్తుతం ఈ టోర్నీలో ఆడుతున్నాడు. తిరిగి ఎనిమిది నెలల పాటు సాగే ఐ - లీగ్ టోర్నీ కోసం వెనుకకు వెళ్లిపోతాడు. ఒక జట్టు నుంచి మరో జట్టులోకి వెంటనే పరివర్తన చెందడం తేలికేం కాదు' అని ఫోర్లాన్ అన్నాడు.

ఫార్వర్డ్ ప్లేయర్ ఆడా: ఫోర్లాన్

ఫార్వర్డ్ ప్లేయర్ ఆడా: ఫోర్లాన్

చిన్నప్పటి నుంచి తాను ఎల్లవేళలా ఫార్వర్డ్ ప్లేయర్ గానే ఆడానని ఫోర్లాన్ చెప్పాడు. తనకు కంఫర్ట్‌బుల్‌గా ఉన్న చోట మాత్రమే ఆడగలనని, చిన్న పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి చాలా బాగా ఆడుతున్నానని చెప్పాడు. ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తే మెరుగ్గా ఆడతారన్నారు. తాను సుదీర్ఘ కాలం సాగే భారత్ లీగ్ లో భాగస్వామిగా మారతానా? లేదా? అన్నది చెప్పలేనన్నాడు. మొత్తం సీజన్ పూర్తయిన తర్వాత పరిస్థితిని ఒకసారి సమీక్షించుకునే అవకాశం ఉంటుందన్నాడు.

సునీల్ ఛెత్రిదీ ఇదే మాట

సునీల్ ఛెత్రిదీ ఇదే మాట

ఉమ్మడిగా ఒకే ఒక లీగ్ ఆడటం అందరూ అర్థంచేసుకోవడానికి ఉపకరిస్తుందని భారత జట్టు స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి అభిప్రాయపడ్డారు. ఒకే ఒక టోర్నీ ఉండటం, అదీ సుదీర్ఘ కాలం కొనసాగించడం వల్ల ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుస్తుందని, మరింత పోటీతత్వానికి పెంపొందించుకొనేందుకు సహకరిస్తుందన్నాడు. ఐఎస్ఎల్, ఇతర లీగ్ ల నిర్వాహకులు ఎలా ముందుకు వెళతారన్నదని తనకు తెలియదని, అయితే ప్రస్తుతం ఫార్ములా రూపకల్పనలో నిమగ్నమయ్యారని తనకు తెలుసునన్నాడు.

18 నుంచి 20 జట్లకు ప్రాతినిధ్యం

18 నుంచి 20 జట్లకు ప్రాతినిధ్యం

‘ప్రతి లీగ్ లోనూ 18 నుంచి 20 జట్లకు ప్రాతినిధ్యం కల్పించడం తప్పనిసరి. దీనివల్ల ఇండియన్ ప్లేయర్లకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. మరింత నైపుణ్య భరితమైన సెటప్ ఏర్పాటవుతుంది. మనం అంతా ఎంతో ప్రేమతో ఆ ద్రుశ్యాన్ని వీక్షించాలి' అని ఛెత్రి అన్నాడు. ఐఎస్ఎల్ టోర్నీలో తొలిసారి సెమీ ఫైనల్స్ దశకు ముంబై సిటీ చేరుకోవడం తనకు సంతోషంగా ఉన్నదని సునీల్ ఛెత్రి వ్యాఖ్యానించాడు. తాను ముంబై సిటీలో చేరిన తర్వాత గతేడాది అర్హత సాధించలేదని, తాను ఐ - లీగ్‌లో చేరిన తర్వాత బెంగళూరు టీం చాలా మంచి పొజిషన్ కు చేరుకున్నదని, ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌తో ఉన్నారని చెప్పాడు.

మెరుగైన ప్రతిభతో ఫలితాలు

మెరుగైన ప్రతిభతో ఫలితాలు

తామంతా మెరుగైన ప్రతిభతో ఫలితాలు సాధించడానికే ప్రాధాన్యం ఇస్తామని తెలిపాడు. తొలి సీజన్ కు తామంతా దూరమని, రెండో సీజన్ లో మంచి టీం ఉన్నా ట్రాక్ లోకి రాలేకపోయామన్నాడు. దీనికి తన పక్కన ఫోర్లాన్ లేకపోవడం ఒక కారణమన్నాడు. ఆయన చాలా ప్రభావశీలుడైన ప్లేయర్ అని అభివర్ణించాడు. తమకు అత్యంత శక్తిమంతమైన కోచ్ ఉన్నాడని, తాము అదే దిశలో పయనిస్తున్నామన్నాడు. ఢిల్లీ డైనమోస్ జట్టుతో డిసెంబర్ మూడో తేదీన జరిగే మ్యాచ్‌లో మెరుగైన ఆటతీరు ప్రదర్శన కోసం ప్రయత్నిస్తామన్నాడు. సెమీస్ లో ఎవరు వైదొలుగుతారన్నది ఇప్పుడే చెప్పలేమన్నాడు. సెమీస్ దశకు అర్హత సాధించినందుకు సంతోషంగా ఉందన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Echoing identical views about the need for a unified football league in the country, Mumbai City FC's marquee player Diego Forlan and star Indian striker Sunil Chhetri today wanted it to be longer too for the betterment of the country's football.
Please Wait while comments are loading...