ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నిరాశ: షరపోవాకు వైల్డ్‌కార్డ్‌ నిరాకరణ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నిషేధం ముగించుకొని ఇటీవలే పునరాగమనం చేసిన రష్యా టెన్నిస్‌ స్టార్‌ మారియా షరపోవాకు ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు నిరాశ ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో షరపోవాకు 'వైల్డ్‌ కార్డు' ఇవ్వడం లేదని టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. గాయంతో ఆటకు దూరమై తిరిగొస్తే వైల్డ్‌కార్డ్ పొందొచ్చు.

కానీ, డోపింగ్ నిషేధం కారణంగా తిరిగొస్తే వైల్డ్‌కార్డ్ ఇవ్వలేం అని ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు బెర్నార్డ్ గుడిచెల్లి తెలిపారు. దీంతో గతంలో రెండుసార్లు (2012, 2014లో) ఈ టోర్నీలో విజేతగా నిలిచిన షరపోవా ఈసారి బరిలో దిగే అవకాశాన్ని కోల్పోయింది.

French Open 2017: No wildcard entry for Maria Sharapova

నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిన కేసులో షరపోవా 15 నెలల నిషేధం గడువు ముగిశాక 'వైల్డ్‌ కార్డు'ల సహాయంతో షరపోవా మూడు టోర్నీల్లో ఆడింది. అయితే ఫ్రెంచ్‌ ఓపెన్‌ అర్హత టోర్నీ ఆడడటానికి సరిపడినన్ని ర్యాంకింగ్‌ పాయింట్లు షరపోవాకు లేవు.

దీంతో ఆమెకు వైల్డ్‌కార్డు ఇస్తారనే వార్తలు వచ్చినా.. తాజాగా టోర్నీ నిర్వాహకులు ఆ ఊహాగానాలకు తెరదించారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ మే 28న ప్రారంభం కానుంది. మరోవైపు షరపోవా టాప్‌ 200లోకి రావడంతో జూలైలో జరిగే వింబుల్డన్‌ టోర్నీ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు ఆడేం దుకు అర్హత సాధించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Russian superstar Maria Sharapova will not feature at this year's French Open after the organisers decided against giving her a wildcard.
Please Wait while comments are loading...