'సంతోషంగా ఉంది, మరింత మందిని తయారు చేస్తా'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భారత షట్లర్లు రాబోయే రోజుల్లో పెద్ద విజయాలపై దృష్టి పెట్టాలని బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నాడు. మంగళవారం గోపీచంద్‌ అకాడమీలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారులకు అభినందించారు. ఈ సందర్భంగా పీవీ సింధు, సాయిప్రణీత్‌, కిదాంబి శ్రీకాంత్‌లను సన్మానించి, పతకాలు సాధించిన వారికి ఐడీబీఐ చెక్కులు అందించారు.

అనంతరం గోపీచంద్‌ మీడియాతో మాట్లాడారు. తెలుగు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ఆనందంగా ఉందని చెప్పారు. పీవీ సింధు ప్రపంచ రెండో ర్యాంకు సాధించడం సంతోషకరమని చెప్పుకొచ్చారు. బ్యాడ్మింటన్‌ నేర్చుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారని అన్నారు.

మరింత మందిని తయారు చేస్తా

మరింత మందిని తయారు చేస్తా

ఈ అకాడమీ నుంచి మరింత మంది బ్యాడ్మింటన్‌ క్రీడాకారులను తయారు చేస్తామని గోపీచంద్ తెలిపారు. ఆల్‌ ఇంగ్లాండ్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ లాంటి పెద్ద టైటిళ్ళఫై దృష్టిసారించాలని గోపీచంద్ క్రీడాకారులకు ఈ సందర్భంగా సూచించాడు.

సంతృప్తికరంగా ఉంది

సంతృప్తికరంగా ఉంది

‘ఎంతో సంతృప్తికరంగా ఉంది. మరిన్ని మెరుగైన ఘనతలు అందుకునే సత్తా మన క్రీడాకారుల్లో ఉంది. ప్రస్తుతం మనం మంచి స్థితిలో ఉన్నాం. అందరూ యువ క్రీడాకారులే. ఇంకా చాలా ఏళ్ళు బ్యాడ్మింటన్‌ ఆడతారు. భారత బ్యాడ్మింటన్‌కు ఇది శుభసూచకం' అని అన్నారు.

ఇలాంటి దేశాలు చాలా తక్కువ

ఇలాంటి దేశాలు చాలా తక్కువ

వాస్తవానికి మన దగ్గర ఉన్న నాణ్యమైన క్రీడాకారులున్నారని ఇలాంటి దేశాలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నో పతకాలు గెలిచామని. వాటన్నింటినీ ఇంకా మెరుగుపరుచుకోవాల్సి ఉందనన్నారు.

మరింత నిలకడగా ఆడాల్సి ఉంది

మరింత నిలకడగా ఆడాల్సి ఉంది

ఒలింపిక్స్‌లో స్వర్ణం, సూపర్‌ సిరీస్‌ విజయాల్లో మరింత నిలకడ సాధించొచ్చని చెప్పారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఆల్‌ ఇంగ్లాండ్‌లలో సత్తాచాటొచ్చని అన్నారు. ఆ తర్వాతి దశలో సుదిర్మన్‌ కప్‌, థామస్‌ ఉబెర్‌ కప్‌ లాంటి పెద్ద టోర్నీలు గెలవాలని క్రీడాకారులకు గోపీచంద్ సూచించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pullela Gopichand’s dreams have come to a reality finally, thanks to the Sai Praneeth-Kidambi Srikanth show in the Singapore Open Super Series final. Naturally, after Praneeth won his maiden Super Series title, the 24-year-old Mouala Ali boy was the toast of the Pullela Gopichand Badminton Academy on Tuesday.
Please Wait while comments are loading...