న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ లేపిన గుజరాత్: ముంబాపై అలవోక విజయం

By Nageshwara Rao

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌ ఐదో సీజన్‌లో అరంగేట్రం చేసిన కొత్త జట్టు గుజరాత్ ఫార్చ్యూన్‌ జెయింట్స్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. శుక్రవారం సొంతగడ్డపై జరిగిన పోరులో గుజరాత్‌ 39-21తో యూ ముంబాను చిత్తుగా ఓడించింది. ఈ విజయంలో కెప్టెన్ సుఖేష్‌ హెగ్డే, రోహిత్‌ గుల్లా, సచిన్‌లు కీలకపాత్ర పోషించారు.

జోన్‌-ఎ పోరులో గుజరాత్‌కిది రెండో విజయం కాగా పటిష్టమైన యు ముంబాకిది రెండో ఓటమి కావడం విశేషం. డిఫెన్స్‌లో ఘోరంగా విఫలమైన ముంబా ఏ దశలోనూ గుజరాత్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. ఆరంభం నుంచే గుజరాత్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. రెండో నిమిషంలోనే 2-0తో గుజరాత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Gujarat Fortunegiants humble U Mumba 39-21 in Ahmedabad opener

ఆ తర్వాత 6-0తో ఆధిక్యంలో ఉన్న దశలో రైడ్‌కు వెళ్లిన సచిన్‌ రెండు పాయింట్లు తీసుకొచ్చాడు. ఆ వెంటనే ముంబై రైడర్‌ను పట్టేసిన గుజరాత్‌ ప్రత్యర్థిని ఆరో నిమిషంలోనే ఆలౌట్‌ చేసి 9-1తో ఆధిక్యంలో నిలిచింది. ముంబా కెప్టెన్‌ అనూప్‌ కుమార్‌ వైఫల్యం కూడా ఫలితంపై ప్రభావం చూపింది.

రోహిత్‌, సచిన్‌ రైడింగ్‌లో రాణించడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి గుజరాత్‌ 20-6తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇక రెండో అర్ధభాగంలో ముంబా కూడా గట్టిగానే పోరాడినప్పటికీ, అప్పటికే తిరుగులేని ఆధిక్యం సాధించిన గుజరాత్‌ను ఓడించడం ముంబా ఆటగాళ్లకు సాధ్యం కాలేదు.

Gujarat Fortunegiants humble U Mumba 39-21 in Ahmedabad opener

రోహిత్‌ (9), సచిన్‌ (8), అబోజర్‌ మిగాని (5) గుజరాత్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. రైడ్‌ల ద్వారా 19 పాయింట్లు గెలిచిన గుజరాత్‌ 13 ట్యాకిల్‌ పాయింట్లు సొంతం చేసుకుంది. ముంబా డిఫెన్స్‌లో 5 పాయింట్లు సాధించింది. ఈ విజయంతో గుజరాత్‌ (13) జోన్‌-ఎలో పుణెరి పల్టన్‌ (11)ను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X