హాకీ వరల్డ్ లీగ్: పాక్‌పై ఘన విజయం సాధించిన భారత్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రపంచ హాకీ లీగ్‌ సెమీ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఆదివారం ఇక్కడి మిల్టన్‌ కీన్స్‌లో దాయాది పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్‌ 'బి' మ్యాచ్‌లో 7-1 స్కోరుతో అద్భుత విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి భారత్‌ తన అధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది.

13వ నిమిషంలో హర్మన్‌ ప్రీత్‌సింగ్‌ కొట్టిన గోల్‌తో ఖాతా తెరిచిన భారత్‌.. అక్కడ నుంచి వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత పదే పదే దాడులు చేస్తూ వెంటవెంటనే ఫలితాలు సాధించింది. సత్‌బీర్‌, సునీల్‌ సాయంతో తల్వీందర్‌సింగ్‌ (21, 24 ని) స్వల్ప వ్యవధిలో రెండు గోల్స్‌ కొట్టడంతో భారత ఆధిక్యం 3-0గా మారింది.

Hockey World League: India thrash Pakistan 7-1

పాక్‌ తరపున ఏకైక గోల్‌ మహ్మద్‌ ఉమర్‌ (57వ నిమిషం) సాధించాడు. రెండో క్వార్టర్‌ ఆఖర్లో హర్మన్‌ప్రీత్‌ (33వ ని) మరో గోల్‌ చేయడంతో భారత ఆధిక్యం 4-0కు పెరిగింది. మూడో క్వార్టర్‌లో పాక్‌ గోల్‌ కోసం ప్రయత్నించినా గోల్‌కీపర్‌ ఆకాశ్‌ చిట్కె అద్భుతంగా అడ్డుకున్నాడు.

ఈ విజయంతో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ స్థానం ఖరారు చేసుకుంది. భారత్‌ తొమ్మిది పాయింట్లతో గ్రూప్‌-బిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లతో బరిలో దిగడం విశేషం. సరిహద్దుల్లో తమ దేశ సైనికులపై పాక్‌ దాడులను ఖండిస్తూ భారత్‌ ఇలా నిరసన వ్యక్తం చేసింది.

మంగళవారం జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. మరోవైపు పాక్‌కు ఇది వరుసగా మూడో పరాజయం కావడం గమనార్హం. గత రెండు మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌, కెనడా చేతిలో ఓటమిపాలైంది. దాంతో ఆ జట్టు క్వార్టర్‌ ఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India and Pakistan have enjoyed contrast results and performances so far in the Hockey World League 2017 in England. On one hand India have won two in their two matches – beating Scotland 4-1 and Canada 3-0. Pakistan have had opposite results with two straight defeats.
Please Wait while comments are loading...