ఫైనల్స్‌కు అర్హత: జావెలిన్‌ త్రోలో చరిత్ర సృష్టించిన దావిందర్ సింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: లండన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన జావెలిన్‌ త్రోయర్‌ దావీందర్‌ సింగ్‌ కంగ్‌ ఫైనల్స్‌కి అర్హత సాధించి చరిత్ర సృష్టించాడు. భారత్‌కు చెందిన ఓ జావెలిన్ త్రోయర్ వరల్డ్ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి.

గురువారం జరిగిన పోటీల్లో దావీందర్‌ సింగ్‌ జావెలిన్‌ను 83 మీటర్లు విసరి ఫైనల్‌కి అర్హత సాధించాడు. తొలి ప్రయత్నంలో 82.22 మీటర్లు, రెండో ప్రయత్నంలో 82.14 మీటర్లు విసిరి విఫలమైన దావిందర్ సింగ్ మూడో ప్రయత్నంలో నిర్వహకులు నిర్దేశించిన 83 మీటర్లు దాటడంతో అతడు ఫైనల్‌కి అర్హత సాధించాడు.

 IAAF World Athletics Championships 2017: Davinder Singh Kang defies odds to create history Generate Filename

పైనల్ పోటీలు శుక్రవారం జరగనున్నాయి. గ్రూప్‌-ఏ నుంచి ఐదుగురు, గ్రూప్‌-బి నుంచి ఏడుగురు మొత్తం పన్నెండు మంది ఫైనల్‌కి అర్హత సాధించారు. మరోవైపు ఇదే ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మరో జావెలిన్ త్రోయర్ నీరజ్‌ చోప్రా ఫైనల్‌కి అర్హత సాధించలేక పోవడం విశేషం.

ఈవెంట్ అనంతరం దావీందర్ సింగ్ మీడియాతో మాట్లాడాడు. 'నేను బరిలో దిగే సమయానికి నీరజ్‌ ఫైనల్‌కి అర్హత సాధించలేదని తెలిసింది. ఎలాగైనా ఫైనల్‌కి అర్హత సాధించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. దేశానికి ఏదైనా చేయాలి. గతంలో ఏ ఇండియన్ అందుకోలేని ఘనత ఇప్పుడు నేను అందుకున్నాను. ఇదంతా దేవుడి దయ' అని అన్నాడు.

'గత 3-4 నెలలుగా పోటీల్లో పాల్గొంటూనే ఉన్నాను. శిక్షణ పొందేందుకు కూడా సమయం దొరకలేదు. త్వరలో కోచ్‌ వద్దకు వెళ్లి తనలోని బలహీనతలను అతడితో చర్చిస్తా. గతంలో జరిగిన ఛాంపియన్‌షిప్స్‌లో 82.26 మీటర్లు జావెలిన్ విసిరిన నీరజ్ చోప్రా తప్పకుండా ఫైనల్‌కు అర్హత సాధిస్తాడని భావించా' అని అన్నాడు.

'మరో రెండేళ్ల పాటు అతడు వేచి చూడాల్సిందే. గ్రూప్ బీలో ఎక్కువమంది త్రోయర్లు అర్హత మార్కుని అందుకున్నారు. నిజానికి ఈ ఏడాది మేలో ఇండియన్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ పోటీలు జరిగే సమయంలో కుడి భుజానికి గాయమైంది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. ఫైనల్‌లో మెరుగైన ప్రదర్శన చేసి దేశానికి పతకం అందిస్తాను' అని దావీందర్‌ సింగ్‌ తెలిపాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India’s campaign in the javelin was to pitch-fork it’s two throwers into the final, creating a sort of record in Indian athletics. And when Germany’s 24-year-old Johannes Vetter threw a monster of an opening effort of 91.20m, it felt that the other throwers now had a marker.
Please Wait while comments are loading...