సంచలనం: ఇండోనేసియా ఓపెన్‌ గెలిచిన కిదాంబి శ్రీకాంత్‌

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జూన్ 18 (ఆదివారం) ఫాదర్స్ డే. ఈరోజు క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్ ఇలా మూడు కీలక మ్యాచ్‌లను ఆడుతోంది. ఈ క్రమంలో మధ్యాహ్నాం 1.30కి జకార్తాలో ప్రారంభమైన ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ సిరీస్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ విజేతగా నిలిచాడు.

కెరీర్‌లో అత‌నికిది మూడో సూప‌ర్‌సిరీస్ టైటిల్‌. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ 21-19, 21-11 తేడాతో జ‌పాన్‌కు చెందిన క‌జుమాసా స‌కాయ్‌పై విజ‌యం సాధించాడు. 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో వ‌రుస గేమ్స్‌లో శ్రీకాంత్ గెలిచాడు.

India's Srikanth beats Kazumasa Sakai to win Indonesia Open

13 నిమిషాల్లోనే తొలి సెట్‌ను 21-11తో కైవసం చేసుకున్న శ్రీకాంత్‌... రెండో గేమ్‌లో గ‌ట్టి పోటీ ఎదురైంది. 19-19 వ‌ర‌కు స్కోరు స‌మంగానే ఉంది. ఓ దశలో వెనుకబడిన శ్రీకాంత్‌ ఆ తర్వాత తేరుకుని సుకాయ్‌పై విజృంభించాడు. దీంతో హోరాహోరీగా సాగిన రెండో సెట్‌లో రెండు వ‌రుస పాయింట్లు సాధించి 21-19తో గెలిచి టైటిల్ గెలిచాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kidambi Srikanth stood his ground against World No 1 Son Wan-Ho to enter the final. On Sunday he made things even better with a 21-11, 21-19 win over World No 47 Kazumasa Sakai.
Please Wait while comments are loading...