న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అత్యాచార ఆరోపణలు: చిక్కుల్లో భారత హాకీ కెప్టెన్

By Nageswara Rao

లూధియానా: భారత హకీ జట్టు కెప్టెన్ సర్ధార్ సింగ్‌ తనపై అత్యాచారయత్నం చేశాడని అతని చిరకాల స్నేహితురాలు ఆరోపించింది. సర్దార్, తాను ప్రేమించుకున్నామని, అతనికి కాబోయే భార్యనని భారత సంతతికి చెందిన బ్రిటన్ అమ్మాయి లూధియానా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇటీవల భారత్ వచ్చిన ఆమె.. సర్దార్ సింగ్ వేధిస్తున్నాడని ఈ ఫిబ్రవరి 1న లూధియానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2012లో సర్ధార్ సింగ్ తనను ప్రేమించాడని ఇంగ్లాండ్ అండర్-19 హాజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అష్పల్ భోగాల్ తన ఫిర్యాదులో పేర్కొంది.

Indian hockey captain Sardar Singh accused of sexual harassment

2012 లండన్‌లో జరిగిన ఒలింపిక్స్ సందర్భంగా సర్దార్ సింగ్, అష్పల్‌ భోగాల్‌ల మధ్య ఏర్పడ్డ పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన వీరిద్దరూ 2014లో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. తామిద్దరికీ నిశ్చితార్థం జరిగిందని, అయితే పెళ్లి చేసుకోవడానికి సర్దార్ సింగ్ నిరాకరించాడని ఆరోపించింది.

ఆ తర్వాత సర్ధార్ సింగ్ తనను మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడని తన ఫిర్యాదులో పేర్కొంది. తనపై సర్దార్ సింగ్ అత్యాచార యత్నం చేశాడని, 2015లో తనను అబార్షన్ కూడా చేయించుకోమన్నాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ ఫిర్యాదుపై లూధియానా పోలీసు కమిషనర్ పీఎస్ ఉమ్రాన్‌గల్ మాట్లాడుతూ పోలీసులు యువతి ఫిర్యాదు స్వీకరించినా, సర్దార్ సింగ్‌పై ఇంకా కేసు నమోదు చేయలేదని వెల్లడించారు. ఈ ఫిర్యాదుని పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం.

ఆమెతో నిశ్చితార్ధం జరగలేదు:

తనతో నిశ్చితార్థం జరిగి, పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడంటూ భారత సంతతికి చెందిన బ్రిటన్ అమ్మాయి చేసిన ఆరోపణలను భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ ఖండించాడు. తనకు బ్రిటన్ అమ్మాయితో నిశ్చితార్థం జరగలేదని సర్దార్ స్పష్టం చేశాడు.

'ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదును చూసిన అనంతరం స్పందిస్తా. మంగళవారం గేమ్ ఆడి వస్తున్నా. తర్వాతి జరిగే గేమ్‌పై దృష్టిసారించాలి' అని చండీగఢ్ విమానాశ్రయంలో సర్దార్ చెప్పాడు. మరోవైపు సర్దార్ తండ్రి గుర్నం సింగ్ మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడికి ఆ అమ్మాయి తెలుసునని, అయితే నిశ్చితార్థం జరగలేదని చెప్పాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:16 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X