ఇండోనేషియా ఓపెన్‌లో శ్రీకాంత్ సంచలనం: నెం.1కి షాకిచ్చి ఫైనల్లోకి ఎంట్రీ

Subscribe to Oneindia Telugu

జకర్తా: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ రికార్డు సంచలనం సృష్టించాడు. ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ సంచలన విజయం నమోదు చేశాడు.

శనివారం జరిగిన సెమీ ఫైనల్లో అద్భుత ఆటతీరుతో ఆటతీరుతో ప్రపంచ నెం1 ఛాంపియన్‌ సాన్‌వాన్‌ హొ (కొరియా)పై విజయం సాధించడం ద్వారా ఫైనల్స్‌లో చోటుదక్కించుకున్నాడు శ్రీకాంత్.

Indonesia Open: Srikanth stuns world number 1 Son Wan-Ho to enter final

సాన్‌వాన్‌ హొపై శ్రీకాంత్‌ 21-15, 14-21, 24-22 తేడాతో విజయం సాధించాడు. కాగా, శుక్రవారం చైనీస్‌ తైపీకి చెందిన వాంగ్‌ వీ జుపై నెగ్గిన శ్రీకాంత్ సెమీస్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.

సెమీస్ నుంచే ప్రణయ్ రాయ్ ఔట్

ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో భారత ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో జపాన్‌ క్రీడాకారుడు సకాయ్‌ చేతిలో ప్రణయ్‌ ఓటమి పాలయ్యాడు.

సిరీస్‌లో భాగంగా పురుషుల సింగిల్స్‌లో జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రణయ్‌... జపాన్‌ క్రీడాకారుడు సకాయ్‌తో తలపడ్డాడు. తొలి గేమ్‌ను 21-17తో గెలుచుకున్న ప్రణయ్‌కి రెండో గేమ్‌లో ఎదురుదాడి మొదలైంది.

నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ గేమ్‌ని 28-26తో సకాయ్‌ గెలుచుకున్నాడు. అనంతరం నిర్ణయాత్మక మూడో గేమ్‌ను 18-21తో గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు సకాయ్‌. దీంతో ఇండోనేసియా ఓపెన్‌లో ప్రణయ్‌ పోరు ముగిసినట్లయింది.

అంతకుముందు ప్రిక్వార్టర్‌, క్వార్టర్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ లీ చాంగ్‌ వీ(మలేసియా), ఒలింపిక్‌ పతక విజేత చెన్‌ లాంగ్‌(చైనా)పై ప్రణయ్‌ సంచలన విజయాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India's Kidambi Srikanth stunned South Korea's world number Son Wan-Ho 21-15, 14-21, 24-22 to enter the final of Indonesia Open Super Series badminton tournament in men's singles category.
Please Wait while comments are loading...