ఐపీఎల్, మ్యాచ్ 21: సన్‌రైజర్స్ జైత్రయాత్ర, ఢిల్లీపై ఘన విజయం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో మధ్యలో రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైనప్పటికీ, ఆ తర్వాత ను కొనసాగిస్తోంది. 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన డేర్ డెవిల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులుచేసి ఓటమిపాలైంది.

చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 24 పరుగులు అవసరం కాగా, సన్ రైజర్స్ బౌలర్ కౌల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 8 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. ఇక ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో సంజూ శాంసన్(42), కరుణ్ నాయర్(33), మాథ్యూస్(31) పరుగులతో రాణించారు. శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీ (31 బంతుల్లో 50 నాటౌట్) చివరివరకూ పోరాడాడు.

ఢిల్లీకి విజయ లక్ష్యం 192

హైదరాబాద్ వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీకి 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జట్టు స్కోరు 12 వద్ద 2వ ఓవర్‌లోనే కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(4) వికెట్‌ చేజార్చుకుంది.

ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన విలియమ్సన్‌, మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చక్కటి శుభారంభం అందించారు. విలియమ్సన్‌, ధావన్‌ల జోడీ నిలకడగా ఆడి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. 33 బంతుల్లో విలియమ్సన్ అర్ద సెంచరీ పూర్తి చేయగా ధావన్ 40 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు.

Kane

6 ఫోర్లు, 5 సిక్స్ లతో 89 పరుగులు చేసిన విలయమ్సన్ క్రిస్ మోరిస్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యడు. రెండో వికెట్‌కు విలియమ్సన్, ధావన్‌లు 136 పరుగుల జోడించారు. భారీ షాట్లు ఆడే క్రమంలో విలియమ్సన్‌ క్రిస్‌ మోరీస్‌ వేసిన 17వ ఓవర్‌లో వెనుదిరిగాడు.

అనంతరం స్వల్ప వ్యవధిలోనే 19వ ఓవర్‌లో శిఖర్‌ ధావన్‌ కూడా క్రిస్‌ మోరీస్‌ బౌలింగ్‌లోనే పెవిలియన్‌ చేరాడు. యువరాజ్‌సింగ్‌ (3) ఆ తర్వాతి బంతికే బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హెన్రిక్స్, సందీప్ హుడా చివరి ఓవర్లో 17 పరుగులు రాబట్టడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 191 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత స్టేడియం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

IPL 10: Match 21: Sunrisers Hyderabad win the toss and elect to bat

టాస్ అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ తమ జట్టులో రెండు మార్పులు ఉన్నాయన్నాడు. మహ్మద్ నబీ స్థానంలో కేన్స్ విలియమ్సన్, శరన్ స్థానంలో మహ్మద్ సిరాజ్ వచ్చారు. కాగా, సిరాజ్‌కు ఇది తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం.

ఇక ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ జయంత్ యాదవ్ తిరిగి జట్టులోకి వచ్చినట్టు తెలిపాడు. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ మూడు విజయాలు సాధించింది. అయితే ఈ విజయాలన్నీ సొంతగడ్డపై సాధించినవి కావడం విశేషం. ప్రస్తుతం ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్‌ మూడో స్థానంలో ఉండగా, ఢిల్లీ నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

జట్ల వివరాలు:

సన్‌రైజర్స్ హైదరాబాద్:
డేవిడ్ వార్నర్(కెప్టెన్), శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, హెన్నిక్వెస్, యువరాజ్ సింగ్, నమన్ ఓజా(వికెట్ కీపర్), దీపక్ హుడా, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్.

ఢిల్లీ డేర్‌డెవిల్స్:
సంజూ శాంసన్, శ్యామ్ బిల్లింగ్స్, కరుణ్ నాయర్, శ్రేయాస్ అయ్యార్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), మాథ్యూస్, క్రిస్ మోరిస్, జయంత్ యాదవ్, ప్యాట్ కమ్మిన్స్, అమిత్ మిశ్రా, జహీర్ కాన్(కెప్టెన్).

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sunrisers Hyderabad win the toss and elect to bat.
Please Wait while comments are loading...