న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ వీకెండ్ ఐపీఎల్ ప్యాన్ పార్కులు: మే 9న ఉదయ్‌పుర్, మే 10న బెళగావి

By Nageswara Rao

బెంగుళూరు: ఐపీఎల్ ఇండియాళ్ల సంబరం. ఈ సంబరాన్ని దేశంలోని క్రికెట్ అభిమానులకు మరింత చేరువ చేసేందుకు బీసీసీఐ ఫ్యాన్ పార్కులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వారం ఈ ఫ్యాన్ పార్కులు కర్ణాటకలోని బెళగావి, రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఏర్పాటు చేసినట్టు బీసీసీఐ తెలిపింది.

ఈ వారం కర్ణాటకలోని బెళగావిలో ఉన్న యూనియన్ జింఖానా మైదానం, రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఉన్న శిఖర్ బాది హోటల్ గ్రౌండ్‌ను ఫ్యాన్ పార్కులుగా ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. పైన పేర్కొన్న మైదానాల్లో ఉదయ్‌పుర్‌లో మే 9న, బెళగావిలో మే 10న మ్యాచ్‌లను అభిమానులు ఉచితంగా వీక్షించొచ్చు.

ఐపీఎల్ ప్యాన్ పార్కుల్లోకి ఎంట్రీ ఉచితం. ఈ ఫ్యాన్ పార్కుల్లోకి అభిమానులను 2 గంటల ముందుగా అనుమతిస్తారు.


మే 9 (శనివారం) - ఉదయ్‌పుర్ (శిఖర్‌బాది హోటల్)

Match 1 (4 PM) - KKR Vs KXIP
Match 2 (8 PM) - DD Vs SRH

IPL 2015 Fan Parks in Belagavi and Udaipur on May 9, 10

మే 10 (ఆదివారం) - బెళగావి (యూనియన్ జింఖాన్ గ్రౌండ్)

Match 1 (4 PM) - MI Vs RCB
Match 2 (8 PM) - CSK Vs RR

IPL 2015 Fan Parks in Belagavi and Udaipur on May 9, 10

పోయిన వారంలో ఈ ఫ్యాన్ పార్కులు గుజరాత్‌లోని సూరత్, తెలంగాణలోని వరంగల్‌లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్ ఫ్యాన్ పార్కులకు క్రికెట్ అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. పెప్సీ ఐపీఎల్ 2015ను దేశ వ్యాప్తంగా 12 వేదికల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

దేశంలోని 15 నగరాల్లోని పబ్లిక్ ప్లేసులో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వీక్షించేందుకు ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద పెద్ద స్క్రీన్స్‌లో అచ్చం స్టేడియం లాంటి అనుభూతినే ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఫ్యాన్ పార్కుల్లో సుమారు 10,000 మంది వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పిల్లలు, మహిళలకు ప్రత్యేకం. స్టేడియంలో మాదిరే మ్యూజిక్, పుట్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంఛైజీలే ఈ బాధ్యతను తీసుకుంటున్నాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X