ప్రపంచ షూటింగ్: బంగారు పతకాన్ని సాధించిన భారత షూటర్

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్(ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్)‌లో
భారత యువ షూటర్‌ అంకుర్‌ మిట్టల్‌ తన కెరీర్‌లో తొలి బంగారు పతకాన్ని సాధించాడు. మెక్సికోలోని అకాపుల్కోలో ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ పోటీలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన పురుషుల డబుల్‌ ట్రాప్‌ విభాగంలో అంకుర్‌ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మెక్సికోలో జరిగిన పోటీల్లో అతను మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా, విలెట్‌ రెండో స్థానంలో నిలిచి రజతాన్ని దక్కించుకున్నాడు.

ISSF World Cup: Ankur Mittal wins double trap gold in Mexico

ఫైనల్లో మొత్తం 80 పాయింట్లకుగాను అంకుర్‌ 75 పాయింట్లు సాధించాడు. అంతకు ముందు జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 150 పాయింట్లకు 138పాయింట్లతో అంకుర్‌ రెండో స్థానంలో నిలిచాడు. కాగా, న్యూఢిల్లీలో జరిగిన గత ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లోనూ వెండి పతకాన్ని సాధించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Marksman Ankur Mittal has delivered India's nine-member contingent its first medal at the International Shooting Sport Federation World Cup (Shot Gun) in Acapulco, Mexico by shooting gold in the men's double trap on Wednesday.
Please Wait while comments are loading...