బోణీ కొట్టిన జైపూర్: ఉత్కంఠ మ్యాచ్‌లో పుణెరిపై విజయం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రొ కబడ్డీ ఐదోసీజన్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. గురువారం మన్‌కాపూర్ ఇండోర్ స్టేడియంలో పుణెరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో 30-28 పాయింట్లతో నెగ్గింది. దీంతో ఈ సీజన్‌లో రెండో మ్యాచ్ ఆడిన జైపూర్ తొలి విజయంతో లీగ్‌లో బోణీ కొట్టింది.

మంజీత్‌ చిల్లార్‌ (9), జస్వీర్‌ (5) జట్టు పుణెరి పల్టన్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆరంభం నుంచే మ్యాచ్ హోరాహోరీగా సాగింది. మొదటి నిమిషంలో ఇరు జట్లు ఖాతా తెరిచాయి. తుషార్ పాటిల్ జైపూర్ జట్టుకు పాయింట్ అందించగా.. పల్టన్ జట్టుకు దీపక్ హుడా తొలి పాయింట్ అందించాడు.

Jaipur Pink Panthers hold off Puneri Paltan for first win of the season

మూడో నిమిషంలో ట్యాకిల్ పాయింట్ సాధించిన పల్టన్ జట్టు 3-1తో ఆధిక్యం సంపాదించింది. అదే ఊపుతో ఐదో నిమిషంలో 5-2తో మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకున్నట్లుగా కనిపించింది. ఈ సమయంలో జైపూర్ జట్టు దూకుడుని ప్రదర్శించింది. ఈ దశలో అంఫైర్ రోహిత్ కుమార్‌కు గ్రీన్‌కార్డ్ చూపడంతో జైపూర్ జట్టు తొలుత 6-6తో స్కోరు సమం చేసింది.

ఇలా తొలి అర్ధభాగం ముగిసే సరికి జైపూర్ పింక్ పాంథర్స్ 14-11తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగం ప్రారంభంలోనే పల్టన్ జట్టును ఆలౌట్ చేసిన జైపూర్ జట్టు 17-11తో పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. డిఫెన్స్‌లో మంజీత్‌ వరుసపెట్టి పాయింట్లు సాధించడంతో జైపూర్ జట్టు ఆధిక్యాన్ని 20-13కు చేర్చింది.

మ్యాచ్‌ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా జైపుర్‌ 29-19తో పుణెరిపై పది పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. ఈ స్థితిలో సందీప్‌ నర్వాల్‌ (9), రోహిత్‌ కుమార్‌ (4) రెయిడ్‌ పాయింట్లతో ఆధిక్యాన్ని 18-23కి తగ్గించాడు. కానీ మంజీత్ చిల్లార్ ఇటు రైడింగ్‌లోనూ అటు ట్యాకిలింగ్‌లోనూ రాణించి 30-28 పాయింట్లతో జట్టుకు విజయాన్నందించాడు.

Jaipur Pink Panthers hold off Puneri Paltan for first win of the season

పల్టన్ జట్టులో స్టార్ రైడర్ సందీప్ నర్వాల్ 9, రోహిత్ కుమార్ 4, రవికుమార్ 3 పాయింట్లు సాధించారు. రైడింగ్‌లో పుణెరి పల్టన్ 18 పాయింట్లతో ఆధిక్యం చాటగా.. 8 ట్యాకిల్ పాయింట్లు, 2 ఎక్స్‌ట్రా పాయింట్లు సాధించింది. జైపూర్ జట్టు రైడింగ్‌లో 12, ట్యాకిల్‌లో 12, 2 ఆలౌట్ పాయింట్లు, 4 ఎక్స్‌ట్రా పాయింట్లు సాధించింది.

ఇక తాజా విజయంలో జోన్‌-ఏలో 11 పాయింట్లతో పుణెరి పల్టన్ అగ్రస్ధానంలో కొనసాగుతుండగా, జోన్‌-బిలో 20 పాయింట్లతో బెంగళూరు అగ్రస్థానంలో కొనసాగుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
They took a stranglehold on their match against Puneri Paltan, unbeaten till then this season, and never let go. It was their first win of the season and the score was 28-30.
Please Wait while comments are loading...