హర్డిల్స్‌లో అమెరికాకు తొలిసారి షాక్: జమైకాకు తొలి స్వర్ణం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జమైకా పరుగుల చిరుతలు ఉసేన్ బోల్ట్, ఎలానీ థాంప్సన్‌లు నిరాశపరిస్తే, ఆ దేశానికి చెందిన మరో అథ్లెట్ స్వర్ణం పతకం గెలిచాడు. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో ఒమర్ మెక్‌లాడ్ ఛాంపియన్‌గా నిలిచి జమైకాకు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు.

100 మీటర్ల రేస్‌లో బోల్ట్‌, థామ్సన్‌ సాధించలేక పోయిన పసిడి పతకాన్ని 23 ఏళ్ల ఒమర్‌ సొంతం చేసుకున్నాడు. ఒమర్‌ మెక్‌లాడ్ 13.04 సెకన్ల టైమింగ్‌తో విజేతగా నిలవగా వరల్డ్‌ రికార్డు హోల్డర్‌, అమెరికా స్ర్పింటర్‌ అరీస్‌ మెరిట్‌ ఐదో స్థానంలో నిలిచారు. రేసు అనంతరం తన పతకాన్ని బోల్ట్‌కు అంకితమిస్తున్నట్టు మెక్‌లాడ్‌ చెప్పాడు.

Jamaica overcomes the hurdles, finally gets its gold

వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌ ఆరంభమైన తర్వాత అమెరికా హర్డిల్స్‌లో పతకాన్ని సాధించలేకపోవడం ఇదే తొలిసారి. రష్యా అథ్లెట్‌ సెర్జీ షుబెంకోవ్‌ 13.14 సెకన్ల టైమింగ్‌తో రజతాన్ని సొంతం చేసుకున్నాడు. చివర్లో మెక్‌లాడ్‌ మరింత వేగం పుంజుకోవడంతో డిఫెండింగ్‌ ఛాంపియన్ షుబెంకోవ్‌ కేవలం 0.1 సెకను తేడాతో రెండో స్థానంలో నిలిచాడు.

World Athletics Championships 2017 :Usain Bolt Final Race

హంగేరి స్ర్పింటర్‌ బలాజస్‌ బాజి (13.28 సె) కాంస్యం సొంతం చేసుకున్నాడు. మహిళల 1500 మీ రేస్‌లో కెన్యా అథ్లెట్‌ కిప్యెగన్‌ పసిడి నెగ్గింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The tune blaring across the stadium sound system was unmistakable: "Jamming" by Bob Marley. The flag the winner paraded around the track was familiar, too: The black, green and gold cross of Jamaica.
Please Wait while comments are loading...