వింబుల్డన్‌లో సరదా సంఘటన: కోర్టులోనే అభిమానికి స్క‌ర్ట్ తొడిగింది

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: లండన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో స‌ర‌దా సంఘ‌ట‌న చేసుకుంది. టోర్నీలో భాగంగా ఇన్విటేష‌న‌ల్ డ‌బుల్స్ మ్యాచ్‌లో జరుగుతున్న సమయంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మాజీ ఛాంపియ‌న్ కిమ్ క్లిస్ట‌ర్స్ ఉమెన్స్ డ‌బుల్స్ మ్యాచ్ ఆడుతోంది. ఓ పాయింట్ కొట్టే స‌మ‌యంలో ఆమె ఇది ఎక్క‌డ కొట్టాల‌ని ఫ్యాన్స్‌ను అడిగింది.

అప్పుడు స్టాండ్స్‌లో ఉన్న ఓ ప్రేక్ష‌కుడు బాడీ మీద అంటూ అరిచాడు. దీంతో అలా అరిచిన వ్య‌క్తిని మ్యాచ్ ఆడాలంటూ గ్రౌండ్‌లోకి పిలిచింది క్లిస్ట‌ర్స్‌. అయితే అత‌ను సిగ్గు ప‌డ‌కుండానే మ్యాచ్ ఆడేందుకు కోర్టులోకి దిగాడు. కానీ వింబుల్డ‌న్ రూల్స్ ప్రకారం కోర్టులో ఆడాలంటే క‌చ్చితంగా తెల్ల దుస్తులు వేసుకోవాల్సిందే.

ఇది దృష్టిలో పెట్టుకున్న క్లిస్ట‌ర్స్ వెంట‌నే త‌న బ్యాగ్‌లో ఉన్న ఓ వైట్ స్క‌ర్ట్‌ను తీసి అత‌నికి తొడిగింది. ఈ సమయంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు పగలబడి నవ్వారు. దీనిని చూసిన క్లిస్ట‌ర్స్ నువ్వుకుంటూ కోర్టులోనే కింద‌ ప‌డిపోయింది. స్క‌ర్టే కాదు టాప్ కూడా వేసుకున్న ఆ అభిమాని ఓ పాయింట్ కూడా ఆడాడు.

దీనిని స్టేడియంలో ఉన్న ప్రేక్ష‌కులంతా చ‌ప్ప‌ట్ల‌తో ఎంజాయ్ చేశారు. గ‌తంలో ఛాంపియ‌న్లుగా నిలిచిన మాజీ పేయ‌ర్ల‌తో వింబుల్డ‌న్‌లో ఇన్విటేష‌న‌ల్ టోర్నీ నిర్వ‌హిస్తారు. ఈ టోర్నీలోనే ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There was a slightly odd moment in the ladies’ invitational doubles competition at Wimbledon as tennis legend Kim Clijsters got a random man in the crowd down from the stands, put him in her white skirt and made him play a point.
Please Wait while comments are loading...