న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో ఫామ్ లేమి: కారణం అదేనంటున్న ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్

By Nageswara Rao

అహ్మాదాబాద్: ఐపీఎల్ 7లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఫైనల్స్ వరకు వెళ్లడంతో కీలక పాత్ర పోషించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ ఐపీఎల్‌లో పెద్దగా రాణించడం లేదు. అందుకు కారణం ఇటీవల ఆస్టేలియాలో జరిగిన వరల్డ్‌కప్‌లో ఆస్టేలియా వరల్డ్ కప్ విజయం యొక్క భావోద్వేగం ఇంకా అలానే ఉండటమేనని చెప్పాడు.

గత నెలలో మైఖెల్ క్లార్క్ కెప్టెన్సీలో వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్న జట్టులో గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా సభ్యుడు. వరల్డ్ కప్ అనంతరం ప్రారంభమైన ఐపీఎల్ టోర్నమెంట్లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 7, 6, 15, 33 పరుగులు మాత్రమే చేశాడు.

ఐపీఎల్‌లో తన ఫామ్ కొల్పోడవంపై గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ వరల్డ్ కప్ టోర్నమెంట్ ముగిసిన తర్వాత వెంటనే ఆడుతున్న టోర్నమెంట్ కావడంతో కొంత దాని ప్రభావం ఉంటుందని అన్నారు. వరల్డ్ కప్‌ను గెలవడం ఎంతో సంతోషకరమైన విషయం, ఆ అనుభూతితో మరో టోర్నమెంట్‌కు సిద్ధమవడం కాస్త ఇబ్బందితో కూడుకున్నదని తెలిపాడు.

KXIP's Glenn Maxwell reveals reasons for his IPL form slump

గత ఏడాది జరిగిన ఐపీఎల్ టోర్నమెంట్‌లో తొలి మూడు ఇన్నింగ్స్‌లో 95, 89, 95 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా తన బ్యాట్‌తో అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకు మరికొంత సమయం పడుతుందేమోనని అన్నాడు.

ఈ ఐపీఎల్‌లో పంజాబ్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించి, మూడింటిలో పరాజయం పాలైంది. గత ఏడాది సరైన టీమ ప్రణాళికలతో ముందు సాగామని చెప్పిన ఈ ఆల్ రౌండర్ రాబోయే మ్యాచ్‌ల్లో సరైన ప్రణాళికలను రచించి అభిమానులను తన బ్యాట్‌తో అలరిస్తానని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఈరోజు రాజస్ధాన్ రాయల్స్‌తో అహ్మాదాబాద్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. టోర్నీలో ఇప్పటికే ఐదు విజయాలతో రాజస్ధాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X