మకావు ఓపెన్: రెండో రౌండ్‌లోకి కశ్యప్, సమీర్ ఓటమి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్, కామన్వెల్త్‌ క్రీడల ఛాంపియన్‌ పారుపల్లి కశ్యప్‌ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. గాయాల నుంచి కోలుకుని సుదీర్ఘ విరామం తర్వాత ఫిటెనెస్ సాధించిన కశ్యప్ బుధవారం జరిగిన గేమ్‌లో చైనీస్‌ తైపీ క్రీడాకారుడు చన్‌ వీ చెన్‌ను 21-19, 21-8తో విజయం సాధించాడు.

Macau Open: Parupalli Kashyap advances, Sameer Verma bows out

33 నిమిషాల పాటు సాగిన హోరాహోరా పోరులో చన్‌ వీ చెన్‌‌పై కశ్యప్ విజయం సాధించి ప్రిక్వార్టర్‌‌లో ప్రవేశించాడు. ప్రిక్వార్టర్‌లో లిన్‌ యు సీన్‌ (తైపీ)తో తలపడనున్నాడు. వేరే గేమ్‌లో హాంకాంగ్‌ సూపర్‌ సిరీస్‌ రన్నరప్‌ సమీర్‌ వర్మ ఓటమి పాలయ్యాడు.

35 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన గేమ్‌లో మహ్మద్‌ బయు పింగిస్తు (ఇండోనేసియా) చేతిలో సమీర్ వర్మ 18-21, 13-21తో ఓటమి పాలయ్యాడు. ఇక పురుషుల డబుల్స విభాగంలో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన మను అత్రి, సుమీత్‌ రెడ్డి జోడీ 21-11, 17-21, 21-9తో చన్‌ అలన్‌ యున్‌ లంగ్‌, లి కుయెన్‌ హాన్‌ (హాంకాంగ్‌)ల జోడిని ఓడించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian shuttler Parupalli Kashyap advanced to the second round of the $120,000 Macau Open Grand Prix Gold badminton tournament here on Wednesday, November 30.
Please Wait while comments are loading...