న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రింగ్‌లో టెన్నిస్ అందం: బాక్సింగ్‌పై దృష్టి పెట్టిన షరపోవా

2020 ఒలింపిక్స్ గురించి తన వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవని తేల్చి చెప్పింది. ప్రస్తుతం టెన్నిస్‌లో పునరాగమనం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నానని చెప్పింది.

By Nageshwara Rao

హైదరాబాద్: 2020 టోక్యో ఒలింపిక్స్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం కరెక్ట్ కాదని రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా అంటోంది. రష్యన్ టెన్నిస్ ఫెడరేషన్ (ఆర్టీఎఫ్) అధ్యక్షుడు షమీల్ తర్పీస్చెవ్ మాట్లాడుతూ 2020 ఒలింపిక్స్‌లో షరపోవా పతకం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యంలో షరపోవా పైవిధంగా స్పందించింది.

అంతేకాదు, తనపై విధించిన నిషేధిత కాలాన్ని షరపోవా చక్కగా సద్వినియోగం చేసుకుంటుంది. బుధవారం మీడియాతో షరపోవా మాట్లాడుతూ 2020 ఒలింపిక్స్ గురించి తన వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవని తేల్చి చెప్పింది. ప్రస్తుతం టెన్నిస్‌లో పునరాగమనం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నానని చెప్పింది.

ఫిట్‌నెస్‌పై దృష్టిసారించా

ఫిట్‌నెస్‌పై దృష్టిసారించా

ఇందులో భాగంగా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించానని పేర్కొంది. 'ఫిట్‌నెస్ సహకరిస్తే 2020 ఒలింపిక్స్‌లో తప్పక ఆడతా. నన్ను నేను ఫిట్‌గా ఉంచుకోవడానికి బాక్సింగ్‌ సాధన చేస్తున్నా. ఎవరిపై పైచేయి సాధించాలనుకుంటున్నానో వారిని వూహించుకుంటూ ప్రాక్టీస్‌ చేస్తున్నా' అని షరపోవా చెప్పింది.

లండన్‌ మొత్తం చుట్టొచ్చా

లండన్‌ మొత్తం చుట్టొచ్చా

ఖాళీ సమయంలో పుస్తకాలు చదివానని, క్రొయేషియాలో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొన్నానని షరపోవా తెలిపింది. వింబుల్డన్‌లో ఆడేటప్పుడు లండన్‌ చూడకపోవడంతో ఒక పర్యాటకురాలిగా లండన్‌ మొత్తం చుట్టొచ్చానని పేర్కొంది. ప్రస్తుతం హార్వర్డ్‌లో చదువుతున్న షరపోవా ఓ పుస్తకం రాస్తూనే, ఫిట్‌నెస్ పెంచుకునేందుకు బాక్సింగ్‌ నేర్చుకొంటోంది.

సెప్టెంబర్‌లో పుస్తకం విడుదల

సెప్టెంబర్‌లో పుస్తకం విడుదల

ప్రస్తుతం తాను రాస్తున్న పుస్తకం సెప్టెంబర్‌లో విడుదలవుతుందని తెలిపింది. తొలుత ఇంగ్లిష్‌లో ఆ తర్వాత రష్యన్‌ భాషలోకి అనువాదం అవుతుందని షరపోవా పేర్కొంది. కాగా, 2016 ఆస్ట్రేలియా ఓపెన్‌ సందర్భంగా మెల్డోనియం ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో షరపోవాపై రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

స్టట్‌గర్ట్‌ క్లేకోర్టు టోర్నీలో తిరిగి అరంగేట్రం

స్టట్‌గర్ట్‌ క్లేకోర్టు టోర్నీలో తిరిగి అరంగేట్రం

అయితే కొన్ని కారణాల వల్ల నిషేధాన్ని 15 నెలలకు తగ్గించడంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 26 నుంచి జరిగే స్టట్‌గర్ట్‌ క్లేకోర్టు టోర్నీ ద్వారా ఆమె తిరిగి అరంగేట్రం చేయబోతోంది. ప్రపంచ టెన్నిస్‌కు వన్నె తెచ్చిన క్రీడాకారిణిలలో షరపోవా ఒకరు. రష్యాకు చెందిన ఈ భామ తన కెరీర్‌లో ఐదు గ్లాండ్ స్లామ్‌లను సొంతం చేసుకుంది.

2012 లండన్ ఒలింపిక్స్‌లో సిల్వర్ పతకం

2012 లండన్ ఒలింపిక్స్‌లో సిల్వర్ పతకం

2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012లో ఫ్రెంచ్ ఓపెన్, 2004, 2014లలో వింబుల్డన్, 2006లో యుఎస్ ఓపెన్‌లను గెలుచుకుంది. 2008ల ఫెడరేషన్ కప్ ఛాంపియన్‌గా నిలిచిన షరపోవా 2012 లండన్ ఒలింపిక్స్‌లో సిల్వర్ పతకాన్ని సాధించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X