సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొట్టలేదు, కోటి ప్రోత్సహకంగా ఇచ్చారు: సానియా

Posted By:
Subscribe to Oneindia Telugu
హైదరాబాద్: తాను సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా ఎగవేశానంటూ తనపై వచ్చిన ఆరోపణలపై టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఖండించారు. సర్వీసు ట్యాక్స్ సక్రమంగా చెల్లించనందుకు విచారణ కోసం సానియా లేదా ఆమె చార్టెడ్ అకౌంటెండ్ కాని తమ ముందు హాజరుకావాలని సర్వీసు ట్యాక్స్ శాఖ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సానియా మీర్జా తన చార్టర్డ్ అకౌంటెంటు ద్వారా సమాధానం ఇచ్చారు. తాను సర్వీస్ ట్యాక్స్‌ను ఎగొట్టలేదని సానియా మిర్జా స్పష్టంచేశారు. తాను సక్రమంగానే ట్యాక్స్‌ని చెల్లించినట్టు సానియా పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తనకు ఇచ్చిన కోటి రూపాయలు ట్రైనింగ్ ప్రోత్సహకం కింద ఇచ్చినట్టు ఆమె లేఖలో పేర్కొన్నారు.

ట్రైనింగ్ ప్రోత్సహకంగానే కోటి రూపాయలు

ట్రైనింగ్ ప్రోత్సహకంగానే కోటి రూపాయలు

దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సానియా అధికారులకు సమర్పించినట్టు ఆమె తరుపున చార్టర్డ్ అకౌంటెంటు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వమిచ్చిన కోటి రూపాయల ట్రైనింగ్ ప్రోత్సహకంగానే సానియా మిర్జా అందుకున్నారని, రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా తాను అవి తీసుకోలేదని ఆయన తెలిపారు.

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా


2014 జూలైలో తెలంగాణ ప్రభుత్వం సానియా మిర్జాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి కోటి రూపాయలను అందించిన సంగతి తెలిసిందే. ఈ తరహాలో నగదు తీసుకుంటూ చేస్తున్న సేవ వాణిజ్య వ్యవహారం కిందికే వస్తుందని సర్వీస్‌ ట్యాక్స్‌ అధికారులు గుర్తించారు.

అధికారులు

అధికారులు


దీంతో ఆ పారితోషికం మొత్తంపై సర్వీస్ ట్యాక్స్ కింద 14.5 శాతం డబ్బు చెల్లించాలని నోటీసులో పేర్కొంది. ఈ మేరకు ఆమెకు మంగళవారం సమన్లు జారీ చేసిన అధికారులు ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సానియా మిర్జా తరుపున ఆమె ప్రతినిధి సమర్పించిన డాక్యుమెంట్లపై సర్వీసు ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు పరిశీలిస్తున్నారు.

ఖతార్‌ ఓపెన్‌‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన సానియా

ఖతార్‌ ఓపెన్‌‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన సానియా


ఇదిలా ఉంటే ఖతార్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో సానియా మీర్జా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సానియా-స్ట్రైకోవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీ 6-4, 6-3తో డబ్రౌస్కి (కెనడా)-జురాక్‌ (క్రొయేషియా) జంటను ఓడించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tennis star Sania Mirza, who was summoned in connection with an alleged case of non-payment of Service Tax, has denied any tax evasion. In response to the summons issued to the tennis star on February 6, her Chartered Accountant appeared on her behalf before the Service Tax authorities on Wednesday, as she has gone abroad.
Please Wait while comments are loading...