పుట్టినరోజు నాడు అమర జవాన్ల కుటుంబాలకు సైనా ఆర్ధిక సాయం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తన ఔదార్యాన్ని చాటుకుంది. ఇటీవల చత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లతో ఎన్‌కౌంటర్‌లో అమరులైన 12 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు రూ.6 లక్షల ఆర్థిక సాయాన్ని అందించింది. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించింది.

ఈ సందర్భంగా సైనా మీడియాతో మాట్లాడింది. గతవారం జరిగిన మావోయిస్టుల దాడిలో జవాన్లు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచి వేసిందని, తీవ్రమైన మనోవేదనతో బాధపడుతున్న జవాన్ల కుటుంబాలకు తన వంతుగా ఆర్థికసాయం అందించానని పేర్కొంది.

On her birthday, Saina Nehwal donates Rs 6 lakh to families of CRPF jawans killed in Sukma encounter

'తమ ప్రాణాలు పణంగా పెట్టి మనల్ని కాపాడే జవాన్లు దుర్మరణం పాలు కావడంతో మనసంతా బాధతో నిండిపోయింది. వారి ప్రాణాలను వెనక్కి తీసుకురాలేం. వారి కుటుంబానికి నా వంతుగా చిన్న సాయం చేయాలని నిర్ణయించున్నా. 12 మంది జవాన్ల కుటుంబానికి రూ.6 లక్షలు ఇస్తున్నాను' అని సైనా పేర్కొంది.

శుక్రవారం సైనా తన 27వ పుట్టినరోజుని జరుపుకుంది. సైనా పుట్టినరోజు సందర్భంగా పలువురు క్రీడాకారులు, ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ అక్షయ్‌ కుమార్ కూడా 12 మంది జవాన్ల కుటుంబాలకు రూ.1.08 కోట్లు విరాళంగా అందజేసిన సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
London Olympics bronze medallist Saina Nehwal has decided to donate Rs six lakhs Rs 50,000 each to the families of the 12 Central Reserve Police Force jawans killed in an encounter in Chhattisgarh last week.
Please Wait while comments are loading...