న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పరువు తీశావు: షహర్యార్ భారత పర్యటనపై పాక్

కరాచీ: భారత్‌కు ఎవరి అనుమతి తీసుకొని వెళ్లారంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పిసిబి) చైర్మన్ షహర్యార్ ఖాన్‌పై పాక్ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌తో చర్చలు జరిపేందుకు వెళ్లడం, అక్కడ ఎదురైన చేదు అనుభవాలు, రిక్త హస్తాలతో స్వదేశానికి తిరిగి రావడంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఘాటైన పదజాలంతో రాసిన లేఖ షహర్యార్‌కు అందింది.

ఈ మేరకు వివరణ ఇవ్వాల్సిందిగా షహర్యార్‌ను ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి మియా రియాజ్ పిర్జాదా ఆదేశించాడు. పాక్ పరువు తీశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డిసెంబర్ మాసంలో ఇరు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌పై మనోహర్‌తో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేందుకు షహర్యార్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, మనోహర్‌తో సమావేశానికి కొన్ని గంటల ముందు శివసేన కార్యకర్తలు బిసిసిఐ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు.

షహర్యార్‌తో సమావేశాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా మనోహర్‌ను డిమాండ్ చేశారు. సరిహద్దులో కాల్పులకు తెగబడుతూ, భారత్‌లో అరాచకాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న పాక్‌తో క్రికెట్ సంబంధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో షహర్యార్‌తో మనోహర్ సమావేశం రద్దయింది.

PCB chairman Shaharyar Khan gets strong letter from government on India visit

అనంతరం న్యూఢిల్లీ వెళ్లిన షహర్యార్ అక్కడ కేంద్ర మంత్రులను కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చైర్మన్ రాజీవ్ శుక్లాతో సమావేశమై, భారత్ పర్యటనను అతను ముగించాడు. ద్వైపాక్షిక సిరీస్‌పై బిసిసిఐ నుంచి హామీని పొందే విషయం ఎలావున్నా, కనీసం బోర్డు అధికారులతో సమావేశమయ్యే అవకాశం కూడా రాకపోవడంతో పాక్ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

షహర్యార్ భారత్‌కు వెళ్లి పరువు తీశాడంటూ పిర్జాదా తన లేఖలో ధ్వజమెత్తాడు. భారత్‌కు వెళ్లే ముందు విదేశాంగ శాఖ నుంచిగానీ, పిసిబికి చీఫ్ ప్యాట్రన్‌గా వ్యవహరించే ప్రధాని నుంచిగానీ ముందస్తు అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించాడు.

అన్ని వివరాలతో వివరణ ఇవ్వాలని ఆదేశించాడు. గతంలో భారత్‌కు పాకిస్తాన్ రాయబారిగానేగాక, వివిధ హోదాల్లో పని చేసిన షహర్యార్‌కు ఇరు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణం గురించి తెలియదా? అని ఆ లేఖలో నిలదీశాడు.

ఎవరి అనుమతి తీసుకోకుండా భారత్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించాడు. కాగా, బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఆహ్వానం మేరకే తాను భారత్ వెళ్లినట్టు షహర్యార్ పేర్కొన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని అతను వివరణలో చెప్పే అవకాశం ఉంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X