ప్రో కబడ్డీ: తలైవాస్‌కు తొలి విజయం, రోహిత్ ఒంటి పోరాటం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. గురువారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ ఘన విజయం సాధించింది. జోన్‌-బిలో అగ్రస్థానంలో కొనసాగుతున్న బెంగళూరు బుల్స్‌ను 29-24 తేడాతో ఓడించింది.

మ్యాచ్ ప్రారంభమైన మొదటి పది నిమిషాలు నువ్వానేనా అన్నట్టుగా సాగింది. ఒక దశలో 6-6తో రెండు జట్లు సమంగా నిలిచాయి. అయితే తొలి అర్ధభాగం ముగిసే సరికి 12-8తో తమిళ్ తలైవాస్ ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో అర్ధభాగంలో కూడా మరింత పట్టుదలగా ఆడింది.

Pro Kabaddi 2017: Rohit Kumar shines but Bengaluru Bulls fail to get past Tamil Thalaivas

రెండో అర్ధభాగంలో కూడా 18-10తో ఆధిక్యం నిలిచింది. ఆ ఆధిక్యాన్ని అలానే కొనసాగింది. చివర్లో బెంగళూరు కెప్టెన్ రోహిత్ కుమార్ 11 పాయింట్లతో చెలరేగాడు. దీంతో 24-26తో పుంజుకునే ప్రయత్నం చేసినా బెంగళూరుకు ఓటమి తప్పలేదు. రైడ్‌ల ద్వారా తమిళ్ తలైవాస్ 16 పాయింట్లు సాధించగా.. బెంగళూరు 15 పాయింట్లు గెలిచింది.

అయితే ఢిఫెన్స్‌లో పూర్తిగా విఫలమైంది. బెంగళూరు డిఫెండర్లు కేవలం 5 పాయింట్ల మాత్రమే గెలిచారు. తలైవాస్‌ 10 ట్యాకిల్‌, 2 ఆలౌట్‌, 1 అదనపు పాయింట్లు సాధించగా... బెంగళూరు 6 ట్యాకిల్‌, 2 ఆలౌట్‌, 1 అదనపు పాయింట్లు సాధించింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ రోహిత్ కుమార్ (12) టాప్‌ స్కోరర్‌‌గా నిలిచాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rohit Kumar scored 12 points on Friday against Tamil Thalaivas, 11 of which came from raids. Each of these were a sight to see. As has been the case every time Bengaluru Bulls took the mat at Nagpur, Rohit Kumar was pushing his team forward, scoring some extraordinary raid points. Even then, he went to collect his awards and trophies without a smile on his face.
Please Wait while comments are loading...