ప్రో కబడ్డీ: బెంగాల్ వరుస విజయాలకు బ్రేక్ వేసిన బెంగళూరు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌పై బెంగళూరు బుల్స్‌ విజయం సాధించింది. బుధవారం జరిగిన జోన్‌ 'బి' మ్యాచ్‌లో బెంగళూరు 31-25తో వారియర్స్‌పై గెలిచింది. ఈ లీగ్‌లో బుల్స్‌కు ఇది మూడో విజయం కాగా బెంగాల్‌కు తొలి ఓటమి.

బెంగళూరు రైడర్ ఈ మ్యాచ్‌లో అజయ్‌ కుమార్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. 19 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అజయ్‌ 8 పాయింట్లు తెచ్చాడు. తోలి అర్ధభాగంలో 12-10తో స్వల్ప ఆధిక్యం సాధించిన బెంగాల్ వారియర్స్‌ రెండో అర్ధంలో స్పష్టమైన పైచేయి సాధించింది. రెండో అర్ధభాగంలో రెండు జట్లు దూకుడుగా ఆడాయి.

16-16తో స్కోరు సమమైన దశలో బెంగళూరు దూకుడుగా ఆడి 24-18తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. డిఫెండర్‌ ఆశిష్‌ కుమార్‌ (5) టాకిల్‌లో అదరగొట్టాడు. టాకిల్‌ చేసిన ఐదు సార్లు పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో రోహిత్‌ కుమార్‌ 6, రవీందర్‌ పాహల్, మహేందర్‌ సింగ్‌ చెరో 2 పాయింట్లు సాధించారు.

Pro Kabaddi League 2017: Ajay Kumar, Rohit Kumar shine as Bengaluru Bulls ease past Bengal Warriors

రైడ్‌ పాయింట్లలో బెంగాల్‌ 15-14తో ఆధిక్యం సాధించినప్పటికీ... ట్యాకిల్‌లో బెంగళూరు 12-8తో పైచేయి సాధించింది. అంతేకాదు బెంగళూరు అదనంగా మరో 3 పాయింట్లు కూడా లభించాయి. అజయ్‌ కుమార్‌ 8 రైడ్‌ పాయింట్లతో, ఆశిష్‌ కుమార్‌ 5 ట్యాకిల్‌ పాయింట్లతో బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇక బెంగాల్‌ వారియర్స్‌ జట్టులో జాంగ్‌ కున్‌ లీ 15 సార్లు రైడింగ్‌కు వెళ్లి 8 పాయింట్లు సాధించగా... టాకిల్‌లో సుర్జీత్‌ సింగ్‌ (4) ఆకట్టుకున్నాడు. ఇరు జట్లు ఒక్కోసారి ఆలౌటయ్యాయి. ఇక గురువారం పుణేరి పల్టన్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్, బెంగళూరు బుల్స్‌తో తమిళ్‌ తలైవాస్‌ తలపడతాయి. ఈ మ్యాచ్‌లను 'స్టార్‌ స్పోర్ట్స్‌-2' చానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bengaluru Bulls defeated Bengal Warriors 31-25 in a pulsating encounter of the Vivo Pro Kabaddi League Season 5 on Wednesday. It was Ajay Kumar and Rohit Kumar, who scored nine and six points respectively to lead the Bulls to a superb victory.
Please Wait while comments are loading...