గ్యాటోరేడ్‌ డ్రింక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పీవీ సింధు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రఖ్యాత స్పోర్ట్స్‌ డ్రింక్‌ 'గ్యాటోరేడ్‌'కు భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. ఈ మేరకు పెప్సికో సంస్థ పీవీ సింధుతో ఒప్పందం కుదుర్చుకుంది. గ్యాటోరేడ్‌ అనే శీతలపానియాన్ని పెప్సికో సంస్థ ఉత్పత్తి చేస్తుంది.

తొలి భారత క్రీడాకారిణిగా సింధు

తొలి భారత క్రీడాకారిణిగా సింధు

తద్వారా గ్యాటోరెడ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేయనున్న తొలి భారత క్రీడాకారిణి సింధునే కావడం విశేషం. #SweatMore క్యాంపెయిన్‌తో పీవీ సింధుపై చిత్రీకరించిన డిజిటల్‌ ఫిల్మ్‌తో తమ బ్రాండ్‌ ప్రచార కార్యక్రమాల వేగం పెంచుతామని గ్యాటోరెడ్‌ ఇండియా సోమవారం ప్రకటించింది.

సింధుతో కలసి పని చేసే ఉద్దేశంతో

సింధుతో కలసి పని చేసే ఉద్దేశంతో

ట్రైనింగ్, మ్యాచ్‌ల సమయంలో క్రీడాకారుల న్యూట్రిషన్‌ గురించి అవగాహన పెంచుకునేందుకు గ్యాటోరెడ్‌ స్పోర్స్ట్‌ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో సింధుతో కలసి పని చేసే ఉద్దేశంతో ఉన్నామని తెలిపింది. గత 50 ఏళ్లుగా అథ్లెట్ల హైడ్రేషన్, న్యూట్రిషన్‌ల విషయంలో ప్రదర్శన మెరుగయ్యేందుకు గ్యాటోరెడ్‌ స్టడీ చేస్తోంది.

సింధును సాదారంగా ఆహ్వానిస్తున్నాం

సింధును సాదారంగా ఆహ్వానిస్తున్నాం

పెప్సికో కుటుంబంలోకి సింధును సాదారంగా ఆహ్వానిస్తున్నాం. గ్యాటోరేడ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు సింధు సరైన వ్యక్తి అని భావిస్తున్నాం. ఆమెతో భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉందని పెప్సికో ఇండియా బేవరేజ్‌ విభాగం వైస్ ప్రెసిడెంట్ విపుల్‌ ప్రకాశ్‌ తెలిపారు.

అరుదైన గౌరవంగా భావిస్తున్నా

అరుదైన గౌరవంగా భావిస్తున్నా

ప్రపంచంలోని పలువురు క్రీడా దిగ్గజాలతో కూడిన గ్యాటోరేడ్‌లో భాగస్వామి అవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని పీవీ సింధు చెప్పింది. గతంలో స్టార్‌ ప్లేయర్స్‌ ఉసేన్‌ బోల్ట్‌, సెరెనా విలియమ్స్‌, మెస్సీలు గ్యాటోరేడ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. భారత్ మార్కెట్‌లోకి 2004లో ఈ స్పోర్ట్స్ డ్రింక్ విడుదలైంది. ఇది భారత క్రికెట్‌ జట్టు సహా పలు జట్లకు అధికారిక స్పోర్ట్స్‌ డ్రింక్‌ కావడం విశేషం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gatorade India on Monday (March 20) announced that it has signed star India shuttler PV Sindhu as its brand ambassador.
Please Wait while comments are loading...