చరిత్ర సృష్టించిన ఫెదరర్: తనదైన స్టైల్లో సెహ్వాగ్ ట్వీట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ సంచలనం సృష్టించాడు. ఎనిమిదోసారి వింబుల్డన్‌ టైటిల్‌ గెలిచి సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈ ప్రపంచ ఐదో ర్యాంకర్ 6-3, 6-1, 6-4తో ప్రపంచ ఆరో ర్యాంకర్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై నెగ్గి ఈ ఘనత సాధించాడు.

తద్వారా ప్రపంచ టెన్నిస్‌లో వింబుల్డన్ టైటిల్ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా ఆర్థర్‌ ఆషె (32 ఏళ్లు, 1976) రికార్డుని అధిగమించాడు. మరోవైపు పీట్ సంప్రాస్ (7 టైటిల్స్) రికార్డును అధిగమించిన సంగతి తెలిసిందే. మొత్తంగా స్విస్ ప్లేయర్‌కు ఇది 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్.

Roger Federer Lifts Record 8th Wimbledon | Oneindia Telugu

అంతేకాదు 1976 తర్వాత వింబుల్డన్‌లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ నెగ్గిన తొలి ఆటగాడు ఫెదరర్. 1976లో జాన్‌ బోర్గ్‌ తొలిసారి ఇలా నెగ్గాడు. ఫైనల్లో సిలిచ్‌ ఏ దశలోనూ రోజర్‌కు పోటీ ఇవ్వలేకపోయాడు. అతను మూడు డబుల్‌ ఫాల్ట్స్‌, 23 అనవసర తప్పిదాలు చేశాడు.

బలమైన ఏస్‌లు కొట్టడంలో దిట్ట అయిన సిలిచ్‌ ఐదు ఏస్‌లు, 16 విన్నర్లకే పరిమితంకాగా.. ఫెడెక్స్‌ 8 ఏస్‌లు, 23 విన్నర్లతో ఆకట్టుకున్నాడు. తన కెరీర్‌లో 11వ వింబుల్డన్ ఫైనల్ ఆడుతున్న ఫెదరర్ (ఓవరాల్‌గా 29వ ఫైనల్) కోర్టులో చాలా ఉల్లాసంగా కనిపించాడు.

భారీ ఏస్‌లు కొడతాడని పేరున్న సిలిచ్‌ను బేస్‌లైన్‌కు పరిమితం చేస్తూ తన రాకెట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. గంటా 41 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రోజర్ ఫెదరర్ ఎక్కడా తడబడక పోవడం విశేషం.

వీరేంద్ర సెహ్వాగ్

'ఛాంపియన్లకే ఛాంపియన్‌వి నీవు. మ్యాచ్ చూడటం ఓ పండుగ. 8వ వింబుల్డన్ టైటిల్ గెలిచిన నీకు అభినందనలు' అని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

జీన్ కింగ్

'ఛాంపియన్‌గా 8వ వింబుల్డన్ టైటిల్ గెలవడం ఓ అద్భుతం' అని జీన్ కింగ్ ట్వీట్ చేసింది.

మారియన్ బర్టోలి

'నిజంగా ఇది చారిత్రాత్మక ఘట్టం' అని మారియన్ బర్టోలి తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.

వీవీఎస్ లక్ష్మణ్

'నిజంగా అద్భుతమైన ప్లేయర్. ఆల్ టైమ్ ఫేవరేట్ టెన్నిస్ ప్లేయర్‌కు అభినందనలు' అని వీవీఎస్ లక్ష్మణ్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు.

విజయ్ అమృత్ రాజ్

'టెన్నిస్‌లోనే అదొక అద్భుతమైన స్టేజి. నాదల్ 10 ఫ్రెంచ్ ఓపెన్స్ గెలిస్తే, ఫెదరర్ 8 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్‌ని గెలిచాడు' అని భారత మాజీ టెన్నిస్ ప్లేయర్ విజయ్ అమృత్ రాజ్ ట్వీట్ చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tennis star Roger Federer on Sunday (July 17) won his record eighth men's singles title at the Wimbledon tennis tournament with a straight sets win over Marin Cilic of Croatia.
Please Wait while comments are loading...