అభిమానుల కోసం పాట పాడిన రోజర్ ఫెదరర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇండియన్ వెల్స్ టోర్నీ అనంతరం బ్రేక్ తీసుకున్న రోజర్ ఫెదరర్ అభిమానుల కోసం ఓ పాట పాడాడు. బాయ్ బ్యాండ్ అంటూ తాను పాడిన పాటకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.

అందులో ఫెద‌ర‌ర్ మ‌రికొంత మంది టెన్నిస్ ఆటగాళ్లతో కలిసి పాట పాడాడు. టామీ హాస్‌, దిమిత్రోవ్‌, జ‌కోవిచ్‌లు కూడా ఫెద‌ర‌ర్‌కు తోడుగా గొంతు కలపడం విశేషం. టెన్నిస్ ప్లేయ‌ర్లు ఆల‌పించిన గీతానికి గ్రామీ అవార్డు గ్ర‌హీత డేవిడ్ ఫోస్ట‌ర్ పియానో అందించారు. ప్ర‌స్తుతం ఇండియన్ వెల్స్ టోర్నీలో ఫెద‌ర‌ర్ సెమీస్‌కు దూసుకెళ్లాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Should this whole tennis thing get old for Roger Federer, Tommy Haas, Grigor Dimitrov and Novak Djokovic, we’d humbly like to suggest that they actually start a boy band because this is delightful.
Please Wait while comments are loading...