రూపా దేవి: ఫిఫా రిఫరీగా ఎన్నికైన తొలి మహిళకి గుర్తింపు లేదు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భారత్‌లో క్రికెట్‌తో పోలిస్తే మిగతా ఆటలంటే కాస్తంత చిన్నచూపు. మిగతా క్రీడల్లో పసిడి పతకాలు సాధించిన ప్రభుత్వం వారిని పెద్దగా గుర్తించదు. మిగతా క్రీడల్లో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించినా ప్రభుత్వం తరుపు నుంచి ఎటువంటి ప్రోత్సహకాలు ఉండవు.

తమిళనాడుకు చెందిన రూపా దేవి విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఇంతకీ ఎవరీ రూపాదేవి అనుకుంటున్నారా? తమిళనాడు నుంచి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ పుట్‌బాల్ అసోసియేషన్ (ఫిఫా) రిఫరీగా ఎన్నికైన తొలి మహిళ. రూపా దేవికి చిన్నప్పటి నుంచే పుట్‌బాల్ అంటే ఇష్టం.

తన స్కూల్ డేస్‌లో సీనియర్లు పుట్‌బాల్ ఆడటం చూసి ఆటపై మక్కువ పెంచుకుంది. డుండిగుల్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న సమయంలో పుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత పలు సబ్ జూనియర్ లెవెల్ టోర్నీలతో పాటు జిల్లా స్థాయి పుట్ బాల్ టోర్నీలో పాల్గొంది.

2006లో రూపా దేవిలో ఉన్న టాలెంట్‌ని గుర్తించి డుండిగుల్‌ పుట్‌బాల్ ఫెడరేషన్ ఆటతో పాటు చదువుకునేందుకు మద్దతుగా నిలిచింది. డుండిగుల్‌లోని జీటీఎన్ కాలేజీలో రూపా కెమిస్ట్రీ విభాగంలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత చిదంబరంలోని అన్నామలై యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీఈడీ) డిగ్రీ పట్టా పొందింది.

ఒక పక్క చదువుతూనే మరోవైపు యూనివర్సిటీ, జాతీయ స్థాయి పుట్‌బాల్ టోర్నీల్లో పాల్గొంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీఈడీ) డిగ్రీలో పట్టా పొందిన తర్వాత డుండిగుల్‌లోని ఓ కాలేజీలో ఉద్యోగంలో చేరింది. అయితే కాలేజీ యాజమాన్యం రూపా దేవిని పుట్‌బాల్ టోర్నీల్లో అనుమతించకపోవడంపై ఉద్యోగానికి రాజీనామా చేసింది.

అయితే 2010లో రూపా దేవి జీవితం మార్చే ఓ సంఘటన చోటు చేసుకుంది. గుండె పోటు కారణంగా తల్లి మరణంగా ఆ మరుసటి ఏడాది 2011లో అధిక రక్తపోటు వల్ల ఆమె తండ్రి మరణించాడు. దీంతో రూపా దేవి పూర్తిగా బాధలో మునిగిపోయింది. రూపాదేవికి ఒక సోదరి, సోదరుడు ఉన్నారు.

తల్లిదండ్రులు చనిపోవడంతో ఆర్ధిక సమస్యలు

తల్లిదండ్రులు చనిపోవడంతో ఆర్ధిక సమస్యలు

తల్లిదండ్రులు చనిపోవడంతో ఒక్కసారిగా ఆమె ఆర్ధిక సమస్యలను ఎదుర్కొవాల్సి వచ్చింది. అదే సమయంలో పలువురు స్నేహితులు ఆమెకు అండగా నిలిచారు. ఈ సమయంలో పుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడటంతో పాటు మ్యాచ్ రిఫరీవైపు కూడా దృష్టిసారించింది. 2010 తర్వాత రెండు సంవత్సరాల పాటు జాతీయ స్ధాయిలో పుట్ బాల్ టోర్నీలేమీ లేకపోవడంతో సీనియర్ రిఫరీలు ఆమెను రిఫరీ వైపు ఎందుకు ప్రయత్నించకూడదని సూచించారు.

From Big B to Akshay, BTown cheer Indian Women's cricket team
జీవితాన్ని మార్చిన 2012

జీవితాన్ని మార్చిన 2012

ఒక్కసారి గాయాలు పాలైతే మళ్లీ తిరిగి జీవితంలో మ్యాచ్ రిఫరీ కాలేవని కూడా రూపాకు సూచించారు. తన సీనియర్లు సూచించిన మేరకు 2012లో రూపా దేవి రిఫరీ డెవల్మెంట్ స్కూల్‌లో చేరింది. ఆ తర్వాత జాతీయ స్ధాయి సబ్ జూనియర్, జూనియర్ స్థాయి మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహారించింది. ఆల్ ఇండియా పుట్‌బాల్ ఫెడరేషన్ నిర్వహించిన పరీక్షల్లో కూడా పాస్ అయింది. ఆ తర్వాత రూపా దేవి తన జీవితంలో తిరిగి వెనక్కి చూసుకోలేదు. భారత్‌లో జరిగిన పలు అంతర్జాతీయ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించింది.

సీనియర్ ఉమెన్ మ్యాచ్‌లకు రిఫరీగా

సీనియర్ ఉమెన్ మ్యాచ్‌లకు రిఫరీగా

శ్రీలంకలో జరిగిన వెస్ట్ ఆసియా టోర్నీలో కూడా రిఫరీగా వ్యవహరించింది. మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో జరిగిన సీనియర్ ఉమెన్ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించింది. ఇలా మూడు సంవత్సరాలు భారత్‌లోని వివిధ మ్యాచ్‌లకు రిఫరీ వ్యవహరించిన రూపా ఆ తర్వాత ఫిఫా నిర్వహించిన రిఫరీ పరీక్షలో పాస్ అయింది. మొదటి నుంచి రూపా వెన్నంటే ఉండి ఆమెకు మద్దతుగా నిలిచిన డుండిగుల్ పుట్‌బాల్ ఫెడరేషన్ సెక్రటరీ ఎస్.షణ్ముగన్ ఎంతగానో సంతోషించారు.

ఎంతగానో సంతోషించిన డుండిగుల్ పుట్‌బాల్ ఫెడరేషన్

ఎంతగానో సంతోషించిన డుండిగుల్ పుట్‌బాల్ ఫెడరేషన్

"రూపాను ఈ స్ధాయికి తీసుకొచ్చేందుకు ఎంతో మంది ప్రొపెషనల్స్‌ను ఇక్కడికి తీసుకొచ్చాం. మ్యాచ్ రిఫరీగా ఆమెన ఎంతో ప్రోత్సహించాం. తమిళనాడు నుంచి తొలి మ్యాచ్ రిఫరీగా ఫిఫా ఎంపిక చేయడం సంతోషంగా ఉంది" అని అన్నారు. పుట్‌బాల్ అంటే తనకు ప్రేమ కాబట్టి ఆ క్రీడపై ఎంతో మక్కువ పెంచుకుని తాను ఈ స్ధాయికి చేరానని రూపా ఎప్పుడూ చెబుతుంటూ ఉంటుంది.

భారత్ నుంచి కేవలం ఐదుగురు మహిళాలు మాత్రమే

భారత్ నుంచి కేవలం ఐదుగురు మహిళాలు మాత్రమే

'నాకు పుట్‌బాల్ అంటే ఇష్టం. అందుకే నాకు ఈ అవకాశం వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. జూనియర్ మ్యాచ్‌లతో పాటు పురుషుల సీనియర్ మ్యాచ్‌లకు రిఫరీగా ఉన్నా' అని రూపా దేవి వెల్లడించింది. 2014లో రూపా దేవికి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌‌గా ఉద్యోగం కూడా వచ్చింది. అందరి మహిళా క్రీడాకారిణిలు లాగే రూపా కూడా క్రీడల్లో మహిళలు కూడా రాణించాలని బలంగా కోరుకుంటుంది. భారత్ నుంచి కేవలం ఐదుగురు మహిళా పుట్‌బాల్ రిఫరీలు మాత్రమే ఉండటం విశేషం. అందులో రూపా దేవి ఒకరు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nineteen-year-old Rupa Devi is Tamil Nadu's FIFA-approved first woman referee and her first assignment is to officiate matches in Shillong at the South Asian Games starting February 5.
Please Wait while comments are loading...